Suryaa.co.in

Andhra Pradesh

హిట్లర్ కూడా మట్టి కలసిపోయారు: అశోక్ గజపతిరాజు

రాష్ట్రంలో రాక్షస పాలన రాజ్యమేలుతోందని టీడీపీ నేత అశోక్ గజపతిరాజు అన్నారు. గురువారం కరుడుగట్టిన నియంత హిట్లర్ కూడా మట్టి కలసిపోయారని ముఖ్యమంత్రి తెలుసుకోలేక పోతున్నారన్నారు. తన రాజకీయ అనుభవంలో ఇంత ఘోరం తానెన్నడూ చూడలేదని తెలిపారు. బి.పి పెరిగితే ఆసుపత్రికి వెళతారు… అంతేగాని టీడీపీ కార్యాలయాలపైకి, నేతల ఇళ్లపైకి వెళ్లి దాడులు చేసే వారిని ముఖ్యమంత్రి ప్రోత్సహించటం హేయమని వ్యాఖ్యానించారు. రాష్ట్రం కోలుకోలేని దెబ్బతింటోందన్నారు. బాధితులపైనే అక్రమ కేసులు పెట్టడం ఏ రాజ్యాంగంలో కూడా ఉండదని చెప్పారు. నాగరిక ప్రపంచంలో మంత్రులు ఏ విధమైన భాష వినయోగిస్తున్నారో అందరికీ తెలుసన్నారు. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్‌రెడ్డి మాట తీరు ఎలా ఉందో ప్రజలందరికీ తెలుసని అన్నారు. శ్రీశైలంలో గిరిప్రదర్శనలకు అనుమతిచ్చి, సింహాచలం గిరి ప్రదర్శనలు, పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అడ్డుకోవటం అన్యాయమన్నారు. అధికార పార్టీ జవాబుదారిగా ఉండాలని అశోక్ గజపతిరాజు హితవుపలికారు.

LEAVE A RESPONSE