Suryaa.co.in

Andhra Pradesh

సీఐడీ ఆరోపిస్తున్నట్టు 2016-17లో షెల్ కంపెనీల నుండి టీడీపీకి రూ.27కోట్లు కాదుకదా.. 27 పైసలు కూడా రాలేదు

– ఇన్ కంటాక్స్ డిపార్ట్ మెంట్ కు సమర్పించిన ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ లో 2016-17లో టీడీపీకి వివిధ కంపెనీల ద్వారా చట్టబద్ధంగా వచ్చిన విరాళాలు కేవలం రూ.27 లక్షలు మాత్రమే
– ఇష్టానుసారం సున్నాలు కలిపేసి న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించే చర్యలు ఏఏజీ మానుకోవాలి
– కార్యకర్తల సంక్షేమం కోసం దేశంలో మరేఇతర పార్టీ చేయని విధంగా లక్షా39వేలకోట్ల ఇన్సూరెన్స్ పాలసీ కవరేజ్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్

“ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కు సంబంధించి, చేస్తున్న నిరాధార ఆరోపణల్లో ఇప్పటి వరకు ఈ ముఖ్యమంత్రి..ఇతని ప్రభుత్వం అంత అవినీతి..ఇంత అవినీతి అని గగ్గోలు పెట్టాయి. కానీ నిన్న కోర్టులో ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించిన ఏఏజీ మాటలు విన్నాక జగన్ సర్కార్ స్కిల్ డెవల్ మెంట్ కేసులో కొండను తవ్వి చివరకు ఎలుకను కాదు కదా.. ఎలుకతోకలోని వెంట్రుకను కూడా పట్టుకోలేకపోయారని తేలి పోయింది. ముందు వేలకోట్ల అవినీతి అన్నారు.. తరువాత వందలకోట్లు కొన్ని షెల్ కంపెనీల ద్వారా తెలుగుదేశం పార్టీ ఖాతాల్లోకి నిధులు మళ్లించాయని చెప్పారు. చివరకు అవినీతి బురదపత్రికలో నేడు రాసింది ఏమిటయ్యా అంటే రూ.27 కోట్లు టీడీపీ ఖాతాకు వచ్చాయని.

వ్యక్తిగత ఆదాయ విషయాలైనా.. తెలుగుదేశం పార్టీ ఆర్థిక వ్యవహరాల్లోనైనా చంద్రబాబు నాయుడు, లోకేశ్ లు తొలినుంచీ ఎంతో పారదర్శకంగా వ్యవహరించారు. దేశంలో మరే రాజకీయ నాయకుడు చేయని విధంగా చంద్రబాబు, ఏటా తన మరియు తన కుటుంబసభ్యుల ఆస్తుల వివరాలు, ఆఖరికి చిన్న పిల్లాడైన దేవాన్ష్ ఆస్తి వివరాలు కూడా గత ఎన్నో సంవత్సరాల నుంచి ప్రకటిస్తూ వస్తున్నారు. తన ఆస్తులు ప్రకటించాలని చంద్రబాబునాయుడిని ఎవరూ ఎప్పుడూ అడగలేదు. ప్రజా నాయకుడి గా అది తన బాధ్యతని ఆయన భావించారు.

అదేవిధంగా ఏనాడైనా జగన్ రెడ్డి.. ఆయన తండ్రి దివంగత రాజశేఖర్ రెడ్డి భావించారా? తమపై వస్తున్న ఆరోపణలకు స్వచ్ఛందంగా స్పందించి, వారికి..వారి కుటుంబానికి ఉన్న ఆస్తులు వివరాలు ప్రకటించారా? అలా ప్రకటించలేరు.. ఎందుకంటే వారివద్ద ఉన్నదంతా కొట్టేసిన సొమ్ము కాబట్టి. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీపై ఆరోపణలు చేస్తున్నా రు కాబట్టి.. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్ ను నేడు మీడియా ద్వారా ప్రజల ముందు ఉంచుతున్నాం.

కంపెనీల నుంచి నేరుగా చట్టబద్ధంగా తెలుగుదేశానికి వచ్చిన విరాళాల సొమ్ము 2016-17లో కేవలం రూ.27లక్షలు అయితే.. జగన్ రెడ్డి అతనికి ఊడిగం చేసే లాయ ర్లు షెల్ కంపెనీల నుంచి రూ.27 కోట్లు వచ్చాయని బురదజల్లుతున్నారు
2016-17లో ఓవరాల్ గా (పార్టీ సభ్యత్వాలు.. డొనేషన్స్..ఇతరమార్గాల్లో) తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఆదాయం : రూ.72,92,53,656లు. (డెబ్బైరెండు కోట్ల, తొంభైరెండు లక్షల, యాభైమూడువేల, ఆరువందల యాభై ఆరు రూపాయలు). దానిలో సభ్యత్వాల ద్వారా వచ్చింది రూ.60,75,03,084లు. (అరవైకోట్ల డెబ్బైఐదు లక్షల మూడువేల ఎనబై నాలుగు రూపాయలు) 60లక్షలకు పైగా పార్టీ సభ్యులు…ఒక్కొక్కరు రూ.100 లు చెల్లిస్తే వచ్చిన సొమ్ము ఇది. అలానే వివిధ రకాల వ్యక్తులు, సంస్థల నుంచి డొనేషన్ల రూపంలో వచ్చింది రూ.6,85,80,376లు. (ఆరుకోట్ల ఎనభై ఐదు లక్షల ఎనభైవేల మూడు వందల డెబ్బై ఆరు రూపాయలు).

పార్టీకి ఉన్న ఫిక్సడ్ డిపాజిట్లపై వడ్డీ, రెంటల్ ఆదాయం మరియు ఇతరత్రా వచ్చిన ఆదాయం మొత్తం రూ.5,31,70,196 లు. (ఐదు కోట్ల ముప్పై ఒక్క లక్షల డెబ్బై వేల నూట తొంభై ఆరు రూపాయలు) ఈ మొత్తం కలిపి రూ.72,92,53, 656 లు. 2016-17 సంవత్సరానికి చెందిన మొత్తం ఆదాయ వివరాలను పైసలతో సహా లెక్కకట్టి ప్రజలకు తెలియ చేస్తున్నాం. ఈ విధంగా వచ్చిన సొమ్ములో వివిధ షెల్ కంపెనీల ద్వారా తెలుగు దేశానికి రూ.27 కోట్లు వచ్చాయని జగన్ రెడ్డి అతని తాబేదార్లు ఆరోపిస్తున్నారు.

కానీ వాస్తవంగా 2016-17లో కంపెనీస్ అకౌంట్స్ నుంచి చట్టబద్ధంగా నేరుగా తెలుగుదేశం పార్టీకి వచ్చిన సొమ్ము కేవలం రూ.27 లక్షలు మాత్రమే. కానీ ఈ ప్రభుత్వం న్యాయ స్థానాల్లో దుర్మార్గంగా షెల్ కంపెనీల నుంచి అక్రమంగా రూ.27 కోట్లు వచ్చాయని ఆరోపిస్తోంది మా పార్టీకి ఏఏ మార్గాల్లో ఎంతెంత సొమ్ము వచ్చిందనే వివరాలను ఇన్ కంటాక్స్ డిపార్ట్ మెంట్ కు, ఎన్నికల సంఘానికి ఆధారాలతో సహా తెలియచేశాం.

కానీ ఈముఖ్యమంత్రి,…అతనికి ఊడిగం చేసే కొందరు న్యాయ వాదులు ఇష్టమొచ్చినట్టు సున్నాలు చుట్టేసి అంతొచ్చాయి..ఇంతొచ్చాయి అంటే కుదరదు.అలానే 2015-16లో టీడీపీకి వచ్చిన విరాళాలను పరిశీలిద్దాం… 2015-16తో తెలుగు దేశం పార్టీకి వచ్చిన మొత్తం ఆదాయం కేవలం రూ.15,97,81,421లు. (పదిహేను కోట్ల తొంభై ఏడు లక్షల, ఎనభైఒక్కవేల, నాలుగువందల ఇరవై ఒక్క రూపాయలు) ఆ సంవత్సరం సభ్యత్వాలు పెద్దగా నమోదు కానందున ఆదాయం గణనీయంగా తగ్గింది.

ఈ లెక్కలన్నీ ఇంత కచ్చితంగా కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంటే… నిన్న ప్రభుత్వ న్యాయవాది ఎక్కడ చంద్రబాబుకి బెయిల్ వస్తుందో అన్న భయంతో.. చంద్రబాబు తప్పుచేశాడని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో చివరకు పార్టీకి వచ్చిన విరాళాలు, సభ్యత్వ రుసుములపై సైతం అవినీతి మరక అంటించే ప్రయత్నం చేశాడు. ఏదో ఒకటి చెప్పి.. బురద జల్లితే ఇంకొన్నాళ్లు చంద్రబాబు జైల్లోనే ఉంటారని ఈ ఎత్తు గడకు పాల్పడ్డాడు.

పార్టీకి వచ్చిన ఆదాయంలో అధికభాగం దేశంలో మరే ఇతర పార్టీ ఖర్చు చేయని విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమానికి ఖర్చుచేస్తోంది
మా పార్టీ తరుపున 2016-17లో క్రియాశీల సభ్యత్వాలు పొందిన 69,67,014మంది కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ప్రీమియం కింద న్యూఇండియా అష్యూరెన్స్ కంపెనీకి చెల్లించిన ఇన్సూరెన్స్ ప్రీమియం అక్షరాలా రూ.10,45,05,871లు చెల్లించడం జరిగిం ది. 10కోట్ల45 లక్షల సొమ్ము కార్యకర్తల ఇన్సూరెన్స్ ప్రీమియం కింద భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ఇంతవరకు చెల్లించలేదు. మొత్తంగా 69 లక్షల కార్యకర్తలకు రూ.10కోట్ల45లక్షల ప్రీమియం చెల్లించి, రూ.లక్షా 39వేలకోట్ల విలువైన ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది.

దేశ చరిత్రలో ఏ పార్టీ అయినా తన కార్యకర్తల సంక్షేమం కోసం ఇంత పెద్ద మొత్తంలో రూ.లక్షా 39 వేలకోట్ల విలువైన పాలసీ చేసిందా? ప్రతి ఒక్క సభ్యుడికి రూ.2లక్షల విలువైన ఇన్సూరెన్స్ వర్తించే విధంగా, 69లక్షల మంది సభ్యులకు రూ.లక్షా39 వేలకోట్లకు పాలసీ చేయడం జరిగింది. కార్యకర్తలను కుటుంబసభ్యులతో సమానంగా భావిస్తూ ఇంత చేస్తున్న తెలుగుదేశం పార్టీపై నింద లేస్తావా జగన్ రెడ్డి? తెలుగుదేశానికి చిన్న అవినీతి మరక అంటించడం జగన్ రెడ్డి తరం కాదు.

తన పార్టీ కార్యకర్తలకోసం కనీసం ఎప్పుడైనా రూపాయి సాయం చేశానని జగన్ రెడ్డి చెప్పగలడా?
జగన్ రెడ్డి గానీ, అతని పార్టీలో మరెవరైనా గానీ కార్యకర్తల సంక్షేమం కోసం ఒక్క పైసా ఖర్చుచేశామని చెప్పుకునే ధైర్యం ఉందా? ఇన్సూరెన్స్ చెల్లింపులే కాదు.. ఎన్టీఆర్ ట్రస్ట్, బసవతారకం కాన్సర్ ఆసుపత్రి ద్వారా టీడీపీ కార్యకర్తలతో పాటు ప్రజలకు కూడా మా పార్టీ ఎంతో సేవచేస్తోంది. ఈ విధంగా తన తండ్రి పేరుతో జగన్ రెడ్డి ఏనాడైనా ఒక్క కుటుంబానికైనా సాయం చేశాడా? వేలకోట్ల అవినీతిసొమ్ము మింగిన జగన్ రెడ్డి, కనీసం ఒక్క వెయ్యి రూపాయలైనా తన పార్టీ కార్యకర్తల మేలుకోసం ఖర్చు చేశాడా?

ఊరికొక ప్యాలెస్ నిర్మించుకోవడంపై ఉన్న మోజులో సగమైనా.. ఏ ఊరిలో అయినా ఒక కార్యకర్త గూడు నిలబెట్టడానికి సాయం చేయడంపై చూపాడా? జగన్ రెడ్డికి చేతనైతే కార్యకర్తల సంక్షేమం ఏ విధంగా చేపట్టాలో తెలుగుదేశం పార్టీని చూసి నేర్చుకోవాలి. అంతేగానీ కొన్ని లక్షల మంది కార్యకర్తలను సొంత కుటుంబస భ్యుల్లా భావించి వారి మేలుకై కొన్ని కోట్లు ఖర్చుచేస్తున్న పార్టీపై నిందలు మోపకు.

పార్టీకి వచ్చే విరాళాలపై సీఐడీ ఇదివరకే చంద్రబాబుని ప్రశ్నించిందని.. చంద్రబాబు సమాధానంతో సదరు అధికారులు చేతులెత్తేశారని ఏఏజీకి తెలియదా?
పొన్నవోలు సుధాకర్ రెడ్డి అరుపులు …కేకలతో న్యాయస్థానాల్లో వితండవాదం చేయడం కాదు. ఆయనకు జగన్ రెడ్డిపై అంత మోజే ఉంటే, నల్లకోటు తీసేసి వైసీప కండువా వేసుకొని తిరగొచ్చు. తానొక అడిషనల్ ఏజీ అన్న విషయం ఆయన మర్చి పోతే ఎలా? తమ పార్టీకి సంబంధించిన ఫైనాన్షియల్ ఆడిట్ రిపోర్ట్స్ మొత్తం ఎప్పుడో సీఐడీకి కూడా ఇవ్వడం జరిగింది . సీఐడీ రెండురోజులు చంద్రబాబుని తమ కస్టడీలో ఉంచుకొన్నప్పుడు ఆయన్ని పార్టీ విరాళాలపై కూడా ప్రశ్నించిందనే విషయం అడిషనల్ ఏజీ సుధాకర్ రెడ్డికి తెలుసు.

అప్పుడే చంద్రబాబు చాలా స్పష్టంగా స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అమలు చేసిన ఏ ఒక్క కంపెనీ నుండి అయినా తమ పార్టీకి ఒక్కరూపాయి విరాళం వచ్చినట్టు నిరూపించే ఆధారాలుంటే బయటపెట్టాలని కోరారు. దాంతో అప్పుడే సీఐడీ అధికారులు చేతులెత్తేశారు. అప్పుడే అయిపోయిన విషయా న్ని మరలా కోర్టు ముందుకు తెచ్చి… మరలా విచారించాలని చెప్పడం కేవలం కేసు విచారణను సాగదీయడానికి చేస్తున్న కాలయాపనే.

ఏదో ఒకటి చేసి చంద్రబాబుని ఎక్కువకాలం జైల్లో ఉంచకపోతే, ప్రజల ముందు జగన్ రెడ్డి.. అతని ప్రభుత్వ ఆటలు సాగవు కదా! రాష్ట్రప్రజలందరూ ఈ వాస్తవాలు తెలుసుకొని, జగన్ రెడ్డి కి తగిన విధంగా బుద్ధిచెప్పాలి. తాము వెల్లడించిన వివరాలు తప్పు అని రుజువు చేయగల ధైర్యం వైసీపీవారికి ఉందా?” అని పట్టాభిరామ్ సవాల్ విసిరారు.

LEAVE A RESPONSE