Suryaa.co.in

Andhra Pradesh

జగన్ తనకు ఏపీ పోలీసుపై నమ్మకం లేదన్నప్పుడు మీకు బాధ లేదా?

-పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారు
-అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కలు సరిచేస్తాం
-పోలీసులకు మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు హెచ్చరిక

పామర్రు నియోజకవర్గ ఇంచార్జ్ వర్ల. కుమార్ రాజా చేస్తున్న బడుగులను బ్రతకనివ్వండి నిరవధిక నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలియచేసిన మాజీ మంత్రి,పోలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు.

ఈ సందర్భంగా నక్కా.ఆనంద్ బాబు ఏమన్నారంటే… ఈ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది.అణగారిన వర్గాలే లక్ష్యం గా దాడులు పెరిగిపోయాయి.కాపాడాల్సిన పోలీస్ శాఖ ప్రభుత్వానికి అడుగులు కి మడుగులు ఒత్తుతుంది.పోలీస్ శాఖ పారదర్శకంగా పని చేయాలి,తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి జరిగి 11 నెలలు అవ్వుతుంది ఇప్పటివరకు ఎ ఒక్కరి మీద చర్యలు తీసుకోలేదు. ఎవరెవరు పాల్గొన్నారో వీడియో క్లిప్పింగ్స్ అన్ని ఉన్న కూడా పామర్రు నియోజకవర్గమునకు చెందిన ఈశ్వరరావు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు అని మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు బ్రహ్మాజీ ఈశ్వరరావు పై రాడ్లు, బీరు సీసాలు తో దాడి చేస్తే 324 సెక్షన్ కట్టి చేతులు దులుపుకొన్నారు.
జగన్మోహన్ రెడ్డి కోడి కత్తి డ్రామా లో ఆంధ్రప్రదేశ్ లో ని పోలీస్ వ్యవస్థ పై నాకు నమ్మకం లేదు అని అన్నప్పుడు, మీకు కొంచెం అయ్యిన భాద అనిపించలేదా?వైసీపీ మంత్రులు, MLA లు నాయకులు వాడే భాష ఒకసారి చూడండి సోషల్ మీడియాలో వారు పెట్టే పోస్టులు మీకు కనిపించడం లేదా?

ఎవరైనా తెలుగుదేశం కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టు లు పెడితే రాత్రికి రాత్రి అరెస్ట్లు, cid ఆఫీసుల కి తీసుకొని వెళ్లడం థర్డ్ డిగ్రీ లు ఉపయోగించడం పరిపాటి అయ్యిపోయింది.ఒక్కటే గుర్తు పెట్టుకోండి సంవత్సరం న్నార లో అధికారంలోకి వస్తున్నాం ఎవ్వరి ని వదిలి పెట్టె ప్రసక్తే లేదు.ప్రతి ఒక్కరి పై ప్రైవేట్ కేసులు వేస్తాం. వర్లకుమార్ రాజా చేస్తున్న దీక్ష కు పార్టీ అండగా ఉంటుంది.అలాగే పామర్రు ప్రజలు కూడా అండగా నిలవాలి అని కోరారు.

LEAVE A RESPONSE