ఈ ప్రకటన ముస్లిం అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్న నాగరాజు హత్యను ఖండిస్తూ చేసింది. ఇందులో అన్ని మతాల, సామాజిక వర్గాల,రాజకీయ విశ్వాసాలకు చెందిన వారున్నా, మొదటి సంతకం ఖలీదా పర్వీన్ అనే ముస్లిం మహిళది. దీనికి బయట అనేక మంది ముస్లిం సంఘాల, వ్యక్తిగత స్థాయిలో, దళిత, లిబరల్, ఆలోచనాపరులు స్పందిస్తునే ఉన్నారు. ఇది తెలంగాణ అంటే.”గంగా జమునా తేహజీబ్” కు అసలైన నిదర్శనం.
అయితే కొద్దిమంది ఈ వాతావరణం సరిపోని వారు, ఇటువంటి మత సామరస్యం ఉంటే తమ ప్రయోజనాలు నెరవేరేలా లేవని తమ మానసిక వికారాలన్నింటినీ సామజిక మాధ్యమాలలో ప్రదర్శిస్తున్నారు. ” హిందూ మతాన్ని నిలదీసే వారు, ఫెమినిస్ట్ వ్యాధులు?(వారి రాతలే) కమ్మీలు, యాన్టి నేషనల్స్ ఎక్కడికి పోయారు? ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసకున్నందుకు ఒక దళిత యువకుడిని నది రోడ్డులో చంపితే స్పందించరా? హిందువుల పై ముస్లిం మతోన్మాదాన్ని ఖండించేందుకు నోళ్ళు రావట్లేదా? అంటూ తెగ బాధ పడుతున్నారు.
“ఆ దళిత యువకుడు ఇస్లామ్ మతంలోకి మారినా ప్రాణాలు దక్కి ఉండేవంటు” ఆవేదన చెందుతున్నారు. కానీ వీరి గతం వేరేలా, గోముఖ వ్యాఘ్రం స్వభావంతో ఉంది. అలా మాట్లాడేవారి ని అడగాల్సినది ఒక్కటే. లోగడ, గతంలో తమ ఇంటి అమ్మాయిలను ప్రేమించి పెళ్ళి చేసుకున్న , (మీరనుకునే హిందూ మతానికి చెందిన) బయటి కులస్తులైన వారు, దళిత కులానికి చెందిన యువకుల విషయంలో అమ్మాయి బంధువుల ప్రవర్తన ఇంత కంటే భిన్నంగా ఏమైనా ఉందా? వారంటే వేరే మతం కదా, మరీ వీరు మీ మతమే కదా? అప్పుడు మీరేమైనా ఇలానే స్పందించారా లేక ఇక్క ముస్లింలు కావడమే కారణమా?
కనీసం Telangana for Peace and Unity సంస్థ లాగా మీ హిందూ మత పెద్దలు, అభిమానులూ ఒక్కటంటే ఒక్క ఉమ్మడి ప్రకటన చేయగలిగారా? ఇప్పుడు ఎగేసుకొని రావడానికి సిగ్గనిపించడం లేదా?? థూ.
PS: ఈ హత్య తీవ్రంగా ఖండించారు తగినదే. ఇందులో మతం, పితృస్వామ్యం కలగలిసి ఉన్నాయి. మిర్యాలగూడ ప్రణయ్ అయినా, మంథని మధుకర్ అయినా, నాగరాజు అయినా , హిందూ మతపు తల్లిదండ్రులు, ముస్లిం మత తల్లి దండ్రులు, మతాల కతీతంగా,ఒక్కలాగానే వ్యవహ రించారు. వారు దళితులవడం వల్లనే అనుకుంటే, అమీర్ పేటలో కొబ్బరికాయల కత్తితో నరికి చంపబడిన, భువనగిరి లో చంపబడిన కానిస్టేబుల్ లు ఇంకా అనేకులు దళితేతరులు. చంపిన కులాలూ బీ సీ లు.
తెలంగాణ ఫర్ పీస్ అండ్ యూనిటీ (TPU)
– ఎం.పరశురామ్