బీజేపీ పార్టీకి సొంత ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా లాంటి సొంత మీడియా లేక అమలు చేస్తున్న పధకాలకు ప్రచారం జరగక, బిజెపి ఏమి చేయలేదని బిజెపి వ్యతిరేకులు ఇప్పటివరకు దుష్ప్రచారం చేస్తున్నారు .
మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడిప్పుడే మా కేంద్ర మంత్రులు , మా పార్టీ నాయకులు ఒకటికి పది సార్లు , మా పథకాల గురించి ప్రజలలో చెబుతుంటే.. ప్రజలు బిజెపి చెప్పేది నిజమే కదా ! అనే విషయాన్ని ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు, ఆలకిస్తున్నారు. గుర్తిస్తున్నారు. ఎందుకంటే బీజేపీ పథకాలు చేసిన అభివృద్ధి అంతా కళ్ళకు కనిపిస్తుంది. అందువలన మీడియా వారు కూడా ఇప్పుడిప్పుడే కొంత ప్రచారం చేస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూస్తే .. ప్రజల మీద విపరీతంగా పన్నులు వేసి, ఇంటి పన్నులు పెంచి, చెత్త మీద పన్ను వేసి, మద్యం రేటు పెంచి ,ఇసుక రేటు పెంచి, సిమెంట్ బస్తా రేట్ పెంచి, కరెంట్ బిల్లు పెంచి, సామాన్య మానవుడు వాడే నిత్యావసర వస్తువుల రేట్లు పెంచి, పెట్రోల్ మీద ,డీజిల్ మీద రేట్లు పెంచి, ప్రజల నడ్డి విరిచేస్తున్నారు. రాష్ట్ర రహదారులు చూస్తే, మోటార్ సైకిల్ లో పోవాలన్నా, ఆటోలో పోవాలన్న, సైకిల్ మీద పోవాలన్నా నడుములు విరిగిపోతున్నాయి. గర్భిణీ లు రోడ్ల మధ్యలోనే ప్రసవించే పరిస్థితి . సామాన్య మానవుడు నడిచే బతికే పరిస్థితి లేకుండా పోతుంది.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకొచ్చిన ఈ మూడు సంవత్సరాలలో, ఐదు లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజల నెత్తిన భారం వేశాడు .రుద్దాడు. ప్రజలు ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలుసుకొని… కేంద్రం చేసిన పనులు , పథకాలు రాష్ట్రం చేసిన పనులు బేరీజు వేసుకుంటే, రాష్ట్రం చేసిన అభివృద్ధి ఎక్కడ ఏమీ లేదనే నిర్ణయానికి వస్తున్నారు.
మేము ఏ పథకాలు అడిగినా,ఎంత డబ్బులు అడిగినా, అడ్డం లేకుండా కేంద్రం మాకు సహాయం చేస్తుంది అని… స్వయంగా వైయస్సార్సీపి ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ తిరుపతిలో మాట్లాడిన విషయం మనమందరం పేపర్లలో చూసాం. స్పెషల్ స్టేటస్ గానీ కేంద్రం ఇస్తే, మేము కేంద్ర ప్రభుత్వంతో అధికారం పంచుకోవడానికి చేరే దానికి కూడా సిద్ధమేనని మాట్లాడుతున్నారు . వీరిది అత్యాశ. . కేంద్రం అడిగిన పథకాలకు అనుమతిస్తుందంటే… ఆంధ్ర ప్రదేశ్ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కనుక, విభజన హామీలను అన్నిటిని అమలు చేస్తుంది తప్ప, ఇంకొకటి కాదు.
ఈ మధ్య మోడీతో, అమిషా తో, బిజెపి కేంద్ర నాయకులతో జగన్మోహన్ రెడ్డి… వాళ్ల నాయకులు , ఎంపీలు ఎక్కువ సన్నిహితంగా ఉంటూ,మేము మీరు ఒకటే అనే ఫీలింగ్ పబ్లిక్ లో తీసుకొచ్చేదానికోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ప్రజలలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. పైపెచ్చు ప్రతి ఒక్కటి రేట్లు పెంచి సామాన్య మానవుడు బతకలేని స్థితిలోకి తెచ్చేసారు .
కేంద్రం చేస్తున్న అభివృద్ధి పథకాలను, నేషనల్ హైవే రోడ్లను, రైల్వేలను,పోర్టులను తదితర అభివృద్ది పనులను తమవిగా చెప్పుకుంటూ, కాలం గడిపేస్తూ ప్రజలను భ్రమ పెడుతున్నారు.
కరణం భాస్కర్
బిజెపి ,
మొబైల్ నెంబర్ 7386128877 .