– గుంటూరులో పీవీజీ రాజు శతజయంతి సభ
– ఆహ్వానించిన గజల్ శ్రీనివాస్, వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి
గుంటూరు: ఠాగూర్ మెమోరియల్ ట్రస్ట్ కార్యదర్శి, రెడ్ క్రాస్ ఉపాధ్యక్షుడు పి. రామచంద్ర రాజు ప్రముఖ గాయకుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ సోమవారం విజయనగరంలో పి. అశోక్ గజపతి రాజు స్వగృహంలో కలిసి అక్టోబర్ చివరి వారంలో గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరుప తలపెట్టిన పూసపాటి విజయరామ గజపతి రాజు శత జయంతి సభకు విశిష్ట అతిథిగా హాజరు కావలసిందిగా విజ్ఞప్తి చేశారు. పీవీజీ రాజు మనసున్న మహారాజని, దాతృత్వానికి ప్రతీక గా తెలుగు ప్రజల మనస్సులలో చిరస్థాయిగా నిలిచిన మహనీయుని శత జయంతి సభ గుంటూరులో ఘనంగా జరపడానికి కృషి చేస్తున్నామని పి.అశోక గజపతి రాజుకి తెలిపారు.
పీవీజీ రాజు శతజయంతి సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను ఆహ్వానించామని వారు సామకూలంగా స్పందించారని అశోక గజపతి రాజుకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేస్తున్న సంస్థలను, నిస్వార్ధంగా కృషి చేస్తున్న మహనీయులను, పౌర సంస్థల ప్రతినిధులను ఆహ్వనిస్తున్నామని నేటి యువత పివిజి రాజును ఆదర్శంగా తీసుకుని సేవా తత్పరత ను పెంచుకోవాలనే ఉద్దేశ్యంతో శతజయంతి సభను నిర్వహిస్తున్నామని వివరించారు. గుంటూరులో జరిగే రాజు శతజయంతి సభకు విశిష్ట అతిథిగా హాజరవడానికి అంగీకరించిన పి.అశోక గజపతిరాజు కు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.