– బెయిల్ వచ్చినంతమాత్రాన బాబు నిర్దోషి కాదు
– స్కిల్ స్కాంతో సంబంధం లేదని బాబు చెప్పడం లేదు
– బాబు స్కాం చేసినట్టు ప్రైమా ఫేసీ ఉంది- ఆయనే సూత్రధారి
– టెక్నికల్, హెల్త్ గ్రౌండ్స్ మీద బెయిల్ పొందాడు
– ముమ్మాటికీ చంద్రబాబు డైరెక్షన్ లోనే స్కిల్ స్కాం
– ఫేక్ ఇన్వాయిస్ లతో రూ. 241 కోట్లు కొట్టేశారు
– స్కిల్ కేసులో ఆధారాలన్నీ కోర్టు ముందుంచాం..
– బెయిలిస్తే కేసు కొట్టేసినట్లు టీడీపీ హడావుడి-సంబరాలు
– గుండె నొప్పి ఉంటే విజయయాత్రలెలా చేస్తాడు?
– చంద్రబాబు లోపలున్నా…బయట ఉన్నా మాకు ఒకటే
– వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి
వచ్చింది బెయిల్ మాత్రమే..:
– చంద్రబాబుకు బెయిల్ రావడంపై ఊహించినట్లుగానే ఆ పార్టీ నేతలు, వారికి దిశానిర్ధేశం చేస్తున్న ఎల్లో మీడియా దీపావళి ఈ రోజే వచ్చిందన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
– స్కిల్ కేసు కొట్టేసినట్లు ప్రజలకు వాళ్లు తప్పుడు మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
– కోర్టు ఈ రోజు ఇచ్చిన బెయిల్ విషయంలో విశ్లేషణలు చేయాల్సిన అవసరం కూడా లేదు.
– వాళ్లు స్పందిస్తున్న తీరు వల్ల ప్రజలకు ఒక తప్పుడు సమాచారం వెళ్లే అవకాశం ఉంది.
– సెప్టెంబర్ 9వ తేదీన అరెస్టు, ఆ తర్వాత ఆయన జ్యుడిషియరీ కస్టడీకి వెళ్లినప్పటి నుంచీ ఈ స్కాం గురించి వారు మాట్లాడటం లేదు.
– కేసు వివరాలను న్యాయవాదులు చెప్తున్నారు…మేమూ వివరిస్తూనే ఉన్నాం.
– ఇది రాజకీయ కక్ష అంటూ టీడీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నా.. ఎప్పటికప్పుడు మేం తిప్పికొడుతూ ఆధారాలన్నీ చూపించాం.
– అవన్నీ ఈ రోజుకీ మారలేదు..కేసూ అలానే ఉంది.
– చంద్రబాబు అరెస్ట్ చేయకపోతే ఏమవుతుంది అనేది ఆయన అరెస్ట్‌కు మూడు రోజుల ముందే రాష్ట్రమంతా చూసింది.
బాబు బయట ఉంటే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు:
– రూ.371 కోట్లు స్కిల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ నుంచి డిజైన్‌టెక్ కంపెనీకి వెళ్తే..దాంట్లో తలా తోక లేని షెల్ కంపెనీలకు రూ.241 కోట్లు క్యాష్‌గా మార్చి బయటకు పంపారు.
– 2018లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే జీఎస్టీ విజిలెన్స్ అధికారులు స్పష్టంగా చెప్పారు.
– ఫేక్ ఇన్వాయిస్లు ద్వారా డబ్బు బయటకు వెళ్లిందని వారు ఇన్ఫార్మ్ చేశారు.
– బయటకు వెళ్లిన డబ్బు ఎక్కడకు వెళ్లింది అనేది తెలుసుకునే ప్రక్రియలో ఆగస్టులో చంద్రబాబుకి ఐటీ నోటీసు వచ్చినప్పుడు ఒక స్పష్టత వచ్చింది.
– టిడ్కో ఇళ్లు, అమరావతి సెక్రటేరియట్ నిర్మాణంలో విపరీతంగా రేట్లు పెంచి…దాంట్లో మిగులు చంద్రబాబుకు ఇచ్చినట్లు మనోజ్ వాసుదేవ్ పార్ధసాని అనే వ్యక్తి తన వాగ్మూలంలో ఇచ్చారు.
– అక్కడ లింక్ దొరికింది…చంద్రబాబు చేసే అక్రమాల తీరేంటో స్పష్టంగా కనిపించింది.
– రూ.118 కోట్లు ఈ మనోజ్ అనే వ్యక్తి ద్వారా చంద్రబాబుకు చేరింది.
– చంద్రబాబుకు మనోజ్‌ను, ఆయన పీఏ పెండ్యాల శ్రీనివాస్ పరిచయం చేయడం, మా శ్రీనివాస్ ఏం చెబితే అది చేయండి అని చంద్రబాబు చెప్పాడు.
– మాకు ఎన్నికలు వస్తున్నాయి..డబ్బు డ్రా చేసి మాకివ్వాలని పీఏ శ్రీనివాస్ చెప్తాడు.
– కిలారు రాజేశ్, పెండ్యాల శ్రీనివాస్ ద్వారా ఆ డబ్బంతా ఇచ్చానని మనోజ్ పార్ధసాని స్పష్టంగా తన వాగ్మూలంలో చెప్పాడు.
– అది చూసిన తర్వాత పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్ధసానీ, కిలారు రాజేశ్‌లను నోటీసులిచ్చి రమ్మని సీఐడీ చెప్పింది.
– ఇలా నోటీసులివ్వగానే వారు దేశం విడిచి ఒకరు దుబాయి వెళ్లాడు..ఒకరు అమెరికా వెళ్లాడు. కిలారు రాజేశ్ పరారీలో ఉన్నాడు.
– దీన్ని చూసిన తర్వాత దీని వెనుక పెద్ద తలకాయ ఉందని, అది చంద్రబాబేనని ప్రైమాఫేసీ ఉన్నతర్వాత అరెస్ట్ చేశారు.
నిరూపించుకోవాల్సిన బాధ్యత బాబుదే..:
– 10వ తేదీన ఆయన్ను జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నా ఆ తర్వాత చంద్రబాబును ప్రశ్నించగలిగింది కేవలం ఒక్కసారే.
– ఆ రోజు ఎప్పుడైతే జీఎస్టీ వద్ద నుంచి నోటీసు రాగానే రికార్డులన్నీ మాయం చేశారు.
– షాడో ఫైల్స్‌లో సీఐడీ విచారణలో బయటపడింది సీఎం డైరెక్షన్ మేరకు నిధులు వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు వచ్చాయని చెప్పారు.
– అధికారులు వద్దన్నా సీఎం నేరుగా 13 చోట్ల సంతకాలు చేసి మరీ నిధులు విడుదల చేయించాడు.
– గంటా సుబ్బారావు అనే ఒక ప్రైవేటు వ్యక్తిని ఐదు పదవుల్లో కూర్చోపెట్టి అతని ద్వారా నిధులను బయటకు తీసుకెళ్లారు.
– ఈ స్కాం పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన కుట్ర అనడానికి అన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి.
– ఒక ప్రైవేటు వ్యక్తిని తీసుకొచ్చి ఐదు పదవులు ఇవ్వడం ఎక్కడైనా ఉందా?
– ఆ గంటా సుబ్బారావు ఫైనాన్స్ అధికారులకు కూడా డబ్బు విడుదల చేయాలంటూ ఆదేశాలిస్తాడు.
– చేసుకున్న ఒప్పందంలో డేట్, స్థలం కూడా ఉండదు. 90 శాతం సీమెన్స్ వాళ్ళు ఇవ్వాల్సిన నిధులపై అసలు ప్రస్తావనే ఉండదు.
– ఇది ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా? దీన్ని స్కాం కాదనగలమా?
– ముఖ్యమంత్రి వద్ద నుంచే కుట్రకు బీజం పడి, ఆయన ఐడియా ప్రకారం, ఆయన చెబితేనే డబ్బు రిలీజ్ చేస్తున్నామన్న తర్వాత సంబంధం లేదంటే ఎలా?
– ఆయన హయాంలోనే రాత్రికి రాత్రి ఫైళ్లన్నీ తగలబెట్టి…నామ్ కే వాస్తే ఏసీబీ విచారణ వేశారు.
– సీమెన్స్ వాళ్ళు స్పష్టంగా.. తాము రూ.3వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తాం..ఎందుకు మేం ఇస్తాం అన్నారు.
– ఇంత జరిగినా అది స్కాం కాదు..దానిలో చంద్రబాబుకు ఏం సంబంధం అంటే దేనితో కొట్టాలి..?
– నాకు సంబంధం లేదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుదే.
రోగాలున్నాయన్న వ్యక్తి..విజయఢంకా ఎలా మోగిస్తాడు?:
– 73 ఏళ్ల ముసులాడు కాబట్టి, ఆరోగ్యం ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కాబట్టి సింపతీగా చూడాలని వారే చెబుతారు.
– 73 ఏళ్ల ముసలాయనైనా సరే రెగ్యులర్ బెయిల్ రాగానే ఎక్కడైనా తిరగొచ్చట…ఇక విజయఢంకా మోగిస్తాడట అని వాళ్ళే మాట్లాడతారు.
– దేనికో ఒక దానికి స్టిక్ అయి ఉండాలిగా..? ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడకు వచ్చారు..?
– ముందు క్వాష్ అన్నారు…అది సుప్రీంలో పెండింగ్‌లో ఉంది. ఆ తర్వాత రోగాలొచ్చాయి. తాత్కాలిక బెయిల్ ఇవ్వండి అని అడిగారు.
– వచ్చిన రోగాలు కూడా మామూలివి కాదు..గుండె జబ్బులతో సహా అన్నీ వచ్చాయి.
– మొన్న వాళ్లిచ్చిన మెడికల్ రిపోర్టులను చూస్తే అతను కదలకూడదు. వళ్లంతా రీబోర్ చేయించుకోవాలి.
– సర్జరీ చేయించుకోవాలి..కాన్సర్ కూడా ఉందో లేదో తేలాలంటున్నారు.
– మరి ఇంత అబద్ధమా..? ఇప్పుడు అదంతా తూచ్ అంటారా?
– నేడు కోర్టులో బెయిల్ రాగానే మీ నాయకుడు నిర్ధోషి అనుకుంటే పొరపాటే.
– కేసు క్లియర్‌గా ఉంది. దానికి తగిన ఆధారాలున్నాయి.
– ఇదొక్కటే కాదు..ఇంకా కేసులున్నాయి. ఫైబర్ నెట్ కేసు, ఓఆర్ఆర్ కేసు, అసైన్డ్‌భూముల కుంభకోణం, లిక్కర్ కేసు, ఇసుక కేసు..ఇలా అనేకం ఉన్నాయి.
బాబు బయటున్నా..లోపలున్నా ఒకటే:
– వైఎస్సార్సీపీకి సబంధించిన వరకూ చంద్రబాబు లోపలున్నా.. బయట ఉన్నా ఒకటే.
– బాబు బయట ఉండి జనంలోకి వస్తే మాకు అంత మేలు.
– 2014–19 మధ్య ఆయన ఏం చేశాడో ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వస్తుంది.
– ఆయనేదో లోపలుంటే మాకేదో రాజకీయంగా మేలు జరుగుతుందనుకోవడం లేదు.
– కానీ చట్టపరంగా తాను చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. ఎలాగూ తప్పించుకోలేడు.
– ఒక వేళ ఆయన జనంలోకి వస్తే ఇంకా మంచిది. 2014–19 మధ్య ఆయన చేసిన మోసం ఏంటో ప్రజలకు తెలియాలి.
– జైళ్లో కూర్చుని నేను లేస్తే మనిషిని కాదు అని చెప్పి తప్పించుకోడానికి అవకాశం లేకుండా ఇది కూడా మంచిదే.
– ఒక స్కాంస్టర్కి సంబంధించిన కేసు, ఇండియాలోనే ఒక క్లాసికల్ కేసుగా ఇది నిలుస్తుంది.
– ఇంతకాలం తప్పించుకు తిరిగిన ఒక ఘనుడి క్రిమినల్ చరిత్రకు సంబంధించిన ఈ స్కాం పూర్తిగా బయటకు వస్తుంది..
– ప్రజలు తప్పుదోవపట్టాల్సిన అవసరం లేదు.
– హైకోర్టు తనకున్న విచక్షణతో న్యాయమూర్తి ఇచ్చిన బెయిల్ మాత్రమే.
– ఇన్నాళ్లలో ఎన్నడూ కేసు గురించి మాత్రం చంద్రబాబు మాట్లాడటం లేదు. తాను తప్పు చేయలేదని చెప్పలేదు.
– గంటా సుబ్బారావును ఎందుకు పెట్టుకున్నాం..నాకు సంబంధం లేదు అని కూడా అనడం లేదు.
– 17ఏ చూసి గవర్నర్ అనుమతి లేదంటాడు.
– రోగాల బారిన ఉన్న నన్ను దోమల మధ్య పడేశారు..కరుడు కట్టిన ఖైదీల మధ్య పడేశారని ఏడవడం చేశాడు.
– తప్పుడు రిపోర్టులతో వ్యవస్థలను మేనేజ్ చేసి జబ్బులున్నాయి…దయచూపండి అని వేడుకుని బయట పడాలని చూశాడు.
– మొత్తం మీద ఆయన కానీ…ఆయన పార్టీ కాని కేసుతో మాకు సంబంధం లేదు అని మాత్రం చెప్పడం లేదు.
– విచారణలో అన్నీ బయటకు వస్తాయి…రాజకీయంగా అతను బయట ఎంత తిరిగితే అంత మంచింది.
– అతనిలో ఉన్న డొల్ల తనం బయటపడుతుంది…మోసగాడు బయటకు వస్తాడు.
– ఇతను బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి, అల్ రెడీ కొందరిని దేశం కూడా దాటించాడు కాబట్టి ఏమేం చేయాలో అవి విచారణ సంస్థలు చూసుకుంటాయి.
మెడికల్ బెయిల్‌ను.. రెగ్యులర్ బెయిల్‌గా మారిస్తే సత్యం గెలిచినట్లా?:
– చంద్రబాబుకు వచ్చిన బెయిల్ పై.. ఒక తప్పుడు ఇంప్రెషన్ ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. వాళ్లు మెయిన్ స్కిల్ స్కాం కేసు గురించి మాత్రం మాట్లాడం లేదు.
– మేం రెయిజ్ చేసిన ప్రశ్నలకు మాత్రం జవాబు ఇవ్వడం లేదు.
– బెయిల్ వస్తే సత్యం గెలిచిందా?
– వృద్ధుడు గుండెపోటుతో నేడో రేపో.. అన్నట్లున్న వ్యక్తి విజయఢంకా మోగించగలడా?
– మెడికల్ బెయిల్‌ను… రెగ్యులర్ బెయిల్‌గా మారిస్తే సత్యం గెలిచినట్లా?
– ఈ స్కాంపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తే చంద్రబాబు సూత్రధారి, పాత్రధారి అని తేలింది. ఈయన్ను కూర్చోబెట్టి ప్రశ్నిస్తే ఇంకా అన్ని విషయాలు తేలతాయి.
– ఈయన దేశం దాటించిన పెండ్యాల శ్రీనివాస్‌ను ప్రశ్నిస్తే మిగతావన్నీ తేలతాయి.
– సీఐడీ విచారణ చివరి అంకంలో ఉందని, బెయిల్ ఇవ్వొద్దని చెప్తున్నది అందుకే.
– బయట ఉన్న వాళ్లను తీసుకొచ్చేందుకు రాష్ట్రం- కేంద్రం సహకారం కూడా తీసుకోవచ్చు.
– విచారణ సంస్థకు ఉన్న అధికారాల మేరకు ఇప్పటికే ఈడీకి ఇచ్చారు..వారు నలుగురిని అరెస్ట్ కూడా చేశారు.
– ఈ రోజు బెయిల్ వచ్చింది కాబట్టి కేసంతా తప్పు అనడం అసంబద్ధం.
తెలంగాణలో తెరవెనుక బాబు ఏం చేస్తున్నాడో మాకు అనవసరం:
– అక్కడ కాంగ్రెస్‌ను గెలిపించే ప్రయత్నం క్లియర్‌గా కనిపిస్తోంది.
– దాని కోసమే ఐటీ సభలు, ఇతరత్రా కార్యక్రమాలన్నీ చేశారు.
– అక్కడ పోటీకి దిగుతాడా అంటే దిగడం లేదు. తెరవెనుక అక్కడేం చేస్తున్నాడో మాకు అనవసరం.
– ఈ రాష్ట్రానికి సబంధించినంత వరకూ ఇక్కడ ప్లేయరా? అక్కడ ప్లేయరా?
– ఆయన ఇక్కడ ప్లేయర్ అయితే ఆయన గతంలో చెప్పిన మాయమాటలు, మళ్లీ ఎలాంటి మోసాలతో వస్తున్నాడో ప్రజలకు చెప్తాం.
– తన కంట్రోల్లో ఉన్న పవన్ కల్యాణ్‌ను అడ్డం పెట్టుకుని ఎలా వస్తున్నాడో చెప్తాం.