ఐవరి కోస్ట్ కు చంద్రశేఖర్ రెడ్డి ఎందుకెళ్లారో చెప్పాలి?

– ఐవరి కోస్ట్ డ్రగ్స్ మాఫియాకు కేంద్రం అక్కడ ఆయనకేం పని?
– రాష్ట్రాన్ని వైసీపీ నేతలు స్మగ్లింగ్ కి నిలయంగా మార్చారు
– మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
వెస్ట్ ఆఫ్రికాలో ఐవరి కోస్ట్ వెళ్లానని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటున్నారని ఆయన ఎందుకెళ్లారో, అక్కడ ఏం వ్యాపారం జరుగుతుందో ఆయనే చెప్పాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…వైసీపీ నేతలు రాష్ట్రాన్ని డ్రగ్స్ , ఎర్రచందనం, గంజాయి, గుట్కా, బియ్యం, తలనీలాల మాఫియాలకు కేంద్రంగా మార్చి వేల కోట్ల దోపిడికి పాల్పడుతున్నారు.
ఉగ్రవాదులతో ఉమ్మడి డీల్ కుదుర్చుకుని డ్రగ్స్ తో జాతిని నిర్వీర్యం చేస్తున్నారు. డ్రగ్ మాఫియా భారిన పడి యువత నిర్వీర్యమౌతోంది, లిక్కర్ మాఫియా వల్ల పేదవారు ఆరోగ్యంపరంగా, ఆర్దికపరంగా చితికిపోతున్నారు.ఇసుక మాఫియా వల్ల 125 వృత్తులు, వ్యాపారాలు దెబ్బతిన్నాయి – ఈ మాఫియాల వల్ల ధరలు పెరుగుతున్నాయి – జాతి నిర్వీర్యం, దేశద్రోహానికి పాల్పడుతున్న ఏపీ మాఫియా డాన్ ఎవరు?తాడేపల్లి అండ లేకుండా లక్షల కోట్ల దోపిడి సాధ్యమా? కాకినాడి సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గ్యాంగ్ ప్రధానంగా కనపడుతున్నది .విజయవాడలో తూర్పుగోదావరికి చెందిన మాచవరం సుధాకర్ భార్య వైశాలి పేరిటి ఆశీ ట్రేడింగ్ కంపెనీ రిజస్టర్ అయింది.సుధాకర్ గతంలో కాకినాడ పోర్టులో శాన్ మైరైన్ కంపెనీలో గుమాస్తాగా పనిచేశారు .
ఈ కంపెనీ ద్వారంపూడి చంధ్రశేఖర్ రెడ్డి బినామీగా చెప్పుకునే మహ్మద్ అలీషాకు చెందినది. అలీషా ఒక మెరైన్ కంపెనీలో ఆపీస్ బాయి గా చేరి నేడు వందల కోట్లకు పడగలెత్తారు. స్మగ్లింగ్, బియ్యం స్మగ్లింగ్, పోర్టు కాంట్రాక్టర్లను బెదిరించడంపై కాకినాడ అలీషాపై అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయి. జీఎస్ టీ ఎగవేతపై కూడా అలీషా కేసులున్నాయి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జగన్ కి బినామీ. ఆయన సాక్షి కార్యాలయాలునిర్మించారు. సీఎం బినామీ కాకినాడ పోర్టు ఏ2 రెడ్డి అల్లుడు కొనుగోలు చేశారు. గుజరాత్ లో పట్టుబడ్డ హెరాయిన్ తో ఏపీకి సంబందం లేదని పోలీసులు ఎలా చెబుతారు?
హెరాయిన్ స్మగ్లింగ్ తో వైసీపీ నేతలకు ఉన్న సంబందం ఏంటో తేలాలి.
వెస్ట్ ఆఫ్రికాలో ఐవరి కోస్ట్ వెళ్లానని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటున్నారని అక్కడ ఏం వ్యాపారం జరుగుతుందో ఆయనే చెప్పాలి. ఐవరీ కోస్ట్ కు హెరాయిన్ కోస్ట్ అని పేరు అక్కడ ఏడాదికి రూ. 3 లక్షల కోట్ల హెరాయిన్ అక్రమ వ్యాపారం జరుగుతోంది. హెరాయిన్ అక్రమ రవాణాలో ప్రావీణ్యం ఉన్న జుల్పి రౌడ్జిని మిడిల్ ఈస్ట్ కంపెనీ ప్రతినిధిగా నియమించారు. వైసీపీ నేతలు అక్రమ సంపాద కోసం దేశ భద్రతతో ఆటలాడుతున్నారని దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాలని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోరారు.

Leave a Reply