Suryaa.co.in

Andhra Pradesh

మీరు పోలీసులా… వైసీపీ కార్యకర్తలా?

-వైసీపీ నేతల చేతిలో కీలుబొమ్మలా పోలీసులు
-జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

పోలీసులు జీతం తీసుకుంటుంది ప్రజలు కట్టే పన్నుల్లోంచి వైసీపీ నేతల అక్రమ సంపాదనలోంచి కాదని పోలీసులు గుర్తించాలి. వైసీపీ శాశ్వతంగా అధికారంలో ఉండదని పోలీసులు తెలుసుకోవాలి. జనసేన సిబ్బంది ఇళ్లపై పోలీసుల సోదాలు కక్ష సాధింపే. ఓటమి భయంతో వైసీపీ వికృతచేష్టలు. జనసైనికుల , వీరమహిళల కళ్ళల్లో భయం చూడాలనుకోవటం భ్రమే. వైసీపీ ఎలాంటి యుద్ధం కోరుకుంటే అలాంటి యుద్ధం ఇవ్వటానికి జనసేన సదా సంసిద్ధమే. జనసేన సిబ్బంది ఇళ్లపై సోదాలు చేసిన పోలీసులపై జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవాలి.

LEAVE A RESPONSE