Suryaa.co.in

Political News

పోలీసులు నేరగాళ్ల పక్షమా?బాధితుల పక్షమా?

ఆంధ్రప్రదేశ్ లో నేరగాళ్ల వర్గంగా పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తోంది. పౌర హక్కులకు రక్షకులుగా పనిచేయాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకుల సేవలో తరిస్తున్నారు. దుష్ట శిక్షణ,శిష్ట రక్షణ ఏపీ పోలీసుల నిఘంటువులో మరుగున పడిపోయింది.

రాష్ట్రంలో ఎంపిక చేసిన కొందరు పోలీసులే రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సామ్రాజ్యం అన్నట్లు చంద్రబాబును అడ్డుకొని హత్యాయత్నం చేసిన వైసిపి నాయకులు మొగుడ్ని కొట్టి మొగసాలకు ఎక్కిన చందంగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పై హత్యాయత్నం ,నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు చెయ్యడం సిగ్గుచేటు.

అంగళ్ళు లో ఇటీవల జరిగిన ఘటనల సందర్బంగా చంద్రబాబుపై ఏ-1 గా కేసు నమోదు చెయ్యడం జగన్ రెడ్డి నీచ,నికృష్ట రాజకీయానికి నిదర్శనం.రాష్ట్రంలో రాజ్యాంగం కల్పించిన హక్కులన్నీ అధికార పార్టీకే వర్తిస్తాయి.వాళ్ళే చంద్రబాబు పై హత్యా యత్నం చేసింది వాళ్ళే చంద్రబాబు పై హత్యాయత్నం కేసులు పెట్టింది వైసిపి ప్రభుత్వమే.

ప్రతిపక్షనాయకుడు ప్రజలలోకి వెళ్ళకూడదు,సభలు పెట్టకూడదు,ప్రభుత్వాన్ని విమర్శించకూడదా?తంబళ్ళ పల్లె ,పుంగనూరు నియోజక వర్గాల్లో ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు పర్యటనలో వైసిపి నాయకులు,పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించి విధ్వంసకాండకు తెగబడిన ఘటనలను దేశ ప్రజలందరూ చూసారు. రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి పేరుతో ప్రతి పక్షనాయకుడు చంద్రబాబు యాత్రను అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు దాడులకు దిగి దారుణంగా వ్యవహరించి చంద్రబాబు పై హత్యాయత్నం చేశారు.

కాన్వాయ్‌లోని కార్లపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేయ్యడం.ప్రధాన రహదారిపై కంటైనర్‌ లారీ, వాహనాలు అడ్డుపెట్టడం వంటి చర్యలతో ప్రతిపక్ష నేతను అడ్డుకోన్నారు. తప్పుడు కేసులతో చంద్రబాబును అడ్డుకోవాలనుకోవడం జగన్ రెడ్డి అవివేకం. ప్రాజెక్టుల విధ్వంసం పై చంద్రబాబు చేస్తున్న యుద్ధభేరిలో ఆయన సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తప్పుడు కేసులు పెట్టి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు.

పుంగనూరు లో జరిగిన సంఘటనలో పోలీసులూ కూడా వైసీపి కార్య కర్తల్లా రాళ్లు విసిరారు. చంద్రబాబు కాన్వాయ్‌ లో వెళ్తున్న టీడీపీ కార్యకర్తల పై రాళ్లు, కర్రలు, చెప్పులతో దాడికి దిగి విధ్వంసం సృష్టించారు.అందుకు టీడీపీ కార్యకర్తలు వారిపై తిరగబడ్డారు. చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో వైసీపీ మూకలు రాళ్ల దాడిని ఆపలేదు. పోలీసులు వాళ్లను అడ్డుకునే ప్రయత్నమూ చేయలేదు. ఎన్‌ఎస్‌జీ కమెండోలు ఆయనకు రక్షణగా నిలిచారు.

ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు పై హత్యాయత్నం చెయ్యడం, దాడులకు దిగడం అనాగరికం,అమానుషం.ఏమిటి ఆయన చేసిన నేరం?ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నించడం నేరమా?ప్రతిపక్షనాయకుడు జగన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ గత చంద్రబాబు ప్రభుత్వం పై ఇష్టాను సారం శోకాలు పెడుతూ చంద్రబాబు ని తిట్టింది జగన్ రెడ్డికి గుర్తు లేదా? గత ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తే జగన్ రెడ్డి కాలు బయట పెట్టేవాడా? అసలు చంద్రబాబు పర్యటిస్తున్న పుంగనూరు బైపాస్ రోడ్డులో వైసిపి కార్యకర్తలకు ఏం పని? వారిని అక్కడ నుండి పోలీసులు ఎందుకు పంపించి వెయ్యలేదు?వందల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు నల్ల చొక్కాలు, నల్ల జెండాలతో నిరసన తెలుపుతున్నా పోలీసులు వారికి రక్షణగా ఉన్నారే తప్ప కవ్వింపు చర్యలు వద్దు అని అడ్డు చెప్పలేదు.

చంద్రబాబు తన సొంత జిల్లాలో పర్యటించే హక్కులేక పోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి?ఇది ప్రజాస్వామ్యమా?లేక రాచరికమా? లేక పుంగనూరు మంత్రి పెద్ది రెడ్డి జాగీరా?పోలీసుల సమక్షంలో చంద్రబాబును అడ్డుకొంటుంటే,దాడులు దిగుతుంటే పోలీసులు వున్నది ఎవరికోసం?నిలువరించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా?ఎన్నాళ్ళు జగన్ రాక్షస పాలనకు నిర్బందాలకు,విధ్వంసానికి పోలీసులు సహకరిస్తారు? హింసకు తావు లేకుండా వారి హక్కును వినియోగించుకునేలా తోడ్పాటు అందించడం పోలీసులు భాధ్యత కాదా? అధికార పార్టీ నాయకులు ఆడమన్నట్లు పోలీసు వ్యవస్థ ఆడటం వల్లనే రాష్ట్రంలో శాంతి భద్రతలు గాలిలో దీపం అయ్యాయి.

వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు పై రాళ్ళ దాడి చేస్తుంటే ఆయన భద్రతా సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అడ్డుగా పెట్టి చంద్రబాబుకు రక్షణ కల్పించారు. లేకుంటే చంద్రబాబు పరిస్థితి ఏమిటి?దాడులు చేసిన వారిని వదిలేసి దాడి చెయ్యబడిన భాగాధితుడు చంద్రబాబు పై కేసులు పెట్టడం ఏమిటి? చంద్రబాబు పై కేసు నమోదు చెయ్యడం చూస్తుంటే జగన్ రెడ్డి ఎంత ఫ్రస్టేషన్ లో వున్నాడో అర్ధం అవుతుంది. పోలీసులు నేరస్థులను రక్షించడానికి ఉన్నారా?బాధితులనే శిక్షించడానికి ఉన్నారా? అంటున్నారు ప్రజలు.

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం,విమర్శించడం నేరమా?ఎంత సేపు ప్రశించే వారిని వేధించడం,అణచివేయ్యడం,కేసులు పెట్టడం,మట్టు పెట్టడమే లక్ష్యంగా పెట్టుకొన్నది జగన్ ప్రభుత్వం. మీ ప్రభుత్వం ఏంచేసినా ప్రతిపక్షం నోరుఎత్త కుండా చేతులు కట్టుకొని వుండాలా?ప్రభుత్వ అవినీతికి,పరిపాలన చేతకాని తనానికి ప్రతిపక్షం భజన చెయ్యాలా?ప్రతిపక్షం ప్రజల పక్షాన నిలుస్తుంది.

మీ దోపిడినీ,మీ వైపల్యాలను,మీ అసమర్ధతను,చేతకాని నిలదీస్తుంది. ప్రజా సమస్యల పై పోరాడు తుంది.ప్రతిపక్షం మీ జేబు సంస్థ కాదు.ప్రతిపక్షం మీకు భజన చెయ్యాలనుకోవడం మీ బ్రమ అవుతుంది.రాష్ట్ర వ్యాప్తంగా తన పరిపాలన పట్ల పెరుగుతున్న వ్యతిరేకత పట్ల జగన్ కళ్ళల్లో, ఆయన శిభిరంలో కలవరం మొదలైంది. తన ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్దపడుతున్నారన్నవిషయం గ్రహించిన జగన్ లో అక్కసు,అసహనం పెరిగిపోతున్నాయి.

నిరాశ, నిస్పృహ అలుముకుంటున్నాయి. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన పాపం నుండి ప్రజల దృష్టి మళ్లించెందుకు ప్రజల కళ్ళకు గంతలు కట్టేందుకు ప్రతి పక్ష నాయకుడు చంద్రబాబు పై తప్పుడు కేసులు పెడుతున్నారు.ప్రతీకార రాజకీయంపై చూపిస్తున్న పట్టుదల,రాష్ట్రాభివృద్ది పై,ప్రజా ప్రయోజనాలు నెరవేర్చడం పై చూపడంలేదు.ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ప్రభుత్వం విధానాలపై ప్రశ్నించే,నిరసన తెలిపే హక్కు ఉంటుంది.గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు.

ఈ విధమైన కక్ష సాధింపులతో ఏ ప్రభుత్వం,ఏ ముఖ్యమంత్రి వ్యవహరించలేదు. పోలీస్ వ్యవస్థను తమ వశం చేసుకొని మొత్తం వాళ్ళతోనే రాజ్యం నడుపుతున్నారు. ప్యాక్షనిజం తలకెక్కించు కొన్న వ్యక్తి పాలనలో ప్రజాస్వామ్యం,రాజ్యాంగం,మానవీయ విలువలు మంటకలిసి పొయ్యాయి.

అధికారం లో వున్నాం ఏదైనా చెయ్యవచ్చు అనుకొంటున్నారు.సమతూకం పాటించాల్సిన పోలీసు వ్యవస్థ అధికార పార్టీని రక్షించడానికి ఆత్రుత చూపిస్తుంది. పాలన లోపూర్తీ గా వైఫల్యం చెంది,ప్రజల్లో తీవ్ర వ్యతిరేక ఉందని కొన్నిసర్వేలు రావడంతో దానిని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు పై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. జగన్ రెడ్డి పాలనలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు దగ్గర నుండి. హైకోర్టు జడ్జిలు,సుప్రీం కోర్టు జడ్జిల వరకు చెయ్యని దాడి లేదు అందరూ బాధితులే. నాలుగేళ్లుగా ఏళ్లుగా రాష్ట్రం రావణ కాష్టంలా రగులుతూనే వుంది, రాష్ట్రం అశాంతి,అలజడులతో అట్టుడిగిపోతుంది.

ప్రతిపక్షనాయకుడు గా వున్న, జడ్ ప్లస్ సెక్యూరిటీ వున్న చంద్రబాబు ను అడ్డుకోవడాన్ని, రాళ్లు వెసి హత్యాయత్నం చేయడాన్నిపోలీస్ వ్యవస్థ ఏ విధంగా సమర్ధించుకొంటారో ప్రజలకు సమాధానం చెప్పాలి.చంద్రబాబు కాన్వాయి పై వైసిపి నాయకులు రాళ్లు,చెప్పులతో దాడి చేస్తే దాన్ని సమర్ధించే విధంగా ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉందని ఎస్పీ సమర్ధించు కొవడం సిగ్గుచేటు .వందల మంది గుండాలతో చంద్రబాబు పై రాళ్లతో దాడికి దిగితే పోలీసులు అడ్డుకోలేదు.

నాలుగేళ్లుగా చంద్రబాబుపై అధికారం పక్షం ఎంత అనైతికంగా,అప్రజాస్వామికంగా అరాచకంగా వ్యవహరిస్తున్నాపోలీసులది ప్రేక్షక పాత్రే అని చెప్పాలి. కొందరు పోలీసులు అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తడానికి అలవాటు పడ్డారు. అధికారంలో వున్న పక్షానికి పోలీసులు మద్దతు గా నిలిస్తే ఆ తరువాత మరో ప్రభుత్వం ఏర్పడితే పోలీసులు అధికారులు వడ్డీతో సహా మూల్యం చెల్లించాల్సి వస్తుందని అత్యున్నత న్యాయస్థానం కూడా వాఖ్యానించింది.

పోలీసులు ప్రజలకు,ప్రతిపక్షాలకు రక్షణ కల్పించడానికి కాకుండా వారికున్న అధికారంతో అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాలు నెరవేరుస్తున్నారు. పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తున్నతీరు పై హైకోర్టు,సుప్రీం కోర్టులు అనేక సార్లు తూర్పార పట్టినా వారిలో మార్పు రావడం లేదు. పోలీసులు పౌరుల హక్కులు కాపాడ డానికి వున్నారు తప్ప పోలిటికల్ బాస్ లు చెప్పినట్లు వ్యవహరెంచేందుకు కాదని హైకోర్టు కటువు గా చెప్పిన విజ్ఞప్తిని పోలీసులు గుర్తుచేసుకోవాలి.

పోలీసు ఉన్నతాధికారులు ఈ విధంగా ముఖ్యమంత్రి మెప్పుకోసం ప్రతిపక్షనాయకుడు తప్పుడు కేసులు పెట్టడం భావ్యమా? జగన్ రెడ్డి ఆదేశాలు గుడ్డిగా అమలుచేసి పోలీసులు చరిత్ర హీనులుగా మిగిలి పోరాదు. ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ తీరు మార్చుకొవాలి. పౌర హక్కులకు రక్షకులుగా పనిచేయాల్సిన పోలీసులు అధికార పార్టీ నాయకుల సేవలో తరించడం మానుకోండి. ఏది ఏమైనా జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని పైవారి ఆదేశానుసారం పోలీసులు ప్రత్యేక అజెండా అమలు పరుస్తున్నారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన కొందరు పోలీసులే రాష్ట్రాన్ని పాలిస్తున్నారు.

Neerukonda Prasad
9849625610

LEAVE A RESPONSE