Suryaa.co.in

Andhra Pradesh Telangana

కేసీఆర్, జగన్.. ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోండి

-ఎన్‌ఐఏ దాడులను స్వాగతిస్తున్నాం
-ఓట్ల కోసం రోహింగ్యాలకు ఆశ్రయమిస్తారా?
-వారిని అణచివేసి మీ దేశభక్తి నిరూపించుకోండి
-బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు

తెలంగాణ సీఎం కే సీఆర్, ఏపీ సీఎం జగన్ ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలని ఏపీ బీజేపీ కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు సూచించారు. వీరి విధానాల వల్ల ఉగ్రవాదానికి, మతోన్మాదులకు ప్రోత్సాహం లభిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదమూలాలపై ఎన్‌ఏఐ దాడులు చేసి అరెస్టు చేయడం శుభపరిణామమే కాకుండా, ఇరు రాష్ట్రాల సీఎంలకు హెచ్చరిక సంకేతమన్నారు. రోహింగ్యాలకు స్థానం కల్పించడం ద్వారా ఓట్లు పెరుగుతాయన్న ఆలోచన నీచమే కాకుండా, దేశద్రోహమేనన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డిపై దాడి చేసి, హత్య చేసే వరకూ వెళ్లినా, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, బీజేపీ నేతలపైనే కేసులు పెట్టడం దారుణమన్నారు. స్థానిక ముస్లిం యువకులను దేశానికి వ్యతిరేకంగా మారుస్తున్న ఉగ్రవాద సంస్థలను అణచివేయకుండా, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న బీజేపీ నాయకులపై కేసులు పెట్టడం, దేశద్రోహమేనని స్పష్టం చేశారు. ఇప్పటికయినా రెండు రాష్ట్రాల సీఎంలు కళ్లు తెరిచి, ఉగ్రవాదుల పీచమణిచి, దేశభక్తులమని నిరూపించుకోవాలని హితవు పలికారు.

LEAVE A RESPONSE