– హైదరాబాద్, ఢిల్లీ కేంద్రాలలో నైనా, వర్చువల్ గానైనా చర్చకు తాను సిద్ధమే
– ఒకే సామాజిక వర్గానికి కీలక పదవులు
– నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేశారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు అన్నారు. ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో ఏ సామాజిక వర్గానికి ఎంత శాతం పదవులను కట్టబెట్టారో, గణాంకాలతో సహా ఆయన వివరించారు. ఒకవేళ తాను తప్పుడు లెక్కలు చెప్పినట్లుగా సామాజిక న్యాయ భేరి పేరిట బస్సు యాత్ర చేసిన మంత్రులు భావిస్తే తాను చర్చకు సిద్ధమేనంటూ సవాల్ విసిరారు.
మంత్రుల ఎవరైనా వర్చువల్ గా చర్చించడానికి సిద్ధంగా ఉన్నానన్న ఆయన, హైదరాబాద్, ఢిల్లీ కేంద్రాలలో నైనా తాను వారితో చర్చకు రెడీ అని పేర్కొన్నారు. శుక్రవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ సామాజిక న్యాయం తాను మాత్రమే చేశానని, ఈ భూమండలం పుట్టిన తర్వాత ఎవ్వరూ చేయలేదన్నట్టుగా ప్రచారం చేసుకోవడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కే చెల్లిందని ఎద్దేవా చేశారు. అలా ప్రచారం చేసుకోవడానికి కూడా ఎంతో సాహసం ఉండాలని అపహాస్యం చేశారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 981 నామినేటెడ్ పదవుల నియామకం చేపడితే, అందులో 742 మంది రెడ్లకు నామినేటెడ్ పదవులను కట్టబెట్టారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.. అంటే నామినేటెడ్ పదవుల్లో రెడ్లకు 76 శాతం పదవులను అప్పగించారన్నారు . ముఖ్యమైన నామినేటెడ్ పదవులను బీసీ సామాజికవర్గానికి చెందిన వారికి కట్టబెట్టలేదన్న ఆయన, రాష్ట్రంలో 12 వైస్ ఛాన్సలర్ పదవులకు గాను పదిమంది వైస్ ఛాన్సలర్లుగా , ముఖ్యమంత్రి సామాజికవర్గానికి చెందిన వారిని నియమించారని వెల్లడించారు. ఇద్దరూ క్రిస్టియన్ లను వైస్ ఛాన్స్ లర్ లు గా నియమించగా, బీసీలకు ఒక్కరికి కూడా అవకాశం కల్పించలేదని చెప్పారు.
ఇక ప్రభుత్వ సలహాదారులుగా 42 మందిని ముఖ్యమంత్రి నియమించుకంటే, అందులో 35 మంది ఇది జగన్ మోహన్ రెడ్డి తన సొంత సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం కల్పించాలని తెలిపారు.. కేవలం ఒకే ఒక్క బీసీ వ్యక్తికి అవకాశం కల్పించార ని, అంటే మొత్తం పదవుల్లో కేవలం రెండు శాతం మాత్రమే నని ఆయన పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ విప్ పదవుల లోనూ నలుగురు రెడ్లు ఉంటే, ఒక్క బీసీ కి మాత్రమే విప్ గా ఛాన్స్ ఇచ్చారని అని చెప్పారు. ప్రభుత్వ న్యాయవాదుల జాబితాలో 30 మంది రెడ్లు ఉండగా, కేవలం ఐదు మంది బీసీలకు మాత్రమే అవకాశం ఇచ్చారని రఘురామకృష్ణంరాజు తెలిపారు.
విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యుల నియామకాల్లో 116 మందికి గాను 32 మంది రెడ్లు ఉండగా నలుగురు మాత్రమే బీసీలు ఉన్నారన్నారు.. అంటే బీసీల్లో చదువుకున్న వారు లేరా అని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. బాగా చదువుకున్న విద్యావేత్తలు ఎంతో మంది ఉన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వం పై విచారణ కోసం ఏర్పాటు చేసిన కమిటీలో తొమ్మిది మంది ఉండగా రెడ్డి లే అధికశాతం ఉన్నారని, ఈ కమిటీలో బీసీలకు ప్రాధాన్యత కల్పించ లేదన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీ ప్రతిపాదిత కమిటీలో ఇద్దరు రెడ్లు ఉండాలని అని చెప్పుకొచ్చారు. తాను చెప్పిన ఈ జాబితాలో ఏమైనా నా తప్పులు ఉంటే, మంత్రి సత్తి బాబు తో సహా ఎవరు చర్చకు వచ్చినా తాను సిద్ధమేనని రఘురామ సవాల్ చేశారు.
సినిమా టికెట్ ఆన్లైన్ విధానం మతిలేని తింగరి చర్య
సినిమా టికెట్ ఆన్లైన్ లోనే విక్రయించాలన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయం మతిలేని తింగరి చర్య అని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ఇకపై సినిమా థియేటర్లో ఆవరణలో టికెట్ కౌంటర్ లు ఉండవని, ఒకవేళ ఉన్నా.. అందులో కంప్యూటర్ ఆపరేటర్ ఉండాలని… దానికి ఆంధ్ర ప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వెబ్ సైట్ ను అనుసంధానం చేసుకుని టికెట్లను ఆన్లైన్ ద్వారా విక్రయించాలని అన్నారు. ఆన్లైన్ టికెట్ విధానం ప్రవేశ పెట్టడం వల్ల, తనలాంటి వారిక సినిమా చూసే అవకాశం ఉండదని… ఎందుకంటే సినిమా చూడాలంటే కంప్యూటర్ పరిజ్ఞానం అయినా ఉండి ఉండాలని, సెల్ ఫోన్ ఆపరేట్ చేయడం తెలిసైనా ఉండాలన్న ఆయన ఈ రెండు తనకు అంత పెద్దగా తెలియవన్నారు.
తనలాగే ఎంతో మంది సామాన్యులు కూడా సినిమాలు చూసే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఏటా 1200 కోట్ల టర్నోవర్ జరిగితే, రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా 60 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అన్నారు. అయితే, సినిమా రంగం పై కక్షతో, ఆన్లైన్ టికెట్ల విక్రయ విధానాన్ని తీసుకువచ్చిన జగన్మోహన్ రెడ్డి, ఎందుకని 35 వేల కోట్ల రూపాయల టర్నోవర్ జరిగే మద్యం షాపులలో డిజిటల్ కరెన్సీ విధానాన్ని తీసుకు రావడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. మద్యం దుకాణాల ద్వారా వసూలు అవుతున్న ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా కొంతమంది ఖాతాలకు వెళుతున్నాయని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలు నిజమేనన్న వాదనలు లేకపోలేదన్నారు . ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.మద్యం దుకాణాల లోడిజిటల్ విధానాన్ని తీసుకురాకుండా చేస్తున్న తాత్సారం చూస్తుంటే ప్రతి ఒక్కరికి అదే అనుమానం వస్తుందని అన్నారు. రాష్ట్రంలోని 1200 సినిమా థియేటర్లలో కేవలం 300 సినిమా థియేటర్లలో మాత్రమే కంప్యూటర్ సౌకర్యాలు కలిగి ఉన్నాయని తెలిపారు.
జి వి ఎల్ ను అడ్డుకోవడం అనైతికం
రిషికొండ వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నా రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అడ్డుకోవడం అనైతికమని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. రిషికొండ పై ఎటువంటి ప్రకృతి విధ్వంసమే జరగకపోతే, ఎందుకని జీవీఎల్ నరసింహారావు ను వెళ్లనివ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. జీవీఎల్ ను అడ్డుకున్న వారు, రేపు వేరే ఎవరినైనా వెళ్ళనిస్తారా అంటూ ప్రశ్నించారు. తను హై కోర్టుకు వెళ్లడానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో తన న్యాయవాది వాస్తవాలను పరిశీలించడానికి నేరుగా రుషికొండ కు వెళితే మంచిదని అన్నారు. అయితే అక్కడ ఒక ప్రభుత్వ అధికారిని నియమించి అతనినీ కులం పేరిట దూషించారన్న కారణంగా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు పెట్టే అవకాశం ఉందని, రేపు ఇదే జరగబోతుందని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు.
ఆయన ఓటు అడిగితే… ఈయన అప్పు అడిగాడు
విదేశీ యాత్ర ముగించుకొని స్వదేశంలో ఉత్తరాలను పట్టుకుని ఉత్తర భారత యాత్ర చేస్తున్న ఉత్తర కుమారుడు జగన్ మోహన్ రెడ్డి అని రఘురామకృష్ణంరాజు అపహాస్యం చేశారు. ప్రధానమంత్రి తో బేటీ అయిన జగన్మోహన్ రెడ్డి సమావేశం కేవలం ఏడు ఎనిమిది నిమిషాల వ్యవధిలోనే ముగిసినట్లు తనకు తెలిసిందన్నారు. పోలవరానికి 55 వేల కోట్ల నిధులు మంజూరు చేయాలని అడిగినట్లుగా సాక్షి దినపత్రికలో రాశారని, అయితే దానికి పెద్దాయన ఏమన్నారో సమాధానం మాత్రం లేదన్నారు గత ప్రభుత్వ హయాములో 16 వేల కోట్ల రూపాయలు ఎక్కువగా అప్పు చేశారని, ఆ అప్పులను తమ ప్రభుత్వ ఖాతాలో జమ చేయకుండా, వివిధ బ్యాంకర్ల నుంచి అదనంగా రుణం పొందేందుకు అనుమతి ఇవ్వాలని కోరినట్లు తెలిసిందన్నారు. అయితే ప్రభుత్వం అనేది నిరంతరంగా కొనసాగే వ్యవస్థ అని, డార్లింగ్ తమ సొంత ఆస్తి లాగా భావించడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎన్డీఏ ప్రభుత్వ భాగస్వామి గా ఉన్నప్పుడే 16 వేల కోట్ల లోటు ను పూడ్చాలని కోరితే, కేంద్రం కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే సహాయం చేసిందన్నారు.
2014 15 వ వార్షిక సంవత్సరానికి 3 4, 570 కోట్ల లోటు ఉందని అప్పటి ప్రభుత్వం… రైతు రుణమాఫీ విద్యుత్ సబ్సిడీలను ఇచ్చారని పేర్కొన్న జగన్మోహన్ రెడ్డి , అందులో మూడు వేల కోట్లు పై చిలుకు మినహాయించి మిగిలిన 31 వేల కోట్లు ఇవ్వలేదని, ఇప్పుడు ఇవ్వాలని కోరినట్లుగా సాక్షి దినపత్రిక కథనంలో పేర్కొన్నారని అని చెప్పారు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి 75 వేల కోట్ల రూపాయల రుణం అడిగామని, కేంద్రం నుంచి ఆ మొత్తం రుణానికి అనుమతి లభించాల్సి ఉండగా, రేపు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా దివాలా తీశాక… కేంద్రం తమకు ఇవ్వలేదని తప్పుడు ప్రచారాన్ని చేసేందుకే ఈ రకమైన కథనాలు రాస్తున్నారని పేర్కొన్నారు.
ఎన్నికల కోసమని ప్రేమించుకుందాం రా… కలిసుందాం రా అని అనుకున్నా, అప్పులకు అనుమతులు అడ్డగోలుగా ఇవ్వరని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఈ దొంగ అప్పుల చూపెట్టి రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని కథలు చెబుతారో చూడాలన్నారు.
తనను కొట్టిన వారికి జైలు శిక్ష తప్పదు
తనను కొట్టిన వారికి కాసింత ఆలస్యమైన నా జైలు శిక్ష తప్పదని అని రఘు రామ కృష్ణం రాజు అన్నారు. పోలీసులు ఎవరినైనా కొట్టడం తప్పేనని, కొట్టిన వారికి ఏడేళ్లు జైలు శిక్ష తప్పదన్నారు అలాగే తనను కొట్టిన వారికి కూడా జైలులో వేయిస్తానని చెప్పారు.. జనగణమన అని మలయాళం సినిమాలు చూశానని , అందులో ప్రభుత్వ పెద్దలు చెప్పారని పిచ్చి పిచ్చి పనులు చేసే ఐపీఎస్ అధికారి జైలు లో కూర్చొని కుమిలి పోతున్నారన్నారు. రేపు తనను హింసించిన వారికి కూడా అదే గతి పట్టనుందని రఘు రామ తెలిపారు.