Suryaa.co.in

Andhra Pradesh

లోకేష్ యువ గళం పాదయాత్రకు భారీగా బైక్ ర్యాలీగా తరలి వెళ్లిన టిడిపి, జనసేన పార్టీ శ్రేణులు

– ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, బూరుగుపల్లి శేషారావు

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్ర కాకినాడ జిల్లాలోకి అడుగు పెట్టిన సందర్భంగా సర్పవరం జంక్షన్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడంతో జగ్గంపేట నియోజకవర్గం నుండి వందలాదిగా బైకులు, కార్లు గాలిగా బయలుదేరి వెళ్లిన టిడిపి, జనసేన శ్రేణులు ముందుగా నాలుగు మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జగ్గంపేట టిడిపి కార్యాలయంకు చేరుకున్నారు. ఈ ర్యాలీని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, నిడదవోలు మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు జండా ఊపి ర్యాలీ ప్రారంభించారు.

అనంతరం వారు మాట్లాడుతూ యువ గళం పాదయాత్ర ఆంధ్ర రాష్ట్రానికి సువర్ణ యుగం తేవడానికి బాటలు వేస్తుందని వైసీపీ రాక్షస పాలన అంతం చేయడానికి లోకేష్ చేస్తున్న పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని ప్రజలు, మహిళలు బ్రహ్మరథం పడుతూ నేటికి 200 రోజులు పైబడి పాదయాత్ర సాగిస్తున్న ఆయనను చూసి వైసిపి మంత్రులకు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కి నిద్ర పట్టడం లేదని అందుకే ఏదో విధంగా పాదయాత్రను అడ్డుకోవాలని ఎన్నో కుయత్తులు కుతంత్రాలు ఎన్ని అడ్డంకులు సృష్టించిన మళ్లీ యువ గళం పాదయాత్ర పున ప్రారంభించుకుని ముందుకు సాగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యదర్శులు నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్చార్జిలు, బూత్ ఇన్చార్జిలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు.

LEAVE A RESPONSE