Suryaa.co.in

Sports Telangana

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో అజారుద్దీన్ భేటీ

రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన కార్యాలయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ సమావేశం అయ్యారు.

ఈ సమావేశంలో సెప్టెంబర్ 25 న హైదరాబాద్ లోని ఉప్పల్ లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో కోవిడ్ మహమ్మారి తర్వాత (సుదీర్ఘ విరామం తర్వాత) హైదరాబాద్ లో ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న అంతర్జాతీయ T-20 క్రికెట్ మ్యాచ్ నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లు పై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి డా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ స్పోర్ట్స్ హబ్ గా పేరుగాంచిన హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ ను పెంచేలా ఈ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ను నిర్వహించాలని కోరారు. ఉప్పల్ లో జరిగే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ నిర్వాహణ పై రాష్ట్ర ప్రభుత్వం – క్రీడా శాఖ నుండి పూర్తి సహాకారం అందించాలని HCA అధ్యక్షుడు అజారుద్దీన్ ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు విజ్ఞప్తి చేశారు.

HCA చేసిన విజ్ఞప్తి పై మంత్రి స్పందించారు. హైదరాబాద్ లో జరుగుతున్న అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామన్నారు. మ్యాచ్ నిర్వహణ కు పోలీస్ శాఖ నుండి పూర్తి సహకారం అందించాలని రాష్ట్ర DGP మహేందర్ రెడ్డి గారితో టెలిఫోన్ లో మాట్లాడారు. అనంతరం GHMC, TSSPDCL, GHMC, Fire services, మెడికల్ సర్వీసెస్ లాంటి ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల ఉన్నతాధికారులకు మంత్రి ఆదేశించారు.

మ్యాచ్ విజయవంతంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇండియా – ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న T- 20 మ్యాచ్ ను వీక్షించేందుకు దేశ, విదేశాలకు చెందిన క్రికెట్ ప్రేక్షకులు నగరానికి వస్తున్న సందర్భంగా హైదరాబాద్ నగర బ్రాండ్ ను పెంచేలా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.

LEAVE A RESPONSE