– నీ దగ్గర పనిచేసే ఉద్యోగులను అడుగు
– సీఎం రేవంత్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చురుక
– సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాలుపై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్: ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాదు కానీ సవాల్ విసురుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి .ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎప్పడు అమలు చేస్తావో చెప్పు. ఇచ్చిన హామీల్లో కనీసం 20% అమలు చేసి సవాల్ చేస్తే దానికి అర్థం ఉంటుంది.
నిరుద్యోగులకు ఉద్యోగాలు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చెయ్యు. విద్యార్థినులకు స్కూటీలు రైతు భరోసా కౌలు రైతులు రైతు కూలీలకు డబ్బులు ఇవ్వు . మీ సెక్రటరియేట్ లో పనిచేస్తున్న ఉద్యోగుల్ని మీ ఆఫీసులో పనిచేస్తున్న ఉద్యోగులని, మీ దగ్గర మీ ఆఫీస్ ల్లో పనిచేస్తున్న డ్రైవర్లని కార్మికులను అడిగితే తెలుస్తది మీ పరిపాలన ఎట్లుందో.
వాళ్లే చెప్తారు మీ పరిపాలన ఎట్లుంది. మీ పరిపాలనపై చర్చకు రావాలా?
ముందు మీ రాహుల్ గాంధీ తో కలిసి ఇచ్చిన హామీలను అమలు చేయి అప్పుడు సవాల్ కు నేను రెడీ.