• సీబీఐకి వంద పేజీల లేఖ రాయడం కాదు అవినాశ్ రెడ్డి, తాము అడిగే ప్రశ్నలకు ప్రజలకి సమాధానం చెప్పి, నీ సచ్ఛీలత నిరూపించుకో
• వివేకాహత్యోదంతంలో తన మరియు జగన్మోహన్ రెడ్డి పాత్ర, ప్రమేయం లేదని ప్రజల్ని నమ్మించే ప్రయత్నంలో భాగమే అవినాశ్ రెడ్డి లేఖ
• ఛార్జ్ షీట్ వేసిన తర్వాత తాను ఏదైనా చెప్పాలనుకుంటే కోర్టులో చెప్పాలి గానీ ఈ లేఖల డ్రామా ఏమిటి?
• వివేకాహత్యతో అవినాశ్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి సంబంధంలేకపోతే, తాము అడిగే ప్రశ్నలకు అవినాశ్ రెడ్డి వెంటనే ప్రజలకు సమాధానం చెప్పాలి
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
వివేకానందరెడ్డి హత్యకేసులో ఏ8గా ఉన్న అవినాశ్ రెడ్డి సీబీఐకి వందపేజీల లేఖ రాయడం, కేవలం కేసువిచారణను తప్పుదోవ పట్టించడానికేనని, కేసువిచారించి ఛార్జ్ షీట్ వేశాక, ఏ7గా అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని, ఏ8గా అవినాశ్ రెడ్డి పేరు చేర్చాక కూడా సిగ్గులేకుండా మీడియాస్టంట్లకోసం ప్రజల్ని ఏమార్చడానికి, కడపఎంపీ ప్రయ త్నించడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టా భిరామ్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
“ వివేకాహత్యోదంతంలో జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యుల పాత్ర, ప్రమేయం లేదని, తనకు ఎలాంటి సంబంధంలేదని చెప్పుకునే కుట్రలో భాగంగానే అవినాశ్ రెడ్డి సీబీఐకి లేఖలు రాస్తున్నాడు. వివేకాహత్యకేసులో తనపాత్ర ప్రమేయం లేకపోతే అవినాశ్ రెడ్డికోర్టులో సమాధానంచెప్పుకోవాలిగానీ లేఖలురాయడం ఏమిటి?
కోర్టుల్లో తమ తరుపున వాదనలు వినిపించడానికి లాయర్లకు కోట్లకుకోట్లు తగలేయడం అవినాశ్ రెడ్డి, జగన్ రెడ్డికి తెలిసిందే కదా! ప్రజల్ని మభ్యపెట్టడానికి, మీడియాస్టంట్ కోసం ఉత్తుత్తిలేఖలు రాయడం ఆపేసి, దమ్ము ధైర్యముంటే తాను అడిగే ప్రశ్నలకు అవినాశ్ రెడ్డి వెంటనే ప్రజలకు సమాధానం చెప్పాలి.
హత్యజరిగిన రోజు అర్థరాత్రి 1.37నిమిషాలనుంచి తెల్లవారుజామున 5.18 నిమిషాల వరకు, నిద్రాహారాలు మాని ఏ1 గంగిరెడ్డితో నువ్వు జరిపిన ఫోన్ ఛాటింగ్ పై ఏం సమాధానం చెబుతావు అవినాశ్ రెడ్డి?
ప్రశ్న-1 : అవినాశ్ రెడ్డి వంద పేజీలలేఖలో వివేకాహత్యతో తనకు ఎటువంటి సంబంధంలేదని నమ్మించేందుకు తీవ్రంగా ప్రయాస పడినప్పటికీ వాస్తవాలు అందుకు పూర్తిభిన్నంగా ఉన్నాయి. సీబీఐ ఛార్జ్ షీట్ (పేజీ నెం-69, 70) లో అవినాశ్ రెడ్డి 2019 మార్చి14 అర్థరాత్రి 1.37 నిమిషాల నుంచి, వివేకానందరెడ్డిని అత్యంత కిరాతకంగా చంపిన ఏ1 గంగిరెడ్డితో వాట్సాప్ లో ఛాట్ చేస్తూ, రాత్రంతా చాలా బిజీగా గడిపినట్టు పేర్కొనబడింది.
హత్యకేసులో ఏ1గా ఉన్న గంగిరెడ్డితో అవినాశ్ రెడ్డి అర్థరా త్రి 1.37 నుంచి తెల్లవారాక 5.18 నిమిషాలవరకు ఛాటింగ్ చేయాల్సిన అవసరం ఏమిటి? మర్దర్ ఏ విధంగా చెయ్యాలి..సాక్ష్యాలు ఎలా రూపు మాపాలి అన్న అంశాలు ప్రతినిమిషం సూచనలు ఇవ్వడానికేనా గంగిరెడ్డితో అవినాశ్ రెడ్డి ఛాటింగ్ చేసింది? అవినాశ్ రెడ్డి మొబైల్ నంబర్ 99890 67352 నుంచి గంగిరెడ్డి మొబైల్ నంబర్ 94402 81444 ల మధ్య జరిగిన ఛాటింగ్ వివరాలు సీబీఐ ఛార్జ్ షీట్ లోని పేజీ నెం-69, 70లో చాలాస్పష్టంగా పేర్కొన్నారు.
తెల్లవారుజామున 5.18నిమిషాల వరకు గంగిరెడ్డితో ఛాట్ చేశాక, అవినాశ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిరెడ్డికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. అదే సమయంలోజగన్మోహన్ రెడ్డి తమతో మేనిఫెస్టోపై మంత నాలు జరుపుతున్నాడని కృష్ణమోహన్ రెడ్డి, అజయ్ కల్లం సీబీఐకి చెప్పారు. అవినాశ్ రెడ్డి నుంచి తాను అప్పచెప్పిన పని సక్రమంగా పూర్తిచేశాడన్న ధృవీకరణ వచ్చాకే చిన్నాన్నఇకలేరని జగన్ రెడ్డి 5.30నిమిషాలకు తనతో ఉన్న అజయ్ కల్లం తదితరు లకు చెప్పింది నిజంకాదా?
సీఐ శంకరయ్యపై తనలేఖలో బురదజల్లిన అవినాశ్ రెడ్డి, సస్పెండ్ అయిన శంకరయ్యకు అక్టోబర్ 6, 2021న మరలా పోస్టింగ్ ఎందుకిచ్చారో చెప్పాలి
ప్రశ్న–2 : సీఐ శంకరయ్య సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వాస్తవాలు చెప్పకుం డా, పచ్చి అబద్ధాలు వండివార్చారని తనలేఖలో బురదజల్లిన అవినాశ్ రెడ్డి, అతనిపై ఉన్న సస్పెన్షన్ తొలగించి, సీబీఐకి వాంగ్మూల మిచ్చిన కొద్దిరోజుల్లోనే ఆఘమేఘాలపై అక్టోబర్ 06, 2021న తిరిగి పోస్టింగ్ ఎందుకిచ్చారో అవినాశ్ రెడ్డి సమాధానం చెప్పాలి.
అవినాశ్ రెడ్డి తనలేఖలో వివేకానందరెడ్డి కడపఎంపీ సీటుకు తన అభ్యర్థిత్వాన్ని బలపరిచారని తనగెలుపుకోసం ప్రచారంకూడా మొదలుపెట్టారని నమ్మబలికాడు. కానీ షర్మిల సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం అందుకు పూర్తిభిన్నంగా ఉంది
ప్రశ్న- 3 : లేఖలో తనగెలుపుకోసం వివేకానందరెడ్డి చాలాకష్టపడి ప్రచారంచేశాడని, రాత్రింబవళ్లు ఎన్నికలప్రచారంలో నిమగ్నమయ్యాడని రాశాడు. నిజంగా వివేకానంద రెడ్డి, అవినాశ్ రెడ్డి గెలుపుకోసం పనిచేశాడా.. ప్రచారంచేశాడా అనే దానిలోనిజమెంతో జగన్ సొంతచెల్లి షర్మిలే సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పింది. అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి మరికొందరు కలిసి తమచిన్నాన్న వి వేకానందరెడ్డిని ఎమ్మెల్సీగా ఓడించారని చెప్పింది.
అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డిని తాను ఒప్పిస్తాను…కడపఎంపీగా నువ్వే పోటీచేయాలని వివేకానందరెడ్డి తనతో అన్నట్టు షర్మిల చెప్పింది. అవినాశ్ రెడ్డి ఎంపీగా పోటీచేయడానికి వీల్లేదు..నువ్వే చేయాలని మా చిన్నాన్న ఒత్తిడిచేయడంతో తానుకూడా ఒప్పుకున్నాను అని షర్మిల తన వాంగ్మూలంలో చెప్పింది.
షర్మిల వ్యాఖ్యలు అలాఉంటే, వివేకానందరెడ్డి తన గెలుపుకోసం పనిచేశాడని అవినాశ్ రెడ్డి చెప్పడం ఎంతవరకు సరైంది? షర్మిల చెప్పిం దంతా అబద్ధమని చెప్పగల ధైర్యం అవినాశ్ రెడ్డికి ఉందా? షర్మిల స్టేట్ మెంట్ మొత్తం తప్పులతడకని అవినాశ్ రెడ్డి చెప్పగలడా? వివేకానందరెడ్డి యాక్టివ్ గా ఉంటే పులివెం దులలో తమఆటలు సాగవనే జగన్ సహకారంతో అవినాశ్ రెడ్డి వివేకాను అడ్డు తొలగించాడనేది సుస్పష్టమవుతోం ది.
వివేకాహత్య వార్త తెలిసే సమయానికి జమ్మలమడుగు వెళ్తున్న నువ్వు, సూపర్ మ్యాన్ లా కేవలం 3 నిమిషాల 45 సెకన్లలోనే మృతుడి ఇంటికి ఎలావెళ్లావు అవినాశ్ రెడ్డి?
ప్రశ్న -4 : ఉదయం 6.26నిల 16సెకన్లకు తాను ఎన్నిల ప్రచారానికి జమ్మల మడుగు వెళుతుంటే, శివప్రకాశ్ రెడ్డి తనకు ఫోన్ చేసి, వివేకానందరెడ్డి చనిపోయాడని చెప్పా డని, వెంటనే తాను 6.30నిమిషాలకు వివేకాఇంటికి చేరుకున్నానని అవినాశ్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నాడు. అంటే కరెక్ట్ గా 3నిమిషాల 45 సెకన్లలో అవినాశ్ రెడ్డి , వివేకాఇంటికెళ్లిపోయారు.
ఇదెలాసాధ్యమైందో అవినాశ్ రెడ్డి చెప్పాలి. నిమిషాల వ్యవధిలోనే సూపర్ మ్యాన్ లాగా గాల్లో ఎగిరివెళ్లారా? తాను ఎన్నికలప్రచారం కోసం జమ్మలమడుగు వెళ్తున్నానని అవినాశ్ రెడ్డి చెప్పడం పచ్చిఅబద్ధం. రాత్రి నుంచి తెల్లవారుజామువరకు గంగిరెడ్డితో ఫోన్ చాటింగ్ చేశాక, విషయం జగన్ కు చెప్పాక, అతని ముఠా సభ్యులతో కలిసి వ్యవహారాన్ని కప్పిపుచ్చడానికి తనఇంట్లోనే పథక రచన చేస్తూ ఉన్నాడు.
మార్చి 14 అర్థరాత్రినుంచి మార్చి 15 ఉదయం వరకు, వివేకాహత్యకేసు ముద్దాయిలతో ఫోన్ సంభాషణలు చేయాల్సిన అవసరమేంటో సమాధానం చెప్పు అవినాశ్ రెడ్డి
ప్రశ్న – 5 : అవినాశ్ రెడ్డి ఫోన్ కాల్ లిస్ట్ పరిశీలిస్తే, 2019 మార్చి 14వతేదీ రాత్రి 08.11నిమిషాలకు అవినాశ్ రెడ్డి, శివశంకర్ రెడ్డికి ఫోన్ చేశాడు. దానికి కొద్దినిమిషాల ముందే 08.02నిమిషాలకు శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డితో మాట్లాడాడు. వీళ్లందరి ఫోన్ కాల్ లిస్ట్ చూస్తే ఎవరు ఎంతసేపు ఎవరితో మాట్లాడారో స్పష్టమవుతోంది. అదేవిధంగా ఈ హత్యకేసులో మరో నిందితుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి కూడా 14వ తేదీ రాత్రి 09.12 నిమిషాలకు అవినాశ్ రెడ్డికి ఫోన్ చేశాడు. ఈ విధంగా ఏ1 గంగిరెడ్డితో తానుచేసిన ఛాటింగ్ మెసేజ్ లే కాకుండా, ఇతర నిందితులతో జరిపిన ఫోన్ కాల్ రికార్డ్స్ పై అవినాశ్ రెడ్డి సమాధానంచెప్పాలి.
హత్యకేసులో ఏ2గా ఉన్న యాదాటి సునీల్ యాదవ్ మార్చి 14 మధ్యాహ్నం నుంచి 15 ఉదయం వరకు తరచూ మీఇంటికి వచ్చినట్టు గూగుల్ టేకౌట్ బయటపెట్టిన ఆధారాలపై నీ స్పందనేంటి అవినాశ్ రెడ్డి?
ప్రశ్న-6 : యాదాటి సునీల్ కుమార్ యాదవ్ 2019 మార్చి 14వతేదీ మధ్యాహ్నం నుంచి 15వతేదీ రాత్రివరకు ఎక్కడెక్కడ ఉన్నాడో గూగుల్ టేకౌట్ ద్వారా తేలింది. 14 వ తేదీ మధ్యాహ్నం 12.46 నుంచి 12.56 వరకు, మరలా 01.04 నుంచి 01.43 వరకు అవినాశ్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాడని, సాయంత్రం 4.10కి, 05.02 నుంచి 05.06వ రకు, 06.14 నుంచి 06.33 వరకు, తరువాత రాత్రి 9.39 నుంచి 9.58వరకు అవినా శ్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాడు. హత్యకేసులో ఏ2గా ఉన్న సునీల్ కుమార్ అర్థరాత్రి, తెల్లా రాక అంతసేపు మీ ఇంట్లో ఎందుకున్నాడో సమాధానం చెప్పు అవినాశ్ రెడ్డి?
ఇంత స్పష్టంగా హత్యకేసు ముద్దాయి మీ ఇంట్లో ఉన్న విషయాన్ని సీబీఐ ఛార్జ్ షీట్లో పేర్కొంటే, అవినాశ్ రెడ్డి తనలేఖలో తన ఇంటిచుట్టూ పెద్దపెద్దచెట్లుఉన్నాయని, గూగుల్ టేకౌట్ సరిగా పనిచేయదని అత్యంత హాస్యాస్పదంగా తన లేఖలోరాసి, నూతన సాంకేతిక పరిజ్ఞానానికే కొత్తఅర్థాలు చెబుతున్నాడు. చెట్లనీడలో లొకేషన్ ట్రేస్ చేయడం సాధ్యంకాదని చెప్పడం మీకే చెల్లింది అవినాశ్ రెడ్డి.
వై.ఎస్.రాజారెడ్డి ఆసుపత్రిలో ఫార్మిసిస్ట్ గా పనిచేసే ఉసిరెడ్డి శ్రీనివాసరెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంపై నీ సమాధానమేంటి అవినాశ్ రెడ్డి?
ప్రశ్న – 7 : ఉసిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనేవ్యక్తి రాజారెడ్డి ఆసుపత్రిలో ఫార్మసిస్ట్. అతను సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో హత్యజరిగిన నాడు వివేకానందరెడ్డి ఇంటికి తనని బ్యాండేజీ, కాటన్ తీసుకురమ్మని చెప్పినట్టు, అవి తీసుకొన వివేకానందరెడ్డి ఇంటికెళ్లే సరికి, బెడ్రూమ్ క్లోజ్ చేసి ఉన్నట్టు గమనించానని చెప్పాడు. అప్పుడే శివశంకర్ రెడ్డి, వై.ఎస్.భాస్కర్ రెడ్డి బెడ్ రూమ్ నుంచి బయటకువచ్చి, తాను తెచ్చిన బ్యాండేజీ, కాటన్ సరిపోదని మందలించి మరికొంత తీసుకురమ్మని, ఈ.సీ.గంగిరెడ్డి ఆసుపత్రికి పంపినట్టు సీబీఐకి తనవాంగ్మూంలో శ్రీనివాసరెడ్డి తెలియచేశాడు.
నీ తండ్రి భాస్కర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డితో ఎందుకు కాటన్ బ్యాండేజీ తీసుకురమ్మన్నాడో సమాధానం చెప్పు అవినాశ్ రెడ్డి? తామువేయించిన గొడ్డలిపోట్లకు శ్రీనివాసరెడ్డి మొదట రాజారెడ్డి ఆసుపత్రి నుంచి తెచ్చిన కాటన్, బ్యాండేజీ సరిపోదని తిరిగి భారతిరెడ్డి తండ్రి ఈ.సీ.గంగిరెడ్డి ఆసుపత్రికి పంపినమాట నిజంకాదా? రాజారెడ్డి, గంగిరెడ్డి ఆసుపత్రులు పెట్టింది శవాలకు కట్లుకట్టి, కుట్లువేయడానికేనా? శ్రీనివాసరెడ్డి, తన వాంగ్మూలంలో అవినాశ్ రెడ్డి తండ్రి, నీ కుడిభుజం శివశంకర్ రెడ్డిల పాత్ర గురించి చాలా స్పష్టంగా చెప్పాడు. దానిపై అవినాశ్ రెడ్డి సమాధాన మేంటి?
సాక్షిలో వివేకాహత్యను గుండెపోటుగా ప్రచారం చేయడం వెనక నీ ప్రధాన అనుచరుడు శివశంకర్ రెడ్డి పాత్రపై సమాధానం చెప్పు అవినాశ్ రెడ్డి?
ప్రశ్న -8 : సాక్షి టీవీకి చెందిన మోపూరి బాలకృష్ణారెడ్డి సీబీఐకి చెప్పిన వివరాల్లో ఉదయం 06.24 నిమిషాలకు శివశంకర్ రెడ్డి నుంచి తనకు ఫోన్ వచ్చిందని, అవినాశ్ రెడ్డి జమ్మలమడుగు ప్రచార కార్యక్రమానికి విలేకరిని పంపాలని చెప్పినట్టు, ఆ తర్వాత బాలకృష్ణారెడ్డి తన జూనియర్ అయిన నేలటూరి శివానందరెడ్డికి ఫోన్ చేసి జమ్మలమడుగు వెళ్లాలని కోరినట్టు ఉంది.
కానీ ఎప్పుడైతే సీబీఐవారు నేలటూరి శివానందరెడ్డిని విచారించారో అప్పుడే బాలకృష్ణారెడ్డి చెప్పింది పూర్తి అవాస్తవమని, అసలు ఆ సమయంలో తనకు బాలకృష్ణారెడ్డి ఫోన్ చేసి జమ్మలమడుగు కార్యక్రమం గురించి చెప్పలేదని శివానందరెడ్డి సీబీఐ ఎదుట కుండబద్ధలు కొట్టాడు.
దీనిని బట్టి, శివశంకర రెడ్డి 06.24 నిమిషాలకు బాలకృష్ణారెడ్డికి ఫోన్ చేసింది కేవలం గుండెపోటు స్క్రిప్ట్ తో మాత్రమేనని తేటతెల్లమవుతోంది. శివశంకర్ రెడ్డి ఆదేశాలతో, బాలకృష్ణారెడ్డి చొరవతో ఉదయం 06.24 నిమిషాలనుంచే సాక్షి టీవీలో వివేకా గుండెపోటు కథక శ్రీకారం చుట్టారన్నది నిజమో..కాదో జవాబుచెప్పు అవినాశ్ రెడ్డి? నేలటూరి శివానంద రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంపై నీస్పందనేమిటి?
వివేకాహత్య వ్యవహారంలో తనపాత్ర, ప్రమేయాన్ని రుజువుచేస్తూ, సీబీఐ వేసిన ఛార్జ్ షీట్ కు సంబంధించి తాను అడిగిన ప్రశ్నలకు అవినాశ్ రెడ్డి వెంటనే సమాధానం చెప్పాలి
గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, అతని బృందమంతా కూడా మార్చి 15వతేదీ తెల్లవారు జామునుంచే అవినాశ్ రెడ్డి ఇంట్లో ఉన్నారని గూగుల్ టేకౌట్ తో తేలిపోయింది. రాత్రం తా నిద్రాహారాలు మాని ఏ1 గంగిరెడ్డితో అవినాశ్ రెడ్డి ఛాటింగ్ చేయడం, ఆ సమయం అజయ్ కల్లం సీబీఐకి చెప్పిన వివరాల్లోని సమయంతో సరిపోలడం జరిగింది. హత్యకు ముందు మరియు తర్వాత ముఠామొత్తం అవినాశ్ రెడ్డి ఇంటికి చేరుకొని అక్కడ చర్చలుజరపిందని గూగుల్ టేకౌట్ తో రుజువైంది.
షర్మిల వాంగ్మూలంలో వివేకానంద రెడ్డిని ఎమ్మెల్సీఎన్నికల్లో ఓడించడానికి అవినాశ్ రెడ్డి, అతనితండ్రి భాస్కర్ రెడ్డే పనిచే శారని చెప్పినదానిపై అవినాశ్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు? అదేవిధంగా అవినాశ్ రెడ్డికి, శివశంకర్ రెడ్డికి, గంగిరెడ్డికి మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణల సంగతేమిటి?
వివేకా హత్యవార్త తెలిసినవెంటనే జమ్మలమడుగు దారిలోఉన్న అవినాశ్ రెడ్డి ‘సూపర్ మ్యాన్’ లా కేవలం 3 నిమిషాల 45సెకన్లలోనే వివేకాఇంట్లో ఎలావాలాడో సమాధానం చెప్పాలి. యాదా టిసునీల్ యాదవ్ మార్చి 14, 15 తేదీల్లో తనఇంట్లో ఉండటం పై అవినాశ్ ఏం సమాధానం చెబుతాడు?
బాలకృష్ణారెడ్డి ద్వారా సాక్షిటీవీలో జరిగిన గుండెపోటు ప్రచా రంపై అవినాశ్ వైఖరేమిటి? వై.ఎస్.రాజారెడ్డి ఆసుపత్రిలో పనిచేస్తున్న ఉసిరెడ్డి శ్రీని వాసరెడ్డి వాంగ్మూలంపై అవినాశ్ రెడ్డి సమాధానమేంటి? ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రశ్నల జాబితా చాంతాడునే మించిపోతుంది? వంద పేజీల లేఖరాయడంకాదు అవినాశ్ రెడ్డి.. మేం అడిగిన ప్రశ్నలకు సమాధానంచెప్పు.
ఎదుటివారి చరిత్రలు, వ్యక్తిత్వాల గురించి మాట్లాడేముందు జగన్మోహన్ రెడ్డి తన చరిత్ర ఏమిటో తెలుసుకుంటే మంచిది
జగన్మోహన్ రెడ్డి ఇటీవల చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఒకవేలు ఇతరులవైపుచూపిస్తే, నాలుగువేళ్లు మీవైపు చూపిస్తాయనే విషయం మర్చిపోతే ఎలా జగన్? మీ ముత్తాతకు ఎంతమంది భార్యలో సమాధానంచెప్పు జగన్? మీ ముత్తాత వై.ఎస్.వెంకటరెడ్డికి ఇద్దరుభార్యలు. వారిలో మీరు ఏ భార్య సంతతి? మీ ముత్తాత రెండోభార్య మంగమ్మకు మునిమనవడు మీరు. మీ శ్రీమతి భారతిరెడ్డి మొదటిభార్య లక్ష్మమ్మకు మునిమనవరాలుకదా!
ఇంతగొప్ప చరిత్ర పెట్టుకున్న మీరు ఇతరుల పెళ్లిళ్లు, సంబంధాల గురించి మాట్లాడితేఎలా? దయ చేసి ఎప్పుడూ మీరుచరిత్రల్లోకి వెళ్లవద్దు జగన్. చరిత్రలు, వ్యక్తిత్వాల గురించి మీరు ఒకటంటే, ఎదుటివారు పదిఅంటారని గుర్తుంచుకోండి. అంతేకాకుండా తమను తాము కాపాడుకోవడానికి జగన్, అవినాశ్ రెడ్డి సునీల్ యాదవ్ తల్లి, ఉదయ్ కుమార్ రెడ్డి భార్యవంటివారిని రోడ్డుకులాగడం అత్యంతబాధాకరం. మహిళల్ని ఈ విధంగా కించ పరుస్తూ, తమపబ్బం గడుపుకోవడం మీసోదరుడు అవినాశ్ రెడ్డి వంటివారికే సాధ్య మైంది.
తండ్రి తర్వాత తండ్రివంటి మీ చిన్నాన్న వివేకానందరెడ్డి వ్యక్తిత్వ హననానికి పాల్పడటం మీ దుష్టబుద్ధికి నిదర్శనం కాదా? వివేకానందరెడ్డి హత్యకేసులో ప్రధాన ముద్దాయిలు అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి అయితే వారిని వెనకుండి నడిపించింది జగన్మోహన్ రెడ్డే.” అని పట్టాభి తేల్చిచెప్పారు.