Suryaa.co.in

Andhra Pradesh

బ్రాహ్మణి, భువనేశ్వరి మహిళలేనా.. అసలు మనుషులేనా..?

– మంత్రి రోజా కన్నీళ్ళు చూసి ఆనందపడతారా..?
– తండ్రిని వెన్నుపోటు పొడిస్తే కన్నీళ్ళు పెట్టని భువనేశ్వరి
– బాలకృష్ణ సర్టిఫైడ్ సైకో..మహిళల పాలిట మరో సైకో పవన్ కల్యాణ్
– రాష్ట్ర అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ

వీళ్ళు మహిళలేనా..? మనుషులేనా..?
ఇంతకాలం, తాను సచ్ఛీలుడునని, నిప్పు అని చెప్పుకుంటూ తిరిగిన చంద్రబాబు ఈరోజు స్కిల్ స్కాంలో రూ. 371 కోట్లు కొట్టేసి, చట్టానికి అడ్డంగా దొరికిపోయాడు. ఆయనను ఏసీబీ కోర్టు రిమాండ్ విధించి జైలుకు పంపితే.. ఆ ఫ్రస్ట్రేషన్ లో టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.టీడీపీ నేతల వికృత చేష్టలు, మాటలు పరాకాష్టకు చేరాయి. ఇందులో భాగంగానే, మంత్రి రోజాపై.. టీడీపీ నేతలు అసభ్యంగా మాట్లాడుతూ, ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు.

బండారు సత్యనారాయణ మాట్లాడిన మాటలకు.. ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. అయితే బండారు మాట్లాడిన నీచమైన మాటలను ఖండించాల్సిందిపోయి, సమర్థిస్తున్న నారా లోకేష్, పవన్ కల్యాణ్ లకు ప్రజలు ఎటూ బుద్ధి చెబుతారు. అయితే, ఆ పార్టీలో మహిళలుగా ఉన్న నారా బ్రాహ్మణి, నారా భువనేశ్వరిలు కూడా ఎందుకు ఖండించలేకపోయారు.?. వీరు ఒక మహిళా మంత్రి రోజా కంట్లో కన్నీళ్ళు చూసి ఆనందపడుతున్నారా?

వీళ్ళు అసలు మహిళలేనా..? కనీసం మనుషులేనా..? అని అనిపిస్తుంది
సోషల్ మీడియాలో వచ్చిన మాటలను పట్టుకుని.. టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, పట్టాభి, బండారు సత్యనారాయణ, అనిత లాంటి వాళ్ళు.. మంత్రి రోజా గారిపై బ్లూ ఫిల్మ్ లు అని నోటికొచ్చినట్లు, అసభ్య పదజాలాలతో మాట్లాడుతూ ఆమె క్యారెక్టర్ ను అసాసినేట్ చేస్తుంటే.. నారా బ్రాహ్మణి, నారా భువనేశ్వరిలు ఖండించటం లేదంటే వీరిని ఏమనాలి..?

రాజకీయాల్లో 20 ఏళ్ళుగా సక్సెస్ ఫుల్ మహిళగా, ఒక ఫైటర్ గా, రెండు సార్లు ఎమ్మెల్యేగా, ప్రస్తుతం మంత్రిగా ఉన్న రోజాపై టీడీపీ నేతలు పనిగట్టుకుని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఇదెంతవరకు న్యాయం..?

మొన్న భువనేశ్వరి దీక్షలో.. ఒక చిన్న పిల్లాడికి ఎల్లో డ్రస్ వేసి.. మహానేత రాజశేఖరరెడ్డి గారి గురించి, ఆయన మరణాన్ని గురించి, మాంసం ముద్దలు గురించి మాట్లాడిస్తుంటే, ఆ మాటలను చూసి భువనేశ్వరి చేతులు ఎత్తి మరీ చప్పట్లు కొడుతున్నారంటే.. వీళ్ళను ఏమనాలి? . వీళ్ళ వికటాట్టహాసాలు చూస్తుంటే.. అసలు వైఎస్ఆర్ గారి మరణానికి కారణభూతులు వీరేనా అనే అనుమానం వస్తుంది.

తండ్రిని వెన్నుపోటు పొడిస్తే కన్నీళ్ళు పెట్టని భువనేశ్వరి
చంద్రబాబు నాయుడు, తన తండ్రికి వెన్నుపోటు పొడిచి, ఆయన పదవిని, ట్రస్టును, పార్టీని, డబ్బులను లాక్కుని, వైస్రాయ్ హోటల్ దగ్గర తండ్రిపై చెప్పులు వేయిస్తే .. భువనేశ్వరికి కన్నీళ్ళు కూడా రాలేదు. ఆరోజు తన భర్త చేసిన తప్పులను నిలదీయలేకపోయింది.ఇదే మాదిరిగా ఆమె దీక్ష చేయలేకపోయింది.
ఆమెను చూస్తుంటే.. ఆమెలో స్త్రీతత్వం పక్కన పెడితే, కనీసం దయ, కరుణ కూడా కనిపించడం లేదు. పైగా, తన భర్త చేసిన అవినీతిని కప్పిపుచ్చుతూ, తమ వ్యాపారంలో 2 శాతం అమ్మితే.. రూ. 400 కోట్లు వస్తాయని మాట్లాడుంది అంటే.. చంద్రబాబు అవినీతిలో ఈమె భాగస్వామ్యం ఎంత అనే అనుమానాలు వస్తున్నాయి.

ఎన్టీఆర్ కన్నీళ్ళనే చూసి కనికరించని, చలించని కూతురు భువనేశ్వరి.. ఈరోజు ఏదో జరిగిపోతుందని మాట్లాడుతున్నారు. ఆరోజుకు అయినా, తన భర్తకు బుద్ధి చెప్పేందుకు భువనేశ్వరి ఈరోజుకు కూడా సిద్ధంగా లేదు. అంటే, చంద్రబాబు ఏం చేసినా, ఎన్ని అరాచకాలు చేసినా వెనకేసుకొస్తున్న నారా భువనేశ్వరిని చూస్తుంటే.. ఈ స్కాములకు కుట్రదారు కూడా ఆమెనేమో అనే అనుమానం వస్తుంది.ఎన్నికల కమిషన్ కు మీరు ప్రకటించిన ఆస్తులు ఎంత.. ఈ వేల కోట్లు చూపించారా. దానిమీద సమాధానం చెప్పండి.

కాల్ మనీ సెక్స్ రాకెట్ పై ఎందుకు మాట్లాడలేదు అనితః
చంద్రబాబు హయాంలో, టీడీపీ ప్రజా ప్రతినిధులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సహకారంతోనే, వారి కనుసన్నల్లోనే కాల్ మనీ సెక్స్ పేరుతో మహిళల జీవితాలతో చెలగాటమాడితే.. మహిళ కాని మహిళగా కాకపోయినా.. కనీసం మనిషిగా అయినా టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత మాట్లాడిందా..?

ఆ ఛాలెంజ్ కు మీరు సిద్ధమా?
బ్లూ ఫిల్మ్ లు మీ దగ్గర ఉంటే బయటపెట్టండి. రోజా గారి భర్త, ఆమె కూడా ఛాలెంజ్ చేశారు. మీరెందుకు సిద్ధంగా లేరు. అంటే మీవన్నీ గాలి మాటలని అర్థం కావటం లేదా..? 175లో 151 అసెంబ్లీ సీట్లు, 25లో 22 ఎంపీలు సాధించి ముఖ్యమంత్రిగా ఉన్న సీఎం గారిని పట్టుకుని వీళ్ళు సైకో అంటారు. మహిళలు కనిపిస్తే ముద్దు అయినా పెట్టుకోవాలి- కడుపు అయినా చేయాలన్న బాలకృష్ణ ఒక సర్టిఫైడ్ సైకో..ఈరోజు మీకు కాపలాదారుడిగా ఉన్న పవన్ కల్యాణ్- మహిళల పట్ల ఎంత దారుణంగా వ్యవహరించాడో దేశమంతా చూసింది. అతను మరో సైకో..ముసలమ్మను కొట్టి మూలన కూర్చోబెట్టినట్టు చంద్రబాబును జైల్లో కూర్చోబెట్టారని నిన్న కూడా పబ్లిక్ మీటింగ్ లో పవన్ కల్యాణ్ మాట్లాడాడు. అంటే మహిళల పట్ల అతనికి ఉన్న గౌరవం ఇదేనా..? వనజాక్షి లాంటి మహిళా అధికారిని కొట్టిన నేతలు కూడా టీడీపీలో కొనసాగుతున్నారంటే.. మీది దుశ్యాసనుల పార్టీ కాదా..?మేం మాధవరెడ్డి హత్య గురించి మాట్లాడితే.. దొంగ ఏడుపులు ఏడ్చిన మీరు.. బ్లూ ఫిలింలు అంటూ రోజా గారి వ్యక్తిత్వ హననంపై ఎందుకు మాట్లాడరు.

మహిళా సాధికారతకు జగన్ పెద్దపీటః
మహిళా సాధికారతకు ముఖ్యమంత్రి జగన్ పెద్ద పీట వేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు, పేదలకు గత నాలుగేళ్ళలో రూ. 2.35 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ఇవ్వటమే కాకుండా, ఎంతో మంది మహిళలను మేయర్లుగా, జెడ్పీ ఛైర్మన్లుగా చేశారు. దేశంలో ఇవాళ 33 శాతం మహిళా రిజర్వేషన్ల కోసం చర్చ జరుగుతుంటే.. అంతకు మించి నామినేటెడ్ పదవుల్లో, నామినేషన్ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. ఏకంగా చట్టం చేసి, మహిళల సాధికారతకు బాటలు వేస్తున్న ముఖ్యమంత్రి జగన్ .

LEAVE A RESPONSE