విశాఖ ఘటనపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి డీజీపీ సవాంగ్‌పై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.విశాఖ ఏజెన్సీలో నిన్న జరిగిన ఘటనపై గౌతమ్ సవాంగ్ బట్టలిప్పి పోవాలని కోరుతున్నామని టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అన్నారు. 25 వేల ఎకరాలలో గంజాయి పండిస్తున్న ఎక్కడ యాక్షన్ తీసుకుంటున్నారు చెప్పాలని డిమాండ్ చేశారు. గంజాయిని లిక్విడ్ రూపంలో, చాక్లెట్ల రవాణా చేస్తుండగా పోలీసులు కళ్ళ కనబడడం లేదా? అని ప్రశ్నించారు. పాడేరు, చింతపల్లిలో వైసీపీ నేతలు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. గంజాయి స్మగ్లర్ చేస్తున్నది వైసీపీ నేతలేఅనిఆరోపించారు.
ఎలాంటి అనుమతి లేకుండా ఇతర రాష్ట్రాల పోలీసులు ఎలా ఇచ్చారు? ఎలా ఫైరింగ్ చేశారు? అని ప్రశ్నించారు. నిన్న ఏజెన్సీలో జరిగిన ఘటనపై, గంజాయిపై వైట్ పేపర్ విడుదల చేయాలన్నారు. కాగా దీనిపై మహిళా హక్కుల కమిషన్ విచారణకు ఆదేశించింది.