Suryaa.co.in

Telangana

సైబరాబాద్ పోలీసుల కోసం ఆటోమేటెడ్ బీపీ మెషిన్

సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆటోమేటెడ్ బీపీ మెషిన్న్ని ప్రారంభించారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగా బ్లడ్ ప్రెషర్ లెవెల్ తెలుసుకోవడానికి శ్రీ శ్రీ హోలిస్టిక్ హోస్పిటల్స్ యజమాన్యం సైబరాబాద్ కమీషనరేట్ లో పోలీసు సిబ్బంది కోసం ఆటోమెటెడ్ బీపీ మెషిన్ ని విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ… ఈ రోజుల్లో బీపీWhats-App-Image-2022-07-16-at-4-53-12-PM చాలా సాధారణ సమస్యగా మారిందని, సరైన సమయంలో బీపీని మానిటర్ (బ్లడ్ ప్రెషర్ మానిటర్) చేయడం ద్వారా, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండగలమన్నారు. సీపీ శ్రీ శ్రీ హోలిస్టిక్ హోస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ రామచంద్ర, సి‌ఈ‌ఓ డాక్టర్ సుబ్బ రావు ల యొక్క ఔదార్యాన్ని ప్రశంసించారు. జాయింట్ సీపీ అవినాష్ మహంతి, క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ సింగన్వర్, ఎస్‌బి ఏడీసీపీ రవికుమార్, ఏసీపీ లు సురేందర్ రావు, నరహరి, శ్రీ శ్రీ హోలిస్టిక్ హోస్పిటల్స్ ఛైర్మన్ డా.రామచంద్ర, సి‌ఈ‌ఓ డా. సుబ్బ రావు, డాక్టర్ సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.Whats-App-Image-2022-07-16-at-4-53-09-PM

LEAVE A RESPONSE