Suryaa.co.in

Andhra Pradesh

ఒకే వేదికపై బాబు పవన్

• 28న తాడేపల్లిగూడెం పత్తిపాడులో ఇరుపార్టీల ఉమ్మడి సభ
• టీడీపీ-జనసేన కలయికను ఓర్వలేక, రెండుపార్టీలను విడదీయడానికే జగన్ రెడ్డి దుష్ప్రచారం చేయిస్తున్నాడు
• ఇరుపార్టీల నేతలు, కార్యకర్తలు అధికారపార్టీ దుష్ప్రచారాలు సమర్థవంతంగా తిప్పికొట్టాలి
• ప్రజలకోసం..రాష్ట్రం కోసమే టీడీపీ-జనసేనలు కలిశాయనే వాస్తవం గుర్తెరిగి సంయమనంతో వ్యవహరించాలి
• ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ లదే అంతిమ నిర్ణయం
• 28వ తేదీన తాడేపల్లి గూడెం సమీపంలో ఇరుపార్టీలు భారీ స్థాయిలో ఉమ్మడి సభ నిర్వహించబోతున్నాయి
• ఆ సభకు రెండుపార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీసంఖ్యలో తరలివచ్చి జగన్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టించాలి
– టీడీపీ-జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశానంతరం మీడియాతో మాట్లాడిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు

” నేడు టీడీపీ-జనసేన రాష్ట్రస్థాయి తొలి సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. దేశ చరిత్రలో తొలిసారి ఇంత చెత్త ముఖ్యమంత్రిని, ఇంత దుర్మార్గమైన ముఖ్యమంత్రిని చూస్తున్నామని సమావేశంలో పాల్గొన్న నేతలందరూ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే జగన్ ఒక సైకోలా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశాడు. మొత్తం వ్యవస్థల్ని నాశనం చేశాడు. రాజకీయ పార్టీలు, మీడియా ప్రతినిధులు, ప్రజలు స్వేచ్ఛగా వ్యవహరించకుండా నియంత్రత్వచర్యలకు పాల్పడ్డాడు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలపై దాడులకు పాల్పడి, వారి ఆస్తులు దోచుకొని, తిరిగి వారిపైనే తప్పుడు కేసులుపెట్టించి చిత్రహింసలకు గురిచేశాడు. తన అరాచకత్వాన్ని ప్రశ్నించిన వారిని చంపించాడు. ఈ పరిస్థితులన్నీ చూశాక తెలుగుదేశంపార్టీ – జనసేన 5 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జగన్ రెడ్డికి వ్యతిరేకంగా చేతులు కలిపాయి. జగన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి కాకూడదు అన్న ఉద్దేశంతోనే రెండుపార్టీలు కలిసి ముందు కు సాగుతున్నాయి. ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం చేస్తున్న దమనకాండపై ఇరుపార్టీలు ఎప్పటినుంచో కలిసి పోరాడుతున్నాయి.

28న తాడేపల్లిగూడెం పక్కనున్న పత్తిపాడులో ఇరుపార్టీల ఉమ్మడిసభ
త్వరలోనే రాష్ట్రంలో ఎన్నికల సంగ్రామం మొదలవుతోంది. ఈ నేపథ్యంలో ఇరుపార్టీల అధినేతలు రాష్ట్రప్రజలకు ఒక ఉమ్మడి సందేశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా రాష్ట్రచరిత్రలో గతంలో ఎన్నడూ జరగనివిధంగా నభూతో అన్న రీతిలో ఈ నెల 28వ తేదీన తాడేపల్లి గూడెం పక్కన పత్తిపాడు గ్రామంలో తెలుగుదేశం – జనసేన పార్టీల ఉమ్మడి సభను నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చాము.

ఈ సభ నిర్వహణకు ఇరుపార్టీల నేతలం అంగీకరించాం. ఇరుపార్టీల వైపు నుంచి మొత్తం 12 మంది సభ్యులు సభా నిర్వహణ ఏర్పాట్లు చేస్తారు. ఈ సమావేశానికి తరలి రావాలని టీడీపీ-జనసేన కుటుంబ సభ్యులకు, జగన్ రెడ్డి బాధితులైన రాష్ట్ర ప్రజలకు ఆహ్వానం పలుకుతున్నాం. భారీసంఖ్యలో తరలివచ్చి, సభను విజయవంతం చేయాలని, మన రెండు పార్టీల సభతో జగన్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టేలా చేయాలని కోరుతున్నాం.

ఇరుపార్టీల సమన్వయ సమావేశంలో టీడీపీ-జనసేన పార్టీల కలయికను స్వాగతిస్తూ, జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం మీడియాపై చేస్తున్న దాడుల్ని నిరసిస్తూ తీర్మానం చేయడం జరిగింది. టీడీపీ – జనసేన ఉమ్మడి మేనిఫెస్టోపై కూడా ఇరుపార్టీల అధ్యక్షులు వీలైనంత త్వరలోనే ప్రకటన చేస్తారు. ఇక సీట్ల సర్దుబాటుపై కూడా టీడీపీ జనసేన పార్టీల అధినేతలే అంతిమంగా నిర్ణయిస్తారు.

వారి నుంచి ఉమ్మడి ప్రకటన వెలువడే వరకు ఇరుపార్టీల నేతలు, కార్యకర్తలు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కలిసి పనిచే యాలని కోరుతున్నాం. మాకూటమి ఏర్పాటును జీర్ణించుకోలేకనే సీట్ల కేటాయింపులో అభిప్రాయబేధాలు ఉన్నట్టు టీడీపీ-జనసేన పార్టీల మధ్య తగవులు పెట్టడానికి జగన్ రెడ్డి, అతని నీలి..కూలిమీడియా ప్రయత్నిస్తున్నాయి.

ఈ వాస్తవాన్ని ఇరుపార్టీల శ్రేణులు గ్రహించి, జాగరూకతతో వ్యవహరించాలని, అధికారపార్టీ దుష్ప్రచారాలు నమ్మి ఆవేశకావేశాలకు లోనుకావద్దని కోరుతున్నాం. చంద్రబాబు – పవన్ కల్యాణ్ లు 5 కోట్లమంది ప్రజల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నారనే వాస్తవాన్ని అంద రూ గ్రహించాలి. ఈ సమావేశంలో టీడీపీ – జనసేన కలయికను స్వాగతిస్తూ ఒక తీర్మానం చేస్తే, జగన్మోహన్ రెడ్డి అతని ప్రభుత్వం మీడియాపై చేస్తున్న దాడుల్ని నిరసిస్తూ, ప్రజలకోసం.. రాష్ట్రభవిష్యత్ కోసం పాటుపడుతున్న మీడియాసంస్థలకు , ప్రజలకు అండగా నిలవాలని మరో తీర్మానం చేశాం. జగన్ రెడ్డి మీడియాపై చేస్తున్న దాడి… ముమ్మాటికీ ప్రజాస్వామ్యంపై చేస్తున్న దాడే. మరలా రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడే వరకు, రామరాజ్యం వచ్చేవరకు ప్రజలందరూ టీడీపీ-జనసేన పక్షానే నిలవాలి. ” అని అచ్చెన్నాయుడు కోరారు.

LEAVE A RESPONSE