Suryaa.co.in

Telangana

భువనేశ్వరికి తెలంగాణ పార్టీ పగ్గాలివ్వండి

కరణం అంబికాకృష్ణ, కాట్రగడ్డ ప్రసూన

తెలంగాణ: సనత్‌నగర్‌ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి కరణం అంబికాకృష్ణ చౌదరి, పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం సందర్భంగా బాణసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. తెలంగాణలో కూడా మళ్లీ తిరుగుబావుటా ఎగురవేయా లని ఆకాంక్షించారు. నిజం గెలవాలి అంటూ చంద్రబాబు వెన్నంటి ఉండి తెలుగుదేశాన్ని గెలిపించిన నారా భువనేశ్వరి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని అంబికాకృష్ణ చౌదరి, ప్రసూన ఆకాంక్షించారు.

ఓయూలో టీడీపీ నేతల సంబరాలు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీ సీఎం అయిన సందర్భంగా ఉస్మానియా యూనివర్శిటీ లో తెలంగాణ టీడీపీ నేతలు సంబరాలు నిర్వహించారు. టీఎన్‌ఎస్‌ఎఫ్ నేతలు పెద్ద సంఖ్యలో హాజరై చంద్రబాబుకు జై కొట్టారు. ఈ సందర్భంగా కార్యకర్తలంతా విద్యార్ధులతో కలసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన, నన్నూరి నర్శిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE