Suryaa.co.in

Family

ఆత్మ బంధం

తనకి తనవారెవరో..
తనని తనవారుగా భావించుకునేది ఎవరో…??
తెలిసొచ్చేది నిస్సహాయ స్ధితిలో ఉన్నప్పుడే…!!
ఇలాంటి పరిస్ధితులు వృద్యాప్యంలోని వారికి కోకొల్లలు…
నిస్సహాయ స్ధితిలోని వారికి ఆ పెరుమాళ్లే దిక్కు అంటుంటారు.
అందుకే ఇలాంటి నిస్సహాయులు ఆ పెరుమాళ్లు దగ్గరకి చేరుకోవాలని తహతహాలాడుతూంటారు…!!
ఇలాంటి ఉదంతానికి సంబంధించిన ఓ కధే “ఆత్మ బంధం”

తన మేనత్తకి ఆరోగ్యం బాగోలేదని తెలియడంతో తన భర్తతో కలిసి హైదరాబాదు చేరుకుంది వసంత…
ఓల్డ్ ఏజ్ హోం కి వెళ్ళిన వసంత అక్కడ తన మేనత్త శాంతమ్మ పరిస్ధితిని చూసిని భోరున ఏడవడం మొదలు పెట్టింది….
ఎవరూ లేని అనాధలా పని వాళ్ళు పెట్టేదాని కోసం దీనంగా ఎదురు చూపులు చూస్తోంది మేనత్త శాంతమ్మ …పైగా ఎవరిని గుర్తు పట్టడంలేదు.తనలో తానే మాట్లాడుకుంటోంది. గతంలో ఎప్పుడూ “అమ్మలూ…” అంటూ వసంతని చూడగానే దగ్గరకి తీసుకొనే అత్తయ్య తనను ఎవరో అనుకొని మాట్లాడం చూడలేక వెక్కివెక్కి ఏడ్చేసింది వసంత.
వసంత తండ్రి రామయ్య కి శాంతమ్మ ఏకైక చెల్లెలు… చిన్నతనంలోనే తల్లి తండ్రులను పొగొట్టుకున్న రామయ్య తన చెల్లెలు శాంతమ్మని అల్లారు ముద్దుగా పెంచాడు. వాస్తవానికి రామయ్య సాధారణ సంపాదన పరుడే… కాని తన భార్య పుట్టింటివారి ద్వారా కలిసివచ్చిన పొలం పుట్ర, తోటలు ద్వారా మంచి స్ధితి మంతుడు అయ్యాడు…!
రామయ్య భార్య లీల కూడ తన కలుపుకోలుతనంతో ఇంటిల్లిపాదిని, బంధు వర్గాలని ఆకట్టుకునేది.ఈ దంపతులు ఇద్దరు తమకు ఉన్నంతలో అందరికి సహాయపడుతూ ఉండేవారు. రామయ్య భార్య లీల కూడ శాంతమ్మను కన్నబిడ్డ కంటే మమకారంగా పెంచేది.
రామయ్య-లీల దంపతులకు వసంత పుట్టడంతో తన కన్న తల్లే అన్నయ్యకు వసంతగా పుట్టిందని శాంతమ్మ మురిసిపోతూ ఉండేది. “బిడ్డకు తల్లి తండ్రుల దిష్టి తగలొచ్చు..కాని…మేనత్త, మేన మావల దిష్టి మాత్రం తగలదు” అందుకే వసంతను నా నుండి మీకు ఇవ్వను”…. అంటూ అన్నయ్య..వదినలతో మారం చేస్తూ పలుమార్లు వాదనలకు దిగేది శాంతమ్మ…..అంతటి అభిమానంతో వసంతని చూస్తుండేది శాంతమ్మ..!
యుక్త వయస్సుకు రావడంతో రామయ్య తన చెల్లెలు శాంతమ్మకి మంచి సంబంధం చూసి పెళ్ళి చేసి పంపడం జరిగింది. శాంతమ్మ దంపతులకు ఇద్దరు పిల్లలు కలగడం జరిగింది.
“ప్రేమగా చూసేవాళ్ళులేక మనోవేదనతో కుమిలిపోతోంది ..పరిస్ధితులు ఇలాగే ఉంటే ఈమె ఎక్కువ కాలం బ్రతకక పోవచ్చు”… అంటూ తన మేనత్త శాంతమ్మ గురించి ఓల్డ్ ఏజ్ హోంలో ఉన్నవాళ్లు గుసగుసలాడుకోవడం వసంత చెవిన పడింది.
“ఎవ్వరికి పట్టనట్టు అత్తయ్యని ఇట్లా వదిలేయటానికి మీ అందరికి మనస్సు ఎట్లా ఒప్పుకుంది??.. అసలు బావ ఏమి చేస్తున్నాడు?.. అంటూ కోపంగా వసంత తన మేనత్త కూతురును నిలదీసింది.
“అన్నయ్య కూడ హైదరాబాదులోనే ఉంటున్నాడు… కేర్ టేకర్ ని పెట్టి అమ్మని ఈ ఓల్డ్ ఏజ్ హోంలో ఉంచాడు ….తాను మాత్రం ఊరికి అవతల తన సొంత ఇంటిలో ఉంటున్నాడు…”…
“అమ్మ దగ్గర వచ్చే ముసలి వాసన, వృద్ధాప్యంలో చేయాల్సిన సేవల చేయడానికి నామోషి కారణంగా ఈ పనిచేశాడు.. అయినా మా అమ్మకి ఒదినకి ఒక్క క్షణం పడటం లేదు. అని అత్తయ్య కూతురు విజయ కనీళ్లతో ఏకరవు పెడుతోంది…
వారంతంలో ఒకసారి మాత్రం వచ్చి చూసి ఏమీ కావాలన్న పని వాళ్లకు ఇచ్చి వెళతాడు ఇలా తయారయ్యాడు మా అన్నయ్య”…. అని అత్త కూతురు చెప్పడంతో కడుపు తరక్కు పోయింది వసంత కి.
“ఈ ముసలి వయస్సులో అత్తయ్యను ఆదరణగా చూడాల్సిన బాధ్యత మీ వదినకి ఉంది…ఆ మేరకు మీ ఒదినని ఒప్పించాల్సిన బాధ్యత మీకు లేదా…..?? మీ అన్నయ్యకి పెళ్లి అయినప్పుడు అత్తయ్య అంటుండేది ఇప్పుడు తనకు ఇద్దరు కూతుళ్ళు అని…! కోడల్ని కూడ కన్నకూతురు మాదిరిగానే చూసిన అత్తయ్య నేటి పరిస్ధితి చూస్తూంటే కడుపు తరుక్కుపోతోంది”…
“ఒకప్పుడు కోడళ్ళు బాధపడుతున్నారని,అత్తలు సాధిస్తున్నారు అని చెప్పుకునేవారు. దాన్ని కోడరికం అనేవారు.మరి ఇప్పుడు అత్తలు పడే బాధల్ని అత్తరికం అనాలా”?… అంటూ తన మేనత్త కుతురుపై వసంత రుసరుసలాడుతోంది…
“ కనీసం నువ్వు అయినా అత్తయ్యని నీ ఇంటికి తీసుకుపోవచ్చు కదా..!… అంటూ తన కన్నీటిని తుడుచుకుంటూ అత్త కూతురుని నీలదిసింది వసంత.
“మా ఆయన పిల్లలు,అత్త ,మామ. వీళ్లతో సరిపోతుంది నాకు…అయిన అత్తింటికి అమ్మను తెచ్చుకుంటే వూరుకొంటారా ఎవరైనా??… పైగా అన్నయ్యకి నమోషి అంట నేను అమ్మని తీసుకుని వెళితే..!. అందుకే అన్నయ్య ఒప్పుకోవడం లేదు అమ్మని నేను తీసుకుని వెళ్లడానికి…” అని కాస్త నిష్టూరంగా మొహం పెట్టి అత్త కూతురు అనడం నెత్తిమీద పిడుగు పడినంతగా తోచింది వసంతకి. .
అప్పుడు తెలిసొచ్చింది వసంతకి..!… తన అత్త కూతురులో ఎంత కపటత్వం దాగి ఉందో…! ఎందుకంటే తన అల్లుడు అత్త-మామాలు ఎంత మంచివారోశైలజ అత్తయ్య తనకి చెబుతూ ఉండేది..దీనికే డబ్బు దర్పం..ఎక్కువైంది అని..!!
తల్లినే భారంగా భావించిన కొడుకు, నిత్యం నరకం చూపించే కోడలు, స్వార్ధపరురాలైన కూతురు నడుమ శాంతమ్మ అత్తయ్య ఎట్లా నలిగిపోతోందో చూడలేక ఆలోచనలతో భర్తను తీసుకుని అక్కడనుండి నిష్క్రమించింది వసంత.
పిల్లల్ని కని ప్రయోజకులను చేసిన తల్లి తండ్రుల బాధ్యత తీసుకోవడానికి వీళ్ళు చెప్పే సాకులు ఇవా అని.., “చెట్టు అనుకోదు తనకు కాచే కాయల్ని బరువు అని… ..”… నానుడిలోని అంతర్ధాం ఏమిటో ఈ దెబ్బకి తెలిసోచ్చింది వసంతకి..!!… ఇది ఎంతైనా కలికాలం కదా… అని అనుకుంటూనే ఆ రాత్రి నిద్ర లేకుండా తనలో తాను మదనపడిపోతోంది వసంత…. !!
ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది.. నిద్రలోకి జారుకున్న ఉన్న వసంత…
ఆ ఉలికిపాటుకు కారణం తనకు వచ్చిన కల..!
ఆ కల లో మూటముల్లు సద్దుకుని ఎక్కడికో హడవుడిగా ప్రయాణం అవుతోంది వసంత మేనత్త శాంతమ్మ
ఎక్కడికి ప్రయాణం అని వసంత అడుగుతున్నా శాంతమ్మ నుండి సమాధానం లేదు…!
.. కాని ఏదో పిలుపును అందుకున్న తొత్తరపాటు శాంతమ్మ మోహంలో స్షష్టంగా కనిపిస్తోంది..
“ఒకసారి నిన్ను చూసి పోదామని వచ్చాను… నిండు నూరేళ్ళు పసుపు కుంకుమ్మలతో నువ్వు మీ కుటంబం సుఖశాంతులతో, ఆయు ఆరోగ్యలతో జీవించండి… ఇంక బయలు దేరుతున్నాను”.. అంటూ వసంతని అశీర్వదిస్తూ అంతర్ధనంగా మాయం అయింది శాంతమ్మ…!
కలలో జరిగిన ఈ సంఘటనతో కలవరపాటుకు గురైన వసంత ఒక్కసారిగా నిద్రనుండి ఉలిక్కిపడి లేచింది.
ఉలిక్కిపడిన వసంతను భర్త శరత్ ఊరడింపు చేసే ప్రయత్నం చేస్తున్నాడు…!

వంట పనుల్లో నిమగ్నమై ఉన్న వసంత ఒంటింట్లో కాస్త పరగ్గానే ఉంది… రాత్రి తనకు వచ్చిన కల కారణంగా తన మనస్సు కీడును శంకిస్తుండంతో వసంత చాల అసహానంగా ఉంది…
“వంట పూర్తయ్యిందా…లేదా..??”… అంటూ భర్త అరస్తూండటంతో ఒక్కసారిగా వర్తమానంలోకి వచ్చేసింది వంటపనులు చేస్తూ ఆలోచనల్లో ఉన్న వసంత.
“అత్తయ్యని మనం ఇంటికి తెచ్చేసుకుందాం అండీ….” అంటూ భర్త ముందు వెక్కివెక్కి ఏడ్చేస్తోంది వసంత…!
కనీళ్ళను తుడుచుకుంటూ తన మేనత్త గురించి భర్తతో ఏకరువు పెడుతోంది…

“.. మా చిన్నతనంలో తన పిల్లల్నితన పక్కన, నన్ను మాత్రం తన ఒడిలోనే కూర్చోపెట్టుకుని మా ముగ్గురికి గోరు ముద్దలు తినిపించేది అంతటి మామకారం తనకి నేను అంటే… ఎందుకంటే నేను తన అమ్మని అంట..!..అని ఉబికివస్తున్న బాధను తన కొంగుతో అధిమిపట్టుకుంది వసంత….
‘వ్యాపారంలో మా నాన్నగారు నష్టపోయి పంటలు, పొలాలు పొగట్టుకుని మేము కట్టుబట్టలతో హైదరాబాదు చేరుకున్నాం…. ఆ సమయంలో మిగతా బందువులు సహాయం చేయడానికి కనీసం ఓ నాలుగు రోజులుపాటు నీడ కల్పించడానికి కూడ వెనుకంజ వేశారు… కానీ ఆ సమయం లో అత్తయ్య మమ్మల్ని ఇంట్లో పెట్టుకొని మేము జీవితంలో నిలద్రొక్కుకోవడానికి పాటుపడింది,.
నిజంగానే అంత మంచి స్ధాయిలో ఉన్న అత్తయ్య మమ్మల్ని చిన్న చూపు చూస్తుందోమో అని అనుకున్నాం… కాని అత్తయ్య అభిమానానికి చాలా ఆశ్చర్యపోయే దాన్ని…. అలాంటి అత్తయ్యను మనం తీసుకొచ్చేద్దాం అండి అంటూ భర్తతో అంటూ విలపిస్తోంది వసంత…..
ఈ లోపుగా తన సెల్ ఫోన్ రింగ్ అవ్వడంతో… దాన్ని అందుకున్న వసంత ఒక్కసారిగా కుప్పకూలిపోయింది బాధతో….

తన మేనత్త శాంతమ్మ చనిపోయింది…అంటూ బావ ఫోన్ చేస్తూ ఇచ్చిన వర్తమానం అది…! తాను ఉంటున్న ఓల్డ్ ఏజ్ హోంలోనే అత్త చనిపోయిందని అందులోని సారాంశం…!
అప్పుడు తెలిసోచ్చింది వసంతకి.!… తనకు కలలో అత్తయ్య కనపడి ఎక్కడికో వెళుతున్న సంఘటన… హడావుడిగా అన్ని సర్దుకుంటూ నా దగ్గరికి వచ్చి వెళ్తున్నానని చెప్పడం వెనుక పరమార్ధం ఏమిటో..!….అంటే తను చనిపోతున్నానని తెలిసి చివరిసారిగా “నాలో తన అమ్మని చూసుకుని వెళ్ళిందన్న మాట”..!! …ఇదేనేమో “ఆత్మ బంధం” అంటే అనుకుంటూ వసంత ఎక్కి ఎక్కి ఏడ్చేస్తోంది….!!

( శ్రీపాద శ్రీనివాసు)

LEAVE A RESPONSE