Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్ర ప్రజల గుట్టుమట్లన్నీ ఐప్యాక్ గుప్పిట్లో ఉన్నాయి

– ఐప్యాక్ సంస్థ వైసీపీకి పనిచేస్తూ, ప్రజల సమాచారాన్ని, పాలకుల ప్రయోజనాలకోసం దుర్వినియోగం చేస్తోంది
• ప్రజల సమాచారం, వారివ్యక్తిగత వివరాలతో సహా సేకరించడం ముమ్మాటికీ చట్టవిరుద్ధం
• ఐప్యాక్ ఆదేశాలతోనే వైసీపీ వాలంటీర్లద్వారా ఇతరపార్టీవారి ఓట్లను తొలగిస్తోంది
• ఓటర్ పరిశీలనకు వెళ్లిన బీ.ఎల్.ఓ ల వెంట వాలంటీర్లు వెళ్లడం అధికారపార్టీ కుట్రలో భాగమే
• వాలంటీర్ల ద్వారా సేకరించిన సమాచారం ఎటునుంచి ఎటు వెళ్తుందో, దాన్ని ఏ అవసరాలకు ఎలా వాడుతున్నారో ప్రభుత్వం తక్షణమే సమాధానం చెప్పాలి
– టీడీపీ అధికారప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్

ప్రజలనుంచి వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం ప్రైవేట్ కంపెనీలు, వ్యక్తులచేతుల్లోకి వెళ్లిందని తాము గతంలో చెప్పినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనాలేదని, ప్రజల సమాచారం మొత్తం ఐప్యాక్ సంస్థకు చేరుతోందని, రాష్ట్రంలోని వాలంటీర్ వ్యవస్థను ఐప్యాక్ సంస్థే మానిటర్ చేస్తోందని టీడీపీ అధికారప్రతినిధి నీలాయపాలెం విజయ్ కు మార్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ ఐప్యాక్ సంస్థ వైసీపీకి పొలిటికల్ కన్సల్ టెన్సీ. ఆ సంస్థకు వాలంటీర్ల పర్యవేక్షణ, నియంత్రణ అప్పగించిన జగన్ ప్రభుత్వం, వారు ప్రజలనుంచి సేకరించే సమాచారం చాలదన్నట్టు మండలకేంద్రాలు, గ్రామాల్లో అధికారపార్టీ నేతల కు కొన్నిబాధ్యతలు అప్పగించింది. వాలంటీర్ల సేకరించే ప్రజలసమాచారం కొన్నిప్రైవేట్ కంపెనీలకు, ఐప్యా క్ కు చేరి తిరిగితిరిగి వైసీపీకే చేరుతోంది.

ఎఫ్.ఓ.ఏ అనేది కొన్ని సంస్థల సమూహం. దానిలోని వివిధసంస్థల్లో పనిచేసే వారు, ఐప్యాక్ లో పనిచేసేవారు ఒక్కరే. వారిలో కొందరు 2019ఎన్నికల్లో వైసీపీతరుపున నేరుగా ప్రచారం నిర్వహించారు
వాలంటీర్ల వ్యవస్థ నిర్వహణకు రూ.400కోట్లు ఎఫ్.ఓ.ఏ (ఫీల్డ్ ఆపరేషన్స్ ఏజెన్సీ) అనే కన్సల్టెన్సీకి చెల్లించినట్టు ప్రభుత్వం చెప్పింది. ఎఫ్.ఓ.ఏ అనేది రామ్ ఇన్ ఫో లిమిటె డ్, కసిరెడ్డి రాజిరెడ్డికి చెందిన యూనికార్ప్ సొల్యూషన్స్, ఉపాధి టెక్నో సర్వీసెస్ ప్రైవే ట్ లిమిటెడ్, సిటిజన్ అలయెన్సెస్ అనే సంస్థల ఉమ్మడి విభాగం. ఫీల్డ్ ఆపరేషన్స్ ఏ జెన్సీ ఒక నోషనల్ ఏజెన్సీ, అది ఐప్యాక్ లో ఒకభాగం మాత్రమే. ఎఫ్.ఓ.ఏ వ్యవహారా లను ముగ్గురు వ్యక్తులు నిర్వహిస్తున్నారు.

అనురాగ్ రెడ్డి, బొల్లా జయేశ్ రావు, ఎద్దుల పూర్ణదుర్గారావు. ఈముగ్గురూ డైరెక్టర్ల హోదాలో ఎప్పటికప్పుడు వివరాల్ని కసిరెడ్డి రాజిరెడ్డికి చెబుతుంటారు. జయేశ్ రావు అనే 2019లో వైసీపీతరుపున ప్రచార బాధ్యతలు నిర్వహించాడు. ఏపీ గవర్నర్ టీమ్ లో పనిచేశాడు. తరువాత రామ్ ఇన్ ఫో లోకి వచ్చాడు. ఐప్యాక్ ఆదేశాలప్రకారమే అతను రామ్ ఇన్ ఫో ఏర్పాటుచేశాడు. పూర్ణదుర్గారావు ఐప్యాక్ లో పనిచేశాడు. ప్రస్తుతానికి రామ్ ఇన్ ఫోలో ఉన్నాడు.

తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్, ఆ జిల్లా అధికారయంత్రాంగానికి గతంలో కొన్ని ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల్లో చాలాస్పష్టంగా ఎఫ్.ఓ.ఏ అనేసంస్థ మండల, జిల్లాస్థాయి అధికారుల్ని కలిసి మాట్లాడతారని, వాలంటీర్ల నుంచిసమాచారం సేకరిం చి, డేటా పోర్టల్ మెయింటెన్ చేస్తారని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆ ఆదేశాల్లో దినేశ్ మోరే అనేవ్యక్తి పేరు ప్రస్తావించారు. అతను ఎవరాఅని ఆరాతీస్తే, అతని లింక్డ్ ఇన్ ప్రొఫై ల్ లో ఐప్యాక్ కోర్ టీమ్ సభ్యుడని ఉంది.

అనురాగ్ రెడ్డి, బొల్లా జయేశ్ రావు, ఎద్దుల పూర్ణదుర్గారావులు డైరెక్టర్లు అయితే, జంగా కౌశిక్ రెడ్డి, కృష్ణప్రణీత్, అభిషేక్ కామవర పు అనేవాళ్లు వైస్ ప్రెసిడెంట్లుగా ఉన్నారు. జంగా కౌశిక్ రెడ్డి 2020 మే నుంచి 2021 మే వరకు ఐప్యాక్ లో పనిచేశాడు. ఎప్.ఓ.ఏ లో పనిచేసేవారే, ఐప్యాక్ లో పనిచేశారు.. ఇప్పటికీ కొందరు చేస్తున్నారు. ఇలా చాలామంది ఎఫ్.ఓ.ఏ ఏజెన్సీతో, ఐప్యాక్ తో సంబంధ బాంధవ్యాలు ఉన్నవారే. వీరి జాబితా చాలాపెద్దదే ఉంది.

ఎఫ్.ఓ.ఏ ఏజెన్సీ ఐప్యాక్ లో అంతర్భాగం. ఐ ప్యాక్ సంస్థ ప్రజల్ని 360డిగ్రీల్లో గమనిస్తూ, వారి వ్యక్తిగత వివరాల్ని సేకరిస్తోంది
ఎఫ్.ఓ.ఏ అనే ఏజెన్సీ ముమ్మాటికీ ఐప్యాక్ లో అంతర్భాగమే. దానిలో దీనిలో పనిచేసే సిబ్బంది ఒక్కరే. ఐప్యాక్ లో పనిచేసే మండల, గ్రామ సిబ్బంది దాదాపు 1700మంది వరకు రామ్ ఇన్ ఫోలో ఉన్నారని ఆధారాల్ని బట్టితెలుస్తోంది. ఇంతమంది ఉద్యోగులు ఏంచేస్తున్నారు? వాలంటీర్లు సేకరించిన సమాచారాన్ని వారు ఎలాంటి అవసరాలకు వినియోగిస్తున్నారు.

ప్రజలనుంచి సేకరించిన సమాచారం ప్రైవేట్ వ్యక్తులు, ఏజెన్సీల చేతిలోకి వెళ్తే దానివల్ల ఎలాంటి దుష్పరిణామాలు తలెత్తుతాయో ప్రజలు తెలుసుకోవా లి. ఐప్యాక్ సంస్థ రాష్ట్రంలో చాలా లోతుల్లోకి వెళ్లింది. వాస్తవంగా ప్రజల్ని 360 డిగ్రీల్లో ఐప్యాక్ సంస్థ మానిటర్ చేస్తోంది. పైకి కనిపించే వాలంటీర్ వ్యవస్థ కేవలం నామమా త్రమే. కానీ దానివెనకుండి వారుసేకరించే సమాచారాన్ని ఐప్యాక్ సంస్థ వివిధ కార్యక్రమాలు, ప్రయోజనాలకు దుర్విని యోగం చేస్తోంది. ప్రజల సమాచారం చౌర్యం జరగడం, దుర్వినియోగం జరగడమనేది ముమ్మాటికీ చట్టవిరుద్ధమే.

రాష్ట్రప్రజల సమాచారం మొత్తం ఐప్యాక్ గుప్పిట్లో ఉంది. వాలంటీర్లు సేరించే సమాచారం మొత్తం ఐప్యాక్ కు చేరుతోంది. ఆ సంస్థ ఆదేశాలతోనే టీడీపీ, ఇతరపార్టీల ఓట్లు తొలగిస్తున్నారు
గతంతో రామ్ ఇన్ ఫో సంస్థ రాష్ట్రంలోని 90లక్షలఇళ్ల సమాచారం తమవద్ద ఉందని చెప్పింది. ఆ సం స్థ ఐప్యాక్ లో అంతర్భాగమే కాబట్టి, ప్రజల సమాచారం మొత్తం ఐప్యాక్ గుప్పిట్లోనే ఉంది. ఐప్యాక్, వైసీపీ కూర్చొని ప్రజలసమాచారాన్ని ఎలా వాడా లి..దేనికి వాడాలో ఆలోచిస్తారు. జగనన్న సురక్ష కార్యక్రమానికి సంబంధించిన వెబ్ సైట్లో ఐప్యాక్ వీడియోలు, ఫొటోలు ఉన్నాయి. ఐప్యాక్ కు, ప్రభుత్వపథకానికి ఏమిటి సంబంధం?

ఎఫ్.ఓ.ఏ ఏజెన్సీలోని వివిధ సంస్థల్లో పనిచేసేప్రతిఒక్కరికీ ఐప్యాక్ తో ఎంతో కొంతసంబంధం ఉంది. ప్రజలసమాచారం ప్రైవేట్ ఏజెన్సీలకు చేరుతోందని తాము గతంలో మీడియాతో చెప్పినవెంటనే కొందరు ఐప్యాక్ లో పనిచేసే కొందరు సో షల్ మీడియానుంచి వారి వివరాలను తొలగించారు. ఐప్యాక్ లో పనిచేసేవారైనా, వాలంటీర్లు అయినా కేవలం జీతానికే పనిచేస్తున్నారు. వారిని తప్పుపట్టాల్సిన పనిలే దు. ఇక్కడ తప్పుపట్టాల్సింది వైసీపీప్రభుత్వాన్ని.

ప్రభుత్వం ఇలా ప్రజలసమాచారం దుర్వినియోగం చేయడం, స్వార్థరాజకీయప్రయోజనాలకు వాడుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నాం. వాలంటీర్లలో దాదాపు 90శాతం మంది అధికారపార్టీ వారే. ఆ విషయం స్వయంగా పలు సందర్భాల్లో ఆ పార్టీ నేతలే చెప్పారు. వాలంటీర్లు సేక రించే సమాచారంలో వైసీపీఓటర్లు, ఇతరపార్టీల ఓటర్ల సమాచారం కూడా ఉంది.

అందుకే బీ.ఎల్.ఓ లు ఓటర్ల పరిశీలనకు వెళితే, వారితో పాటు వాలంటీర్లుకూడా వెళ్తు న్నారు. వైసీపీ ఐప్యాక్ ద్వారానే ప్రజలసమాచారం తస్కరించి, దుర్వినియోగం చేయడం, ప్రజల్ని భయపెట్టి తమదారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.” అని విజయ్ కుమార్ తెలిపారు.

LEAVE A RESPONSE