Suryaa.co.in

Andhra Pradesh

కుప్పం పరాభవం నుంచి తేరుకోలేకే.. బాబు కుట్ర రాజకీయాలు

– బద్వేలులో వైయస్ఆర్సీపీ బలం చెక్కుచెదరదు- వైయస్ఆర్ జిల్లా కంచుకోట అని మరోసారి రుజువు చేస్తాం
– బద్వేలు వైయస్ఆర్సీపీ అభ్యర్థి డా. సుధ వైద్యురాలు, విద్యావంతురాలు, మహిళ
– ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలనే జగన్ ఎప్పుడూ చెబుతారు
– ప్రజాదరణ పొందుతున్న వైయస్ఆర్సీపీని చూస్తే బాబు, పవన్ లకు భయం
– ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి
గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈరోజు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. గతంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ 44వేల మెజార్టీ వచ్చిందో… అదేరీతిలో ఈ ఎన్నికలో మెజార్టీ రావాలని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. సిట్టింగ్ శాసనసభ్యుడు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన అభ్యర్థి డాక్టర్ సుధ వైద్యురాలు, విద్యావంతురాలు, మహిళ కావడం పట్ల చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు ఠంఛనుగా అందుతున్న సంక్షేమ ఫలాల గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరిస్తాం. బద్వేల్‌ ఉప ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలుస్తాం. బద్వేలు వైయస్ఆర్సీపీకి కంచుకోట అన్నది మరోసారి రుజువు కాబోతోంది.
కరోనా నేపథ్యంలో ప్రపంచమే అల్లకల్లోలం అయిపోయింది. భారతదేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో లక్షలాదిమంది వలసలు వెళ్లిపోయారు. ఏపీలో మాత్రం ప్రభుత్వానికి ఆదాయం లేదనో, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా రూ. లక్షకోట్లకు పైగా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా అందించిన ఘనత జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వానిది. దాదాపు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఏదో విధంగా ఫలాలను అందించిన ప్రభుత్వం ఇది. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీల్లో 98శాతం అమలు చేశాం కాబట్టే ధైర్యంగా ప్రజల్లోకి వెళతాం. వైయస్సార్‌ సీపీకి ఎప్పుడూ కంచుకోటగా ఉన్న వైయస్సార్‌ జిల్లాలో పార్టీ మరింత బలంగా ఉందని మరోసారి ప్రజా తీర్పులో తేలబోతుంది.
రెండేళ్లలో జరిగిన ఎన్నికలను తీసుకుంటే… పంచాయతీ సర్పంచ్ ల నుంచి.. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పోరేటర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్లు, మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ అధ్యక్షులు.. ఇలా ఏ ఎన్నిక జరిగినా.. 80 నుంచి 98 శాతం వరకు వైయస్ఆర్సీపీ గెలుచుకుంది.
అలానే 75 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరిగితే.. 74 మున్సిపల్‌ చైర్మన్లు వైయస్ఆర్సీపీ గెలుచుకుంది. అధికారంలోకి వచ్చాక జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ.. రాష్ట్ర ప్రజలు ఇంత భారీ మెజార్టీని వైయస్సార్‌ సీపీకి కట్టబెట్టారంటే జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఏరకమైన ప్రజామోదం పొందిందే ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన ఫలితాలు సాధించింది కాబట్టి, ఇవన్నీ కూడా ప్రజలలో ఉత్సాహం పెంచుతాయనే ఉద్దేశంతో కుట్రపూరితంగా టీడీపీ, జనసేన పార్టీలు వ్యవహరిస్తున్నాయి.
కుప్పంలో జరిగిన పరాభవంతో తలెత్తుకోలేక, దాని నుంచి తేరుకోలేని చంద్రబాబే.. కొంతమంది తన మనుషుల్ని రోడ్ల మీదకు పంపించి రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టి, ఇష్టానుసారంగా మాట్లాడించి, కుల, మతాలను రెచ్చగొట్టేలా కుట్ర పూరితంగా వ్యవహరించడం చూస్తున్నాం.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంత బలం ఉన్నాకూడా మా నాయకుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చెప్పిన విధానం ఎలా ఉంటుందంటే… ‘మీరంతా కూడా ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలి. బలం పెరిగేకొద్ది అహంభావం ఉండొద్దు. ప్రజలకు మనం ఏం చేశామనే రీతిలో సరైన పద్ధతి అవలంభించండి. రాజకీయాల్లో క్రమశిక్షణ అలవర్చుకోవాలని’ చెబుతారు. ప్రతిపక్షం మాత్రం ఆ రీతిలో వ్యవహరిస్తుందా అంటే లేదు. వైయస్సార్‌ సీపీ ఫలానా తప్పు చేసిందని, చేస్తుందని మాట్లాడకుండా కులాలు, మతాలమధ్య చిచ్చుపెట్టేలా… ఏమీ లేకున్నా, ఏదో జరిగిపోతుందనేలా భ్రమలు కల్పిస్తూ ప్రతిపక్షాలు పబ్బం గడుపుకుంటున్నాయి. అది టీడీపీ అయినా, లేక జనసేన అయినా ప్రభుత్వాన్ని ఏదైనా ప్రశ్నించాలంటే ఎందుకు సూటిగా అడగలేకపోతున్నాయి?
‘ మేం సంక్షేమ పథకాల అమలులో ఫెల్యూయిర్‌ అయ్యారని చెప్పండి, సరిదిద్దుకుంటాం. రహదారులు పాడయ్యాయని చెప్పండి … వాటికి మరమ్మతులు చేస్తాం.’ అలాకాకుండా, ఏరకంగా వైయస్సార్‌ సీపీని డీగ్రేడ్‌ చేయాలా అని కుట్రలు పన్నితే మాత్రం సహించం. కేవలం అదే ఎజెండాతో ఆ పార్టీ నేతలు పని చేస్తున్నారు. ‘మీకు చిత్తశుద్ధి ఉంటే బద్వేల్‌ ఎన్నికలలో అందరూ కలిసి పోటీ చేస్తామని ధైర్యంగా చెప్పండి.’ ప్రజా క్షేత్రంలో పోటీకి రాకుండా వెనకడుగు వేసిన పార్టీ బహుశా దేశంలోనే ఒక్క టీడీపీనే. ముఖ్యమంత్రి జగన్ ప్రజాస్వామ్య రీతిలో పరిపాలన చేస్తుంటే… ఆ విషయాన్ని ఏవిధంగా డైవర్ట్‌ చేయాలనే ఆలోచన చేయడం దుర్మార్గం.
సినీ పెద్దలు అంతా గౌరవ ముఖ్యమంత్రి వద్దకు వచ్చి ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానం పెట్టాలని కోరారు. ఆ విధానం వస్తుందంటే మీరు ఎందుకు బాధపడ్డారు. ఎమోషనల్‌కు గురై ప్రభుత్వంపై ఇష్టానుసారం నోరుపారేసుకున్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయి, కులాలతో సంబంధం లేదని మాట్లాడుతూనే.. ఆ ఫ్రస్టేషన్‌లో కులాలను, మతాలను తెరమీదకు తెస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానంలో తప్పు ఉందని చెప్పండి .. .ప్రభుత్వం సరిదిద్దుకుంటుంది. అది మీరు చెప్పగలుగుతున్నారా? అంటే లేదు. పైగా దేవాలయాలు, కులాలు, మతాలు అంటూ రెచ్చగొట్టాలని విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్నింట్లో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. 56 బీసీ కార్పొరేషన్లలో ఛైర్మన్లు, డైరెక్టర్లను నియమించి, దానితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 79కి పైగా స్టేట్‌ కార్పొరేషన్‌, నామినేటెడ్ పదవులు అంటే 58 శాతం మేర ఇవ్వడం, ఆరేడువందల మందిని డైరెక్టర్లుగా నియమించారు. అలాగే ప్రభుత్వం నియమించిన పదవుల్లో 50 శాతం మహిళలకు, 50 శాతానికి పైగా బడుగు, బలహీన వర్గాలకు పదవులు కేటాయించిన ఏకైక పార్టీ వైయస్సార్‌ సీపీనే. ఇవేమీ మీ చర్చల్లోకి రావు, మీ కళ్ళకు కనిపించవు. ఏరోజూ దీనిపై డిబేట్‌ లు జరగవు. ప్రతిపక్షానికి, ఎల్లో మీడియాకు మేం చేస్తున్న ఇన్ని మంచి కార్యక్రమాలు కనపడవా? మంచి చెప్పకపోయినా పర్వాలేదు, ఏడుపెందుకు..? జగన్‌ మోహన్‌ రెడ్డి చెప్పినట్లు దేనికైనా మందు ఉంటుంది కానీ, మీకున్న కడుపు మంటకు మందు ఎక్కడా ఉండదు.
మీకెందుకంత ఈర్ష్య. ప్రభుత్వంపై వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తే కచ్చితంగా సమాధానం ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ పాలనలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయని ప్రశ్నిస్తే… కచ్చితంగా మీకు సమాధానం ఇవ్వడం జరుగుతుంది. మీ ప్రశ్నలు ఏవో సంధించండి. ప్రభుత్వంపై బురద చల్లడమే ఏకైకలక్ష్యంగా పని చేస్తున్నవారికి ఎవరూ సమాధానం చెప్పలేరు.
చంద్రబాబు విలువలకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చాడు. ఎప్పుడు అయితే వెన్నుపోటుతో ఎన్టీఆర్ నుంచి టీడీపీని లాక్కున్నాడో.. అప్పటి నుంచి ఆయన రాజకీయం ఇదే. ప్రజా బలం ఉన్నంతవరకూ వైయస్సార్‌ సీపీని ఎవరూ ఏమీ చేయలేదు. ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా… వారికి న్యాయం జరిగేలా వ్యవహరిస్తాం. ఏ పరిస్థితిలో అయినా, దేనికైనా సమాధానం చెప్పడానికి మేం సిద్ధంగా ఉన్నాం. అంతేకానీ వ్యక్తిగత ఎజెండాతో వెళితే దానికి మేము ఎలా సమాధానం చెబుతాం. వైయస్సార్‌ సీపీకి అన్నివర్గాలు దగ్గర అవుతున్నాయనే దుగ్ధతో దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారు. ఇ‍ప్పటికైనా అలాంటి ఆలోచనలు మానుకోవాలి. బద్వేలు ఉప ఎన్నికల్లో వైయస్సార్‌ సీపీకి ఏమాత్రం ప్రజాబలం చెక్కుచెదరలేదని నిరూపిస్తాం.
పోసాని కృష్ణమురళితో పాటు ఆయన భార్యను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తే.. ఆయన నివాసంపై దాడి చేశారు. మంత్రి పేర్ని నానిని సినీ నిర్మాతలు కలిసి ఆన్ లైన్ విధానం తెమ్మని కోరితే.. దానినీ విమర్శిస్తున్నారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు ఇంటి నుంచి వస్తున్న స్రిప్ట్క్‌ కు అనుగుణంగానే పవన్‌ కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతున్నారు. మేము మాత్రం ప్రజాస్వామ్య రీతిలో వ్యవహరిస్తాం. విపక్షాలు అడిగే ప్రశ్నలకు డీసెంట్‌గా సమాధానం ఇస్తాం. పార్టీ అధ్యక్షుడుగా వేదిక పైకి ఎక్కిన పవన్ కళ్యాణ్.. తనను విశాఖలో ఓడించడం వల్లే స్టీల్‌ప్లాంట్‌ గురించి మాట్లాడను అని చెప్పడం చూస్తే పిచ్చోడు అనాలో.. ఇంకేమీ ఏమనాలో అర్థం కావడం లేదు. ప్రజలే పవన్‌ కల్యాణ్‌కు బుద్ధి చెబుతారు. పవన్ కల్యాణ్ గురించి మాట్లాడటం టైం వేస్ట్.

LEAVE A RESPONSE