నిమ్స్ లో చికిత్స పొందుతున్న బాధిత పీజీ వైద్య విద్యార్థిని ప్రీతిని పరామర్శించిన ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు

-ఆమె తల్లి తండ్రులను ఓదార్చిన ఉషమ్మ
-ప్రీతి కి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు అభ్యర్థన

హైదారాబాద్/వరంగల్/పాలకుర్తి: పీజీ వైద్య విద్యార్థి వేధింపులకు తాళలేక ఆత్మ హత్యాయత్నానికి పాల్పడి, హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతున్న పాలకుర్తి నియోజకవర్గం మొండ్రాయి గ్రామం గిర్ని తండా కు చెందిన పీజీ విద్యార్థిని ప్రీతిని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి, ఎర్రబెల్లి ట్రస్టు చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు పరామర్శించారు.

ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగయిన వైద్యం అందించాలని అభ్యర్థించారు. అలాగే ప్రీతి తల్లి దండ్రులు శారద, (రైల్వే లో ఏ ఎస్ ఐ) దరావత్ నరేందర్ నాయక్ లతో మాట్లాడారు. జరిగిన పరిస్థితులను తెలుసుకున్నారు. వారికి ధైర్యం చెప్పారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు , కేటీఆర్ భూపాలపల్లి పర్యటన కారణంగా రాలేకపోయారు. అందుకే తను ప్రత్యేకంగా వచ్చినట్లు చెప్పారు. మంత్రి కూడా ఈ విషయమై ఇప్పటికే పోలీసు లతో మాట్లాడి ఆరా తీసినట్లు వారికి చెప్పారు.

Leave a Reply