తెలంగాణ భూములన్నీ ఆంధ్రా ‘తోట’ రాముడికేనా?

– మియాపూర్‌లో 4 వేల కోట్ల భూములు తోటకు అప్పగించిన కేసీఆర్
– సోమేష్ కనుసన్నలలోనే మియాపూర్ భూ కుంభకోణం
– ‘తోట’ విషయంలో సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
– 8 ఎకరాలకు ఒక న్యాయం, 40 ఎకరాలకు మరో న్యాయమా?
– కేసీఆర్ ఆ 40 ఎకరాలను తోట ఆదిత్య కన్‌స్ట్రక్షన్‌కు అప్పగించారు
– సర్వే నెంబర్ 78 అక్రమాలపై సుప్రీంకోర్టుకు వెళతాం
– ఖమ్మం బీఆర్‌ఎస్ సభ ఖర్చంతా తోట చంద్రశేఖరే పెడుతున్నారు
– బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు సంచలన ఆరోపణలు
– ఖమ్మం బీఆర్‌ఎస్ తొలి సభ ముందురోజు బీజేపీ రాజకీయ బాంబు

ఖమ్మం వేదికగా జరగనున్న బీఆర్‌ఎస్ తొలి బహిరంగసభ ముందు రోజు, బీజేపీ పెద్ద బాంబు పేల్చింది. బీఆర్‌ఎస్ ఏపీ అధ్యక్షుడిగా నియమితులైన తోట చంద్రశేఖర్ భూ కుంభకోణాన్ని బీజేపీ ఎమ్మెల్యే, ప్రముఖ న్యాయవాది రఘునందన్‌రావు బయటపెట్టడం సంచలనం సృష్టిస్తోంది. 4 వేల కోట్ల విలువైన తెలంగాణ భూములు ‘తోట’కు అప్పగిస్తున్నారంటూ రఘునందన్ సంచలన ఆరోపణలు చేశారు.
బిహార్‌పై ప్రేమ ఉన్నందుకే ఆ రాష్ట్రానికి చెందిన అధికారికి డీజీపీ పదవి ఇచ్చారన్నారు. తన పనులు వేగంగా జరిగేందుకే, డైరక్ట్ ఐఏఎస్‌లను కాకుండా, కన్‌ఫర్డ్ ఐఏఎస్‌లను నియమించారన్నారు. అందులో భాగమే తోటచంద్రశేఖర్ భూ కుంభకోణమని ఆరోపించారు. బీజేపీ బయటపెట్టిన తోట చంద్ర శేఖర్ భూ కుంభకోణం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయింది.ఇది కూడా చదవండి: బీఆర్‌ఎస్‌కు కాపు ‘తోట’లో ఓట్లు రాలతయా?

తోట ఖర్చులతో బీఆర్‌ఎస్ సభ నిర్వహిస్తున్నారన్న రఘునందన్ ఇంకా ఏమన్నారంటే…మియాపూర్ భూ కుంభకోణంపై విచారణ జరిపించాలి. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మియాపూర్ లో , సర్వే నంబర్ 78 లో40 ఎరాలు కొన్నారు . దాదాపు 4 వేల కోట్ల విలువైన తెలంగాణ భూముల్ని కేసీఆర్ తోట చంద్రశేఖర్ కు అప్పగించారు. మియాపూర్ లో వ్యాపార వేత్త సుఖేష్ గుప్తా కొన్న 8 ఎకరాలపై , సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీ వేసిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్.. తోట చంద్రశేఖర్ భూములపై ఎందుకు సుప్రీంకు వెళ్లలే దు? వ్యాపార వేత్త సుఖేశ్ గుప్తాకు ఓ న్యాయం.. తోట చంద్రశేఖర్ కు ఓ న్యాయమా . మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కనుసన్నల్లోనే ఈ భూకుంభ కోణాలు జరిగాయి. కేసీఆర్ కు బీఆర్ఎస్ ఆఫీసర్లంటే ప్రేమ ఎక్కువ. బీఆర్ఎస్ అంటే బీహార్ రాష్ట్ర సమితి.

తోట చంద్రశేఖర్ 40 ఎకరాలు అమ్మి 4 వేల కోట్లు సంపాదించారు. సర్వే 78లో 40ఎకరాల భూములను తోట చంద్రశేఖర్‌కు చెందిన ఆదిత్య కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కేటాయించారు. సర్వే నంబర్ 78లో జరుగుతోన్న అవకతవకలను సుప్రీంకోర్టు దృష్టి తీసుకెళ్తా. 8ఎకరాలకు ఒక న్యాయం, 40ఎకరాలకు ఒక న్యాయమా? భూ దందా కోసమే తోట చంద్రశేఖర్ ను, కేసీఆర్ బీఆర్ఎస్ లో చేర్చుకుని ఏపీకి అధ్యక్షుడిని చేశారు. మియాపూర్ భూములతో లాభపడిన తోట చంద్రశేఖర్, రేపు జరగబోయే ఖమ్మం సభకు ఆర్థిక సహాయం చేశారు. ఇదంతా ముందస్తు ఒప్పందంలో భాగమే.

Leave a Reply