Suryaa.co.in

Political News

అయ్యో ఎస్ (ఐ ఏ ఎస్) లు

– ఆంధ్రప్రదేశ్ లోనే ఎందుకు ఇలా జరుగు తోంది?
-లోపం ఎవరిది?
– సర్కారు వారిదా?
– అధికారులదా?
( రాజా రమేష్)

బాగా తెలివితేటలు ఉన్నవారు మాత్రమే ఐ ఏ ఎస్ కాగలరనే అభిప్రాయం ఉంది. అందుకే సమాజంలో అందరికీ ఐ ఏ ఎస్ లు అంటే ఎంతో గౌరవం ఉంది. విద్యార్థులు, యువకులు తాముకూడా ఐ ఏ ఎస్ అవ్వాలని కలలు కంటారు, అందుకోసం కఠోర శ్రమ చేస్తుంటారు.

ఇంతటి తెలివితేటలు, సర్వీసులో సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ ‘ఐ ఏ ఎస్” అధికారులు కూడా.. ఆంధ్రప్రదేశ్ లో తరచుగా హైకోర్టులో జైలుశిక్ష విధించబడుతున్నారు. ఇటీవలి తీర్పుతో జైలుశిక్ష కు గురైన ఐ ఏ ఎస్ అధికారుల సంఖ్య 10 దాటింది.

అత్యంత తెలివితేటలు కలిగి, చట్టాలు, రాజ్యాంగం పట్ల భేషయిన అవగాహన ఉన్న సీనియర్ అధికారులు కూడా, ఇలా జైలుపాలు కావడానికి కారణం ఏమిటట?
వారు తమ పరిజ్ఞానాన్ని, అనుభవాన్ని, రూల్స్ ని, సామాజిక అవగాహనను ప్రక్కనపెట్టి, అధికారంలో ఉన్న నాయకులు చెప్పినదానికల్లా “అయ్యా..యస్ SS” అంటూ పని చేయడమే… అనే అభిప్రాయం జనంలో వ్యక్తం అవుతున్నది
అందుకే వారికి జైలుశిక్ష పడింది అంటే.. మన జనం కూడా “అయ్యో పాపం” అని కూడా అనకుండా, కోర్ట్ తీర్పులను నిజమే కదా అని “యస్” SSS అనుకుంటున్నారో….
ఓ ఐ ఏ ఎస్ లారా….! ఇప్పటికైనా సరే మీరు మారండి! దేశంలో వున్న ప్రభుత్వాలు, నాయకుల పెత్తనం మీ మీద వస్తుంటాయి, పోతుంటాయి. సమాజంలో మీకున్న మంచి పేరుని ప్రలోభాలకు లొంగి చెడగొట్టుకోకండి. ఆ ప్రభుత్వాలు కానీ,ఆ నాయకులు కానీ మీకు శిక్షలు పడితే కనీసం కూడా రక్షించలేరు.

కోర్టు ఉత్తర్వులను, చట్టాలను పూర్తిగా గౌరవించండి!
“అయ్యో యెస్” లయినా చట్టం ముందు అందరూ సమానమే!!

( రచయిత సీఈఓ, డీఎన్‌ఏ టీవీ )

LEAVE A RESPONSE