తాము మెచ్చినోల్లు, తమకు నచ్చినోల్లు, తమ చెప్పు చేతల్లో చిక్కినోల్లను మాత్రమే కుర్చీ ఎక్కిస్తం లేకుంటె దింపుతం.. మమ్ముల కాదంటే మా పెన్నులను గన్నులు చేసి అమాయక తెలంగాణ బుర్రల మీద థాట్ పోలీసింగ్’ చేస్తం మిమ్ముల ఆగం చేస్తామని తెలంగాణ రాజకీయాలను కలుషితం చేస్తున్నది ఓ గుంపు.
నిజాయితీగా ప్రజల కోసమే పనిచేసే నిఖార్సయిన జర్నలిస్టులు విశ్లేషకుల నడుమ ఇటువంటి తోడేల్ల గుంపు ఒకటి చేరింది.
అహంకారపూరిత ఆధిపత్య భావజాలపు మత్తులో,.. పత్రికా స్వేచ్ఛ/భావప్రకటనా స్వేచ్ఛ అనే పవిత్రమైన శివలింగం మీదికి ఎగబాకి ఎక్కి కూసున్నయి ఇటువంటి కొన్ని తెలంగాణ నల్లకొండి తేల్లు.
విషం నింపుకున్న స్వీయ మానసిక ధోరణులతో వ్యాసాలు కథనాలు అల్లుతూ, ఫాల్స్ వార్తలతో కుట్టి సంపుతున్నరు.
డిసెంబర్ 3 తర్వాతనయినా జనాల మెదల్లలో విషాన్ని నింపుతున్న ఈ నల్లతేల్ల కొండీలిరువకుండా నిర్లక్ష్యం వహిస్తే, వీరి దుష్ప్రచార విషపుకాట్లకు ఇప్పటికే నష్టపోయిన తెలంగాణ., భవిష్యత్తులో ఇంకా భారీ మూల్యం చెల్లించుకోకం తప్పదు.
తెల్లందాక పొద్దుందాక ప్రజల మెదల్ల మీద ‘థాట్ పోలీసింగ్’ చేస్తున్నఈ తెలంగాణ వ్యతిరేక సోషల్ మీడియా,యాంటీ సోషల్ మీడియాకు సర్వేల పేరుతో మరో తేలుకొండి జమయ్యింది.
ఎన్నికలు రాంగనే గుంటకాడికి చేరుకునే నక్కలమాదిరి, ప్రత్యర్థులకు ముందల్నే అమ్ముడుపోయి సర్వేల పేరుతో కొందరు తెలంగాణ ల తిరుగుతున్నరు.
ప్రజల మనసులను పక్కదారిపట్టించి వాల్లకు నచ్చినోల్లకే వోట్లు వేయించుకోవాలని థాట్ టెర్రరిజానికి దిగుతున్నరు.
సోషల్ మీడియాను యాంటీ సోషల్ మీడియాను వాడుకుంటూ ప్రి పోల్స్ ఎగ్జిట్ పోల్స్ పేరుతో ఫేక్ రిపోర్టులను వండుతూ ప్రజల ఆకాంక్షలను అభీష్టాలను పక్కదారి పట్టిస్తూ పార్లమెంటరీ పంథాను ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నరు.
ఎవ్వడెవ్వడు ఎట్లా సర్వే చేస్తరో…ఎంతమందితో చేస్తరో….అసలు వాల్ల సిబ్బంది ఎంతమంది వున్నరు. వాల్ల సర్వే విధానం పద్దతులేంటియనే విషయం ఎవ్వరికీ తెల్వదు. ఏం చేస్తరో తెల్వదు.
ఇప్పటికే చాలా సార్లు అంచనాలు తప్పి వాల్ల సర్వేలు పూర్తి తప్పుడు సర్వేలని తేలినా మల్లా సిగ్గుశరం వొదిలి ఏమాత్రం అపరాధ భావన లేకుండా మల్లా సర్వేల పేరుతో ప్రజాభిప్రాయాన్ని పక్కదారి పెట్టిద్దామని చూస్తున్నరు.
భావ ప్రకటనా స్వేచ్ఛ ముసుగేసుకుని వస్తున్న వీరి తీవ్రవాద మానసిక దాడులను కట్టడి చేయకపోతే జనాల బుర్రలన్నీ విషంతో పొంగి పొర్లి ఏది నిజమో ఏదబద్దమో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అనే అనుమాన కోమా స్థితిలోకి వెల్లే ప్రమాదమున్నది.
అట్లా కోలుకోలేక ప్రజాస్వామ్య వూపిరులను వొదలేసిన జీవశ్చవం గా సభ్య సమాజం మారడం ఖాయం.
నిన్నటి ఎన్నికలకు ముందు ప్రీ పోల్ సర్వేల పేరుతో…ఎన్నికలు నడుస్తుండంగనే ఇంక వొడువక ముందల్నే ఆత్రమాత్రంగా పోస్ట్ పోల్ సర్వేల పేరుతో విడుదల చేసిన వీల్ల రిపోర్టులు మరోసారి ఫేక్ రిపోర్టులని తేలడం ఖాయం..
సోషల్ మీడియా యాంటీ సోషల్ మీడియా మీద ఎట్లయితే గౌరవం నమ్మకం విశ్వాసం పోయిందో అట్లా ఈ సర్వే వ్యవస్థ మీద కూడా జనం విశ్వాసం కోల్పోవడం ఖాయం.
వీల్ల థాట్ తీవ్రవాదాన్నుంచి తప్పించుకుంటూ బయటపడిన జనాభిప్రాయం, సిఎం కేసీఆర్ మీది విశ్వాసం, లక్ష్యాన్ని చేరుకుని బ్యాలెట్ బాక్సుల్లో భధ్రంగా వుంది.
– సహస్ర