-చంద్రబాబు తెచ్చిన పరిశ్రమలను జగన్ రెడ్డి తెచ్చినట్టు తప్పుడు ప్రచారం సిగ్గుచేటు
-టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి
టీడీపీ హయాంలో ఒప్పందాలు కుదిరిన పరిశ్రమలకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి శంకుస్ధాపనలు చేసి వాటిని తానే తెచ్చినట్టు సిగ్గులేకుండా ప్రచారం చేసుకుంటున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ద్వజమెత్తారు. జూమ్ లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా జీవీ రెడ్డి మాట్లాడుతూ….టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు దేశ విదేశాలకు తిరిగి అనేక కంపెనీలు, పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చున్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ వాటిని తమ ఘనతగా చెప్పుకోవటం సిగ్గుమాలిన చర్య. ఏటీసీ టైర్ల కంపెనీని తానే తెచ్చినట్టు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సహా వైసీపీ నేతలంతా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
ఒక మ్యానుప్యాక్చరింగ్ కంపెనీ పెట్టాలంటే కనీసం రెండు సంవత్సరాల కాల వ్యవధి పడుతుంది. కంపెనీ పెట్టేముందు ఆ కంపెనీ ప్రతినిధులు లాభ నష్టాలను అంచనా వేసుకుని, ఇతర సౌకర్యాలు, ప్రభుత్వం అందించే సహాయ సహకారాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకుంటారు. ఈ ప్రాసెస్ జరగడానికి సుమారు రెండు సంవత్సరాలు పడుతుంది. కంపెనీ మొదలు పెట్టడానికి రెండు సంవత్సరాలు పడితే, ప్రొడక్షన్ తయారి ప్రారంభం అవడానికి మరో రెండు సంవత్సారాలు పడుతుంది. చంద్రబాబు నాయుడు 2018లో ఏటిసి కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపి వాళ్లకి స్థలం, ట్యాక్స్ బెనిఫిట్స్ ఇచ్చి అన్ని రకాలుగా ఆదుకుంటాం అని చెప్పి ఒప్పందాలు చేసుకున్నారు. తర్వాత 2019 నవంబర్ లో ఏటీసీ కంపెనీ రిజిష్టర్ అయింది. ఇప్పుడు ఉత్పత్తికి ప్రారంభించింది. కానీ జగన్ రెడ్డి మాత్రం ఆ కంపెనీనీ తానే తెచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నారు.
జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన అకృత్యాలు అందరికి తెలుసు. ఉన్న పరిశ్రమలని వెళ్ల గొడుతూ, కక్ష్య సాధింపుతో ఉన్న బిల్డింగ్ లని పడగొట్టడం తప్ప ఎప్పుడైనా పెట్టుబడి దారులతో చర్చలు జరిపారా? ఒకవేళ చర్చలు జరిపినా ఆరు నెలల వ్యవధిలో పరిశ్రమ రాష్ట్రానికి తేవడం సాధ్యమవుతుందా ? జగన్ రెడ్డి అనుకున్న వెంటనే ఏర్పాటు చేయడానికి ఇవేమీ షెల్ కంపెనీలు కావు. చంద్రబాబు హయాంలో పరిశ్రమల స్ధాపనకు ప్రణాళికలు రూపొందించారని ఆధారాలున్నా జగన్ రెడ్డి మాత్రం తన వల్లే పరిశ్రమలు, ఉద్యోగాలు వచ్చాయని చెప్పుకోవడం సిగ్గుచేటు. చంద్రబాబు నాయుడు పరిశ్రమలకు భూములు, రాయితీలు ఇస్తున్నాడని, ప్రజలు కట్టిన పన్నులని పరిశ్రమలకు కట్టబెడుతున్నాడని వాటికి వైసీపీ వ్యతిరేకమని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూములు తిరిగి వెనక్కి ఇచ్చేస్తామని చెప్పారు.
అధికారంలోకి వచ్చాక అనేక పరిశ్రమలని వెళ్ళగొట్టారు. దశబ్దాల నుంచి ఉన్న అమర్ రాజా బ్యాటరీ పరిశ్రమని కాలుష్యం వంకతో వెళ్లగొట్టే ప్రయత్నాలు చేశారు. వైసీపీ పాలనలో దాదాపు 98 పెద్ద పరిశ్రమలు, రూ. 39వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నారు. కానీ కేంద్రం అనేది ఒకటి ఉంటుందని, వాళ్లు ఎకనమిక్ సర్వే చేస్తారు, కేంద్రం కూడ డేటా విడుదల చేస్తుందని జగన్ రెడ్డి మర్చిపోయి వచ్చినవి క్లెయిమ్ చేసుకుంటున్నారు. 2016-2017, 2017-2018, 2018-2019 మూడు ఆర్ధిక సంవత్సరాలలో తెలుగుదేశం ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలతో చర్చలు జరిపి అగ్రిమెంటులు చేయించుకుంటే వైసీపీ నేతలు వెకిళి చేష్టలు చేసి డమ్మి అగ్రిమెంటులు అని తప్పుడు ఆరోపణలు చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు పరిశ్రమలతో చేసుకున్న ఒప్పందాల వల్లే నేడు ఈ పెట్టుబడులు వచ్చాయి.
2016 నుంచి 2019 వరకు ఏపీ ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్ లో నెం. 1 స్ధానంలో నిలిచింది, నాడు చంద్రబాబు నాయుడు చేపట్టిన సంస్కరణ వల్లే నేడు పలితాలొస్తున్నాయి. వైసీపీ పరిశ్రమలకి, అభివృద్ధికి, భూములు ఇవ్వడానికి వ్యతిరేఖం అని, పారిశ్రామిక రాయితీలు ఎందుకు ఇవ్వాలని మాట్లాడారు. కానీ ఇవన్నీ ఇవ్వకపోతే ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి. ప్రభుత్వానికి ట్యాక్స్ లు ఎక్కడి నుంచి వస్తాయి? పరిశ్రమలకు రూ.100 లు వెచ్చిస్తే నేడు ఆ పరిశ్రమలు రూ.1000 లు పన్నులు రూపంలో వస్తాయి.
అసెంబ్లీలో జగన్ రెడ్డి అభివృద్ది అంటే పరిశ్రమలు, బిల్డింగ్ లు కట్టడమా అని, సంక్షేమం అంటే ప్రజలకి డబ్బులు ఇవ్వడం అని చెప్పారు. కానీ వ్యక్తి నేడు అభివృద్ధి అంటే పరిశ్రమలు రావడం అని ఎలా చెప్పుకుంటున్నారు? టీడీపీ హయంలో 2వేల నుంచి 3వేల మిలియన్ల ఎఫ్.డీ.ఐలు వస్తే నేడు వైసీపీ హయాంలో వచ్చింది కేవలం 175 మిలియన్లు మాత్రమే. కర్ణాటకకు 18551 మిలియన్స్, తెలంగాణకు 1585 మిలియన్ల ఎఫ్.డి.ఐలు వస్తే రాష్ట్రానికి కేవలం 175 మిలియన్స్ వచ్చాయంటే వైసీపీ ప్రభుత్వ అసమర్దతకు అద్దంపడుతోంది. గతంలో అధాని రాలేదని జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత వస్తోందని జగన్ రెడ్డి అంటున్నారు, కానీ టీడీపీ హయాంలో వచ్చిన అదానీ డేటా సెంటర్ ని జగన్ రెడ్డి వెళ్లగొట్టడం వాస్తవం కాదా?
ఇప్పుడున్న అదానీ ఎందుకొచ్చిందో ప్రజలకు తెలీదా? రూ. 35,500 కోట్ల విలువైన గంగవరం పోర్టుని కేవలం రూ. 670 కోట్లకి వైసీపీ తెగనమ్మితే దాన్ని కొనుక్కోడానికి అధాని వచ్చారు. రూ.100 విలువ ఉన్న ఆస్తిని రూపాయికో అర్దరూపాయికో అమ్మితే కొనడానికి ఎవరైనా వస్తారు. దాన్ని కూడా గొప్పలు చెప్పుకోవటం సిగ్గుచేటు. పరిశ్రమలు రావాలంటే ముఖ్యమంత్రి, పరిశ్రమల శాఖా మంత్రి విదేశాలకు వెళ్లి కంపెనీ ప్రతినిధులుతో చర్చలు జరపాలి. కానీ జగన్ రెడ్డి ఎప్పుడైనా విదేశాలకు వెళ్లి కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారా?
వెళ్లక వెళ్లక దావోస్ వెళ్లారు. కానీ చేసిందేంటి? టీడీపీ హయాంలోనే ఒప్పందాలు కుదిరిన గ్రీన్ కో పవర్ ప్రాజెక్టుకు మళ్లీ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సీఎం దావోస్ పర్యటనలో ఏపీకి వచ్చిన పెట్టుబడులు 0 అని కేంద్రమే చెప్పింది. వైసీపీ నేతలు చెప్పినట్టు రాష్ట్రానిక విపరీతంగా పరిశ్రమలు, పెట్టుబడులు వస్తే యువత రాష్ట్రాన్ని విడిచి పెట్టి పక్క రాష్ట్రాలకు ఎందుకు వలస వెళ్తున్నారు? రాష్ట్రానికి 31వేల చిన్న పరిశ్రమలు తెచ్చాం అని జగన్ రెడ్డి చెబుతున్నారు. కానీ వాస్తవంగా అన్ని పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయి. పెట్టుబడులు వెళ్ళిపోతుంటే వస్తున్నాయని చెప్పుకుంటున్నారు.
అసలు నేడు వచ్చిన పరిశ్రమలు ఎప్పడు వచ్చాయో రిజిస్ట్రేషన్ డేట్లను వైసీపీ మంత్రులు చెప్పాలి. జగన్ రెడ్డి రివర్స్ పాలనతో పెట్టుబడుల్ని రివర్స్ చేశారు. ఎప్.ఢీ.ఐల గురించి ప్రజలకు తెలియదని వైసీపీ నేతలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. లేని పరిశ్రమలు వచ్చినట్టుగా చెప్పి రాష్ట్రాన్ని ముంచుతున్నారు. పరిశ్రమలు తేవటం చేతకాని జగన్ రెడ్డి ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకు ప్రజలపై భారం మోపుతున్నారు. విద్యుత్ చార్జీలు పెంచారు, ఆస్ది పన్ను, చెత్త పన్ను వసూలు చేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఏపీలో పెట్రోల్, డీజీల్ ధరలు పెంచారు. వైసీపీ నేతలు ఇకనైనా తప్పుడు లెక్కలతో ప్రజల్ని మోసం చేయటం మానుకోవాలని జీ.వీ రెడ్డి హితవు పలికారు.