-మూడు తరాల రక్త చరిత్ర కలిగిన జగన్ రెడ్డి.. టీడీపీపై బురద వేయలేరు
-ఎన్టీఆర్ కుమార్తె మరణంపై రాజకీయాలు ఆపండి
-మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు
స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇంట్లో జరిగిన విషాదం గురించి అందరికి తెలిసిందే. నందమూరి తారక రామారావు చిన్న కుమార్తె మరణ వార్త విని తెలుగు వారందరూ కూడా ఎంతో బాధ పడ్డారు. తెలుగు వారు ఎక్కడున్నా గర్వంగా భావించే వ్యక్తి నందమూరి తారక రామారావు. అంటువంటి వ్యక్తి కుటుంబం గురించి కొంత మంది పనికిమాలిన సన్నాసులు సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు చేశారు. అవి ఎంతో ఆవేదనకు గురి చేశాయి.
నేను మాత్రమే కాదు ఆంధ్ర రాష్ట్రం, ఇతర రాష్ట్రాలలో ఉన్న తెలుగు వారంతా సోషల్ మీడియాలోని ఆ కామెంట్లు చూసి తపన చెందారు. కొంతమంది ఫోన్లు చేసి ఏంటి ఈ అన్యాయం, ఏంటి ఈ శవ రాజకీయాలు అని బాధపడ్డారు. రామారావు గారి గురించి ఆయన కుటుంబం గురించి మాట్లాడిన వ్యక్తులు ప్రవర్తనను మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాను. రామారావు అంటే సినిమా యాక్టర్ మాత్రమే కాదు. రాజకీయాలలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి, తెలుగు వారికి జాతీయ, అంతర్జాతీయ వేధికలపై ఎంతో గుర్తింపు తెచ్చిన వ్యక్తి.
అలాంటి వ్యక్తి కుటుంబం గురించి సోషల్ మీడియాలో కొంత మంది పెయిడ్ బ్యాచ్ చేస్తున్న కామెంట్లుని చూసి బాధ పడని వారంటూ ఎవరూ లేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మెన్, జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి అంత దారుణమైన వ్యాఖ్యలు చేసినా.. ముఖ్యమంత్రి నుండి కనీస ఖండన లేదు. అంటే.. ప్రతి ఒక్కరినీ బూతులు తిడుతున్నందుకు ప్రతిఫలంగానే లక్షల వేతనంతో ఆ పదవి ఇచ్చినట్లుంది.
ముఖ్యమంత్రి చేసే పనులు చేసుకోవాలి. రాజకీయాలు చేసుకోవాలి. పార్టీ నడిపించుకోవాలి. అంతే కాని ఇటువంటి శవ రాజకీయాలు దుర్మార్గం. ప్రతి విషయాన్నీ రాజకీయం చేయడం, బురద జల్లడం, లేనిపోనవి చిత్రీకరించి చావును కూడా రాజకీయం చేయడం సిగ్గుచేటు.
హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్డు నెం.45లో సర్వే నెం.273, 274, 275, 276లో 6.73 ఎకరాల భూమి విషయంలో రామారావు కుమార్తెతో లోకేష్ గొడవ పడ్డందునే ఆమె ఆత్మహత్య చేసుకున్నారని సోషల్ మీడియాలో పెట్టడం అత్యంత దుర్మార్గం. ఇది ఎంత పచ్చి అబద్దం, దుర్మార్గ పూరితమైన ప్రచారమంటే.. తెలంగాణ గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్ మెంట్ కు చెందిన ధరణి పోర్టల్ లో వెరిఫికేషన్ చేస్తే అసలు ఆ సర్వే నెంబర్లే తప్పు అని చూపిస్తోంది.
డూప్లికేట్ సర్వే నెంబర్లని చూపి, బురద జల్లడం, చనిపోయిన వారిపై రాజకీయాలకు పాల్పడడం జగన్ రెడ్డి ఇకనైనా మానుకోవాలి. ప్రజలంతా నాపక్కనే ఉన్నారు అని మాట్లాడే జగన్ రెడ్డి కుటుంబాలపై ఈ విధమైన దాడులు చేయడం సిగ్గుచేటు. చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని చూసి ఎందుకు బయపడుతున్నారు. ఇది మొదటి సారి కాదు గతంలో కూడ ఇటువంటి పనికిమాలిన ఆరోపణలు ఎన్నో చేశారు. అంబటి రాబాంబు కూడ చాలా ఘోరంగా ఎన్.టి. రామారావు గారి కుటుంబం గురించి అసెంబ్లీలో మాట్లాడారు.
కొడాలి నాని ఎన్నో బూతులు మాట్లాడారు. పనికి మాలిన వాళ్లతో అన్న గారి కుటుంబాన్ని తిట్టించడం సమంజసం కాదు.అధికారం కోసం గతంలో ఎన్నో ఆరోపణలు చేశారు. ఒక్కటి కూడా నిరూపించలేదు. వెంకటేశ్వర స్వామి పింక్ డైమెండ్ దొంగిలించారన్నారు. తర్వాత అసలు పింక్ డైమండ్ అనేదే లేదన్నారు. పింక్ డైమైండ్ కోసం ప్రతిపక్షంలో కోర్టులో కేసు వేసి అధికారంలోక రాగానే వితడ్రా చేసుకున్నారు. ఫైబర్ గ్రిడ్ లో ఆరోపణలు చేశారు. తర్వాత అవన్నీ తప్పుడు ఆరోపణలని నిరూపణ అయ్యాయి.
చంద్రబాబు నాయుడు కుటుంబం మీలా అక్రమ కంపెనీలు పెట్టలేదు, షెల్ కంపెనీలు, సూట్ కేసు కంపెనీలు నడిపించలేదు. హెరిటేజ్ వ్యాపారం చేసుకుంటున్నారు. నీతిగా, నిజాయితీగా వ్యాపారం చేసుకుంటున్న వారిపై విష ప్రచారం చేయడం సిగ్గుచేటు.
స్వయానా మీ బాబాయిని బాత్రూంలో అడ్డంగా నరికేసి చంద్రబాబు నాయుడు గారే చేశారని అన్నారు. కాని నేడు నీ సహకారంతోనే హత్య జరిగిందని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. దానికి సమాధానం చెప్పే సాహసం కూడా చేయకుండా.. ఇంకా ఆరోపణలు చేయడం, శవాలపై చిల్లర ఏరుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికైనా జగన్ రెడ్డి శవ రాజకీయాలు మాని వాస్తవాలని మాట్లడటం నేర్చుకోవాలి. ఎన్.టి.రామారావు కుటుంబం గురించి జగన్ రెడ్డి మరోసారి మాట్లడితే మాకు 175సీట్లకి 175 వస్తాయని చెబుతున్నారు. నేడు ఒక్క సీటు కూడ దక్కదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని శవ రాజకీయం మానుకోకుంటే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నా.