-ఐపిఎల్-2024 క్రికెట్ పోటీలకు పటిష్ట భద్రతా
-కమీషనర్ తరుణ్ జోషి
మార్చి 27న ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో సన్ రైజర్స్ , ముంబై ఇండియన్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ త్వరలో జరగనున్న క్రికెట్ పోటీల నిర్వహణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్ల గురించి రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి నేరేడ్ మెట్‌లోని రాచకొండ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. డీసీపీలు, ఏసిపిలు సన్ రైజర్స్ టీమ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీపీ తరుణ్ జోషి మాట్లాడుతూ, రాచకొండ కమీషనరేట్ పరిధిలో జరుగనున్న మ్యాచ్ ల నిర్వహణకు అవసరమైన అన్ని రకాల సెక్యూరిటీ పరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో క్రికెట్ పోటీలు నిర్వహించడంలో తగిన విధంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
టికెట్ల పంపిణీలో ఎటువంటి గందరగోళం లేకుండా చూడాలని ఐపీఎల్ నిర్వహణ బృందానికి సూచించారు. నకిలీ టికెట్లు అమ్మేవారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని, టికెట్ల పంపిణీ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, ఎటువంటి పుకార్లనూ నమ్మవద్దని తెలిపారు.