Suryaa.co.in

Features

స్వేచ్చాభారతి నుదుట వీర”తిలకం”..

స్వరాజ్యం నా జన్మహక్కు
నీ నినాదమే ఆనాడైంది
భరతజాతి వాక్కు..
తెల్లదొరల ముష్కర పాలనకు
భరతవాక్యం..
ఆ మాటతోనే
దేశం అయింది ఐక్యం..!

బాలగంగాధర్ తిలక్..
బ్రిటిష్ వెన్నులో చలి
పుట్టించిన నాయక్…
బొంబాయిలో పుట్టిన బాంబు..
స్వరాజ్య పోరాటంలో తలెత్తిన
ఎన్నో ప్రశ్నలకు ఒకే జవాబు..!

ఇండియాలో అశాంతికి ఆద్యుడు..
ఇది నాటి దొరల మాట..
ఒక్క నినాదమే ఆయన
ప్రయోగించిన తూటా..!

దేశానికి స్వాతంత్య్రం
తెచ్చిన కాంగ్రెస్..
మొదటి నుంచి మితవాదమే
అలాంటి పార్టీలో
బాలగంగాధరుడిది సింహనాదమే..
ఏడాదికో మూడు రోజుల మీటింగ్..
స్వరాజ్యం ప్రకటించాలని
అభ్యర్థన..నిరసన..
ఇదే వాదం..
అడుక్కోవద్దు..లాక్కుందాం..
అన్నది తిలక్ సంవాదం..
అది అతివాదం..ఆన్న పెద్దలు
పప్పు ముద్దలు..
కాంగ్రెస్ ను
త్రీ డే తమాషా..అంటూ
అగ్గిమీద గుగ్గిలమే హమేషా!

తిలక్..ఒక ఆవేశం..
ఒక ఉత్తుంగతరంగం..
స్వేచ్ఛా నినాదం..
పోరాటమే పథం…
స్వరాజ్య సాధనే శపథం..
బాపూ..
ఫాదర్ ఆఫ్ ది నేషన్ అయితే
తిలక్ అంతకుమునుపే
ఫాదర్ ఆఫ్ సెన్సేషన్..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE