Suryaa.co.in

Andhra Pradesh

చంబల్ లోయకంటే వెయ్యి రెట్లు ఎక్కువగా మాచర్లలో దారుణాలు

• ఒక్కొక్కటి బయట పడుతున్న పిన్నెల్లి, అతని సోదరుడి అరాచకాలు
• బూత్ ఏజెంట్ గా కూర్చున్నాడని దళితుడిపై దాడి… అతని భార్య బిడ్డలను చంపేందుకు యత్నం
• దళిత నా కొడకా బూత్ ఏజెంట్ లో కూర్చునే దైర్యం ఎక్కడిదిరా అంటూ దారుణ దూషణలు
• మరో టీడీపీ ఏజెంట్ దుర్గంపూడి వెంకట్రెడ్డి, అతని కుమారులపై హత్యాయత్నం
• అడ్డుకోబోయిన అతని బిడ్డను వివస్త్రను చేసిన వైసీపీ నేతలు
• కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయి పోలీసులు
• పిన్నెల్లి సోదరుల కంటే కిమ్ బెటర్.. బాధితుడు మాణిక్యరావు
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, పిన్నెల్లి బాధితుడు మాణిక్యరావు, అడ్వకేట్ గూడపాటి లక్ష్మీనారాయణ

కత్తిపట్టిన వాడు కత్తితో గొడ్డలి పట్టినవాడు గొడ్డలితో.. దౌర్జన్యం చేసిన వాడు దౌర్జన్యానికి బలికావడం ఖాయం. పిన్నెల్లి అరాచకాలు రోజుకు ఒకటి బయటకు వస్తున్నాయి. ఇప్పుడు పిన్నెల్లిపై పోలీసు శాఖ జూలు విప్పుతోంది. పిన్నెల్లి బాధితులు ఒక్కొక్కరు బయటకు వచ్చి తమ గొంతు వినిపిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు.

మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. నా ఎస్సీ, నాఎస్టీ నా బీసీలు అంటూనే జగన్ రెడ్డి అతని తొత్తులు దళితులపైనే దాడులకు తెగబడుతున్నారు. వారి గొంతులు కోస్తున్నారు. పిన్నెల్లి సొంత గ్రామం కండ్లకుంటలో నోముల మాణిక్యరావుపై దాడే దీనికి నిదర్శనం. ఒక దళిత బిడ్డ టీడీపీకి మద్దతుగా బూత్ ఏజెంట్ గా కూర్చుంటే.. మాదిగ నా కొడక నువ్వు బూత్ ఏజెంట్ గా కూర్చునే వాడివారా అంటూ అతన్ని నానా దుర్భాషలాడుతూ.. అతనిపై రాడ్లు కర్రలతో దాడి చేశాడు. ఇంత జరుగుతున్నా అక్కడ ఉన్న పోలీసులు చోద్యం చూశారే కాని అడ్డుకోలేదు.

వెంకట్రామిరెడ్డి కాళ్ల మీద పడినా వదలకుండా మాణిక్యాలరావు భార్య బిడ్డలపై ఘోరంగా దాడి చేసి దాన్ని వీడియో తీసి మాణిక్యరావుకు చూపించారంటే మనం ప్రజా స్వామ్యంలో ఉన్నామా అనిపిస్తుంది. మరో టీడీపీ ఏజెంట్ దుర్గంపూడి వెంకట్రెడ్డి అతని కొడ్డుకులను కర్రలు రాడ్లతో కొట్టి చంపేందుకు యత్నిస్తుంటే అడ్డుకోబోయి అతని బిడ్డను వివస్త్రను చేయడం మహిళా లోకానే కించరచడం. ఇటువంటి కిరాతకులను చెప్పుతో కొట్టాలి.

దళిత బిడ్డ ఏజెంటుగా కూర్చోవడం పాపమా? ఎస్సీలు ఈ రాష్ట్రంలో ఉండకూడదా..? ఎస్సీలపై ఇంత అరాచకంగా దాడులు జరుగుతుంటే పోలీసులు పట్టించుకోరా? 13 రోజుల నుండి మణిక్యరావు భార్య బిడ్డలను వదిలి తిరుగుతున్నాడు. బయట ఊర్లలో ప్రాణాలు రక్షించుకుంటున్నాడు. మాచర్ల వెళితే మాణిక్యరావును చంపేస్తారు. వెంటనే పిన్నెల్లి, అతిని సోదరుడు వెంకట్రామిరెడ్డి అరాచకాలపై డీజీపీ, ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టాలి. చంబల్ లోయ దుర్మార్గుల కంటే పిన్నెల్లి అతని సోదరుడు వెంకట్రామిరెడ్డిలు వెయ్యిరెట్లు దారుణంగా ఉన్నారు. వీళ్ల అరాచకాలు చూస్తుంటే ఏపీలో ఉన్నామా? టెర్రరిస్ట్ గ్రామాల్లో ఉన్నామా అనిపిస్తుంది. పోలీసు వ్యవస్థ బెల్ట్ ఇకనైనా టైట్ చేసి అరాచకపరులను కటకటాల్లోకి నెట్టాలి.

బాధితుడు మాణిక్యరావు మాట్లాడుతూ… పిన్నెల్లి సోదరుడు వెంకట్రామిరెడ్డి మా సొంత ఊరు కండ్లకుంట గ్రామం బూత్ నెంబర్ 144 లోకి వచ్చి నన్ను దుర్భాషలాడారు. అంతుచూస్తామని నన్ను బెదిరించాడు. పోలింగ్ కేంద్రంలోనే పిన్నెల్లి అనుచరులు నన్ను కొట్టారు. టీడీపీ ఏజెంట్ గా కూర్చునే ధైర్యం నీకెక్కడిది మాదిగ నా కొడక అంటూ తిడుతూ దాడి చేశారు. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి అతని అనుచరులు 300 మంది నా కుటుంబంపైన దాడి చేశారు. పిన్నెల్లి నా పెద్దకుమారుడి పొత్తికడుపుపై తన్నాడు.

వెకంట్రామిరెడ్డి అతని అనుచరులు నా చిన్న కొడుకుని, భార్యను రాడ్లు కర్రలతో కొట్టారు. నా భార్య బిడ్డలను కొడుతున్న దృశ్యాలను వారి అనుచరుల మొబైల్ కు వీడియో కాల్ చేసి.. అది నాకు చూపిస్తూ నన్ను హేళన చేస్తూ… చూడరా నీ భార్య బిడ్డల దుస్థితి అంటూ ఇప్పటికైన నా కొడక బూత్ నుండి బయటకు వెళతావా లేదా అని దుర్భాషలాడతూ మానసికంగా నన్ను హింసించి మనో వేదనకు గురి చేశారు.

మా ఇంటికి అతి సమీపంలో ఉన్న మరో బూత్ ఏజెంట్ అయిన దుర్గంపూడి వెంకట్రరెడ్డి ఇంటిపైకి వెళ్లి వెంకట్రరెడ్డి కుమారులను తీవ్రంగా కొడుతున్న సందర్భంలో వెంకట్రరెడ్డి కుమార్తె అడ్డు వస్తే ఆమెను కూడా వివస్త్రను చేసి పైశాచిక ఆనందం పొందారు. నా భార్య భయపడుతూ ఫోన్ చేసి వారు ఎంతకైనా తెగిస్తారు దయచేసి ఇక్కడికి రావద్దు.. చంపేస్తారని చెప్పగా నేను ట్రైనీ డీఎస్పీ జగదీష్ దగ్గరకు వెళ్లి జరిగింది అంతా చెప్పి నా ప్రాణాలతో పాటు నా కుటుంబాన్ని, దుర్గంపూడి వెంకట్రెడ్డి కుటుంబాన్ని కాపాడాలని వేడుకున్నాను.

నా భార్య బిడ్డలను కొట్టవద్దని నా వదిన పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి కాళ్లు పట్టుకుని బ్రతిమాలినా వదల్లేదు. నా కుటుంబంపై పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి అంత కక్ష ఎందకు? పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి భయపడి అధికారులు నోరు మెదపలేదు. నాపై దాడి చేస్తున్నా పోలీసులు స్పందించలేదు. ట్రైనీ డీఎస్పీ జగదీష్ ఉండగానే పిన్నెల్లి రామకృష్ణ, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డి నాపై దాడికి యత్నించారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని డీఎస్పీని సైతం వెంకట్రామిరెడ్డి బెదిరించాడు.

వెంటనే డీఎస్పీ నాతో పాటు మరో ముగ్గురు టీడీపీ ఏజెంట్లను వారి వాహనంలో ఎక్కించుకుని వెల్దుర్తి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. మాకు భద్రత కల్పించాలని చెప్పి వెళ్లిపోయారు. అక్కడి పోలీసులు మా ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించారు. తరువాత టీడీపీ కార్యకర్తలు వచ్చి కూటమి అభ్యర్థి అయిన జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటికి తీసుకెళ్లారు. ఆ తరువాత ప్రాణ భయంతో హైదరాబాద్ పారిపోయాను.

టీడీపీ అధినేత చంద్రబాబు నాపై జరిగిన దాడిని తెలుసుకుని నాకు ఫోన్ చేసి పరామర్శించారు. నాకు నా కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వర్ల రామయ్యను కలవమని చెప్పారు. వర్ల రామయ్య నేను ఒక దళిత బిడ్డనని తెలుసుకుని ఆయన నాకు అండగా నిలబడ్డారు. నాకు దౌర్యం ఇచ్చారు. ఈ అరాచకాలపై పోలీసులకు ఈసీకి ఫిర్యాదు చేస్తాం.

LEAVE A RESPONSE