మైనింగ్ దొంగలను వదిలేసి ప్రశ్నించే గళాలపై తప్పుడు కేసులా?

Spread the love

-రాజకీయ కక్షసాధింపులో భాగంగానే వరపుల రాజాపై వేధింపులు
-టిడిపి న్యాయవిభాగం కేంద్ర కార్యాలయ ప్రధాన కార్యదర్శి గూడపాటి

అమరావతి: రాష్ట్రంలో ప్రకృతి సంపదను అడ్డగోలుగా దోచుకుంటున్న వైసిపి దొంగలను వదిలేసి… విశాఖ- తూర్పుగోదవారి సరిహద్దుల్లో వేలకోట్ల లాటరైట్ దోపిడీని ప్రశ్నిస్తున్నందుకు మాజీ ఎమ్మెల్యేపై వరుపుల రాజాపై తప్పుడు కేసులతో వేధిస్తున్నారని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయ న్యాయవిభాగం ప్రధాన కార్యదర్శి గూడపాటి లక్ష్మీనారాయణ ఆరోపించారు. తూర్పుగోదావరి-విశాఖ సరిహద్దుల్లో వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి నేతృత్వంలో కొనసాగుతున్న లాటరైట్ దోపిడీపై గత కొంతకాలంగా వరుపుల రాజా పోరాడుతున్నారు… దీంతో ఏవిధంగానైనా ఆయన గొంతునొక్కాలని భావించిన ప్రభుత్వం ఒక పాతకేసును బయటకు తీసి వేధింపులకు పాల్పడుతోంది… ఇది దుర్మార్గమైన చర్య అని అభివర్ణించారు.

గండేపల్లి సొసైటీలో అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణలపై కోఆపరేటివ్ చట్టం 60 క్లాజ్ -1 కింద విచారణ కూడా పూర్తయింది. అయితే ఈ కేసులో 68/21 కింద 20-3-2021న గండేపల్లి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. కేసు నమోదుచేసే సమయానికి ఈకేసులో వరుపుల రాజా పేరు లేదు. అయితే రాజకీయ కక్షతో తాజాగా ఆయన పేరును ఇరికించి తాజాగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వైసిపి ప్రభుత్వ అరాచకాలపై పోరాడుతున్న టిడిపి నేతలెవరూ జగన్ రెడ్డి సర్కారు బెదిరింపులకు భయపడబోరు… వరుపుల రాజాపై తప్పుడు కేసును న్యాయపరంగా ఎదుర్కొంటామని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

Leave a Reply