Suryaa.co.in

Andhra Pradesh

సీఎం పేషీలో బాబు

ఏపీ ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు అమరావతిలోని సచివాలయం మొదటి బ్లాక్ లో సాయంత్రం 4.41 గంటలకు బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి హోదాలో 5 ఏళ్ల తరువాత సచివాలయానికి వచ్చిన చంద్రబాబు నాయుడుకి రాజధాని రైతులు అత్యంత ఘనమైన స్వాగతం పలికారు. వేల మంది రోడ్ల మీదకు వచ్చి….రాహదారులు అన్నీ పూలమయం చేసి ముఖ్యమంత్రి పై అభిమానం చాటారు. అలాగే సచివాలయంలో సచివాలయ ఉద్యోగులు, అధికారులు సిఎంకు స్వాగతం పలికారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా మంత్రులు, ఆలిండియా సర్వీసెస్ అధికారులు ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

 

LEAVE A RESPONSE