Home » టెన్నిస్ అండర్ – 14 సింగిల్స్, డబుల్స్ ఆసియన్ విజేతగా నిలిచిన వనపర్తి బాలిక సాన్వీ రెడ్డి

టెన్నిస్ అండర్ – 14 సింగిల్స్, డబుల్స్ ఆసియన్ విజేతగా నిలిచిన వనపర్తి బాలిక సాన్వీ రెడ్డి

-భారత దేశం తరఫున పాల్గొన్న సాన్వీ రెడ్డి
-సాన్వీ రెడ్డిని శాలువాతో సన్మానించి అభినందించిన రాష్ట్ర -ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి

హైదరాబాద్ : టెన్నిస్ అండర్ – 14 సింగిల్స్, డబుల్స్ లో ఆసియన్ విజేతగా భారత దేశం తరఫున ఆడిన వనపర్తి మండలం చిన్నగుంటపల్లి గ్రామానికి చెందిన వీ. సాన్వీ రెడ్డి నిలిచారు. టెన్నిస్ లో భారత దేశం గౌరవాన్ని ఆసియన్ స్థాయిలో సాన్వీ రెడ్డి నిలిపారు.

టెన్నిస్ ఆసియన్ స్థాయి పోటీలు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఈనెల 13 నుంచి 17 వ తేదీ వరకు జరిగాయి. 17 న జరిగిన టెన్నిస్ టోర్నమెంట్ ఫైనల్స్ సింగిల్స్ లో బంగ్లాదేశ్ దేశానికి చెందిన సుమేరా అఖ్తర్ పై 7-6, 6-2 తేడాతో భారత దేశ టెన్నిస్ క్రీడాకారిణి సాన్వీ రెడ్డి విజయం సాధించారు.

డబుల్స్ ఫైనల్స్ లో భారత దేశ జోడి సాన్వీ రెడ్డి, నయీమ హుస్సేన్ బంగ్లాదేశ్ దేశ జోడి హైదర్ హుమేర, సుమేర అఖ్తర్ పై 7-5, 6-2 స్కోర్ తో విజయం సాధించారు. సాన్వీ రెడ్డి సోదరుడు తనీష్ రెడ్డి టెన్నిస్ అండర్ -14 ఆసియన్ స్థాయి పోటీల్లో క్వార్టర్ ఫైనల్స్ వరకు చేరారు.

బంగ్లాదేశ్ నుంచి శనివారం హైదరాబాద్ కు చేరుకున్న సాన్వీ రెడ్డిని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి శాలువాతో సన్మానించి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి భారత దేశం, తెలంగాణ రాష్ట్రం, పాలమూరు – వనపర్తి జిల్లా పేరు ప్రఖ్యాతులు ప్రపంచానికి చాటి చెప్పాలని చిన్నారెడ్డి ఆకాక్షించారు. సాన్వీ రెడ్డి , తనీష్ రెడ్డి తల్లిదండ్రులు వీ. చైతన్య రెడ్డి, సౌమ్యాలను చిన్నారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply