పథకాల్లో దళారుల జోక్యం నివారించండి

– డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు

సికింద్రాబాద్, నవంబరు 9 : పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ఏర్పాట్లు జరుపుతోందని, ఈ క్రమంలోనే కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పధకాలు ఉప కరిస్తాయని ఉప సభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. తార్నాక డివిజన్ పరిధిలో 31 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, అధికారులు, నేతలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ బుధవారం అందించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ కార్యకలాపాల అమలులో దళారీ ల ప్రమేయాన్ని నివారించేందుకు ఏర్పాట్లు జరుపుతున్నామని తెలిపారు. సికింద్రాబాద్ పరిధిలో అభివృద్ది, సంక్షేమ కార్యకలాపాల అమలును ముమ్మరంగా చేపడుతున్నామని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. మండల రెవెన్యూ అధికారి మాధవి, తెరాస యువ నేత శ్రీ రామేశ్వర గౌడ్, తెరాస కార్మిక విభాగం అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు. డివిజన్ పరిధిలో వినోభా నగర్, లాలాపేట, లక్ష్మీ నగర్, ఆర్య నగర్, శాంతీ నగర్, తార్నాక, చింతల్, మనికేశ్వరి నగర్ తదితర ప్రాంతాల్లో రూ.30 లక్షల విలువజేసే చెక్కులను ఈ సందర్భంగా నేరుగా లబ్దిదారుల ఇళ్ళకే వెళ్ళి అందించారు.

Leave a Reply