పిట్టల దొర రేవంత్‌ రెండు లక్షల రుణమాఫీ ఎలా చేయగలడు?

-మల్కాజ్గిరి బిజెపి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌

కేసీఆర్‌కు బుద్ధిచెబుతూ నీకు అధికార భిక్షపెడితే కళ్లు నెత్తికి ఎక్కాయని మల్కాజ్గిరి బిజెపి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు. పిట్టల దొర లెక్క మాట్లాడే రేవంత్‌ రెండు లక్షల రుణమాఫీ ఎలా చేయగలడాన్నారు. ఎప్పటిలోగా చేస్తారో చెప్పమని డిమాండ్‌ చేస్తున్నా.

కోటిన్నర మంది మహిళలు ఒక్కొక్కరికి 2500 రూపాయలు ఇవ్వాలంటే 30 వేల కోట్లు కావాలి. కానీ 200 కోట్ల బస్సు ఫ్రీ అనగానే మురిసిపోతున్నాం. ఎప్పడు ఇస్తారో నిలదీయండి. ప్రశ్నించే గొంతుక అని రేవంత్‌ కి ఓటు వేస్తే ఒక్క నాడన్నా మల్కాజగిరికి వచ్చారా? ఒక్క రూపాయి అన్న ఇచ్చాడా? బ్రోకర్‌ మాటలు కాదా అన్నారు. నిజంగా నీకు దమ్ముంటే ఈ ప్రాంతం నుండి ఒక అభ్యర్థిని నిలబెట్టు. సరైన అభ్యర్థి దొరకక డబ్బులు ఉన్న వారిని వెతుకుతున్నారు.

చివరి అసెంబ్లీలో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌ మాట్లాడుతూ తెలంగాణ అన్నిట్లో నంబర్‌ వన్‌ అని చెప్పుకున్నారు. దానితో పాటుగా అప్పుల్లో కూడా నంబర్‌ వన్‌ అని చెప్పండి అని నేను చెప్పినా. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరిమీద 1 లక్షా 20 వేల అప్పు ఉంది. పుట్టే బిడ్డ మీద కూడా లక్ష అప్పు ఉంది. కళ్లముందు నిజాన్ని కూడా అదరగొట్టి బ్రతికినవాడు కేసీఆర్‌. మొన్న మల్కాజ్గిరికి మోదీని చూడడానికి చిన్నపిల్లలను భుజాల మీద ఎత్తుకొని వచ్చారు అని చెప్పారు.

Leave a Reply