Suryaa.co.in

Telangana

తలసాని దంపతుల అయ్యప్పస్వామి మహా పడిపూజ

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదర్శ నగర్ లోని MLA క్వార్టర్స్ లో అయ్యప్పస్వామి మహపడిపూజ నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు పూజ ను ప్రారంభించారు. అయ్యప్ప స్వామి పూజను మంత్రి తనయుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ దంపతులు నిర్వహించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, MLC లు సురభి వాణి దేవి, MS. ప్రభాకర్, MLA కాలేరు వెంకటేష్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర గుప్తా, గ్రంధాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్, ACB డైరెక్టర్ అంజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE