గన్నవరం ఎయిర్ పోర్టు బంగారం స్మగ్లింగ్ ఘటనలో విచారణ ఎందుకు జరపటం లేదు?

– బంగారం పట్టివేత అబద్ధమైతే సీసీ పుటేజీలు బయటపెట్టాలి
బంగారం స్మగ్లింగ్ చేసేవారిని వదలి దానిపై వచ్చిన వార్తలు షేర్ చేసినవారిని అరెస్ట్ చేస్తారా?
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు

బంగారం స్మగ్లింగ్ చేసిన వారిని వదలి దానిపై మీడియాలో వచ్చిన వార్తలను షేర్ చేసినవార్ని అక్రమంగా అరెస్టులు చేయటం దుర్మార్గపు చర్య. షార్జా నుంచి బంగారం అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎంవో అధికారి భార్య ఇప్పటి వరకు ఎందుకు స్పందించకుండా తలదాచుకుంటున్నారు? గన్నవరం ఎయిర్ పోర్టులో 1.6 కేజీల బంగారం పట్టుబడ్డది నిజమా? కాదా? ఘటన జరిగి నెల రోజులైనా ఎలాంటి విచారణ జరపకుండా పోలీసులు ఎందుకు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు?

ఆమెను విచారించే ధైర్యం ఈ సీఐడీ పోలీసులకు ఉందా.? పేస్ బుక్ లో పోస్టు షేర్ చేసిందుకు 62 ఏళ్ల రంగనాయకమ్మను నోటీసులు పంపి విచారణ చేసిన పోలీసులు బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ సీఎంవో అధికారి భార్యను ఎందుకు విచారించటం లేదు ? సామాన్యులకు ఒక చట్టం, ఉన్నత పదవుల్లో ఉన్నవారికి ఒక చట్టమా? బంగారం స్మగ్లింగ్ చేసే వారిని వదలి దానిపై మీడియాలో వచ్చిన వార్తలను షేర్ చేసినందుకు సీనియర్ జర్నలిస్టు అంకబాబును, టీడీపీ మీడియా కోఆర్డినేటర్ నరేంద్రబాబు ను అన్యాయంగా అరెస్టు చేశారు. వాట్సాప్ లో వచ్చిన వీడియోను ప్వార్డాడ్ చేయటం ఏమైనా దేశ ద్రోహమా? అక్రమ కేసులు అర్దరాత్రి అరెస్టులు చెల్లవని తెలిసి కూడా శారీరకంగా, మానసికంగా హింసిచేందుకు అరెస్టులు చేస్తున్నారు. ఇప్పుడు చేస్తున్న తప్పులకు భవిష్యత్ లో పోలీసులు పశ్చాత్తాపం చెందక తప్పదు.

Leave a Reply