– ఆ ప్రాంతాలకు చంద్రబాబునాయుడు ఏంచేశాడో ఆధారాలతో సహా చర్చకు రావడానికి నేను సిద్ధం
• చంద్రబాబునాయుడు ఉత్తరాంధ్ర, సీమలో చేసిన అభివృద్ధి కళ్లముందుకనిపిస్తుంటే, జగన్మోహన్ రెడ్డి అవినీతిపత్రిక సాక్షిలో తప్పుడురాతలు రాయిస్తున్నాడు
• సిగ్గులేకుండా విషప్రచారం చేయడంకాదు.. ఈరెండున్నరేళ్లలో మీరేంచేశారో చెప్పండి
• సాక్షి మీడియా, వైసీపీ ఎంతదుష్ప్రచారంచేసినా జగన్మోహన్ రెడ్డి గుంటనక్కనైజాన్ని కప్పిపుచ్చలేరు
• అవినీతిపత్రిక, జగన్మోహన్ రెడ్డి భాజాభజంత్రీల పత్రికలో విషపురాతలురాసినందుకు తక్షణమే చంద్రబాబునాయుడికి బహిరంగక్షమాపణ చెప్పండి
– మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి
ఉత్తరాంధ్రప్రాంత అభివృద్ధిని చంద్రబాబు నాయుడు పట్టించుకోలే దని, ఆయన ఆప్రాంతాన్ని చిన్నచూపు చూశాడని అవినీతిపత్రిక సాక్షిలో తప్పుడురాతలు రాయించిన సజ్జల రామకృష్ణారెడ్డి, మూడుజిల్లాలఅభివృద్ధిపై బహిరంగచర్చకు వస్తే అసలువాస్తవాలు ఆయనదిమ్మతిరిగేలా చెబుతామని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి సవాల్ విసిరారు.ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
సజ్జలరామకృష్ణారెడ్డి, ప్రభుత్వపెద్దలు, వైసీపీనేతలెవరైనా సరే ఉత్తరాంధ్రప్రాంత అభివృద్ధికి చంద్రబాబునాయుడు ఏంచేశారో, ఈ రెండున్నరేళ్లలో ఈప్రభుత్వం ఏంచేసిందో కళ్లకుకట్టినట్టు చూపించ డానికి తమతోపాటు ప్రజలంతా సిద్ధంగాఉన్నారు. చంద్రబాబు నాయుడు 100కు 100శాతం ఉత్తరాంధ్రప్రాంతాన్ని అభివృద్ధిచేస్తే, జగన్మోహన్ రెడ్డి 3శాతంకూడా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి భాజాభజంత్రీల పత్రిక అయిన సాక్షిలో తప్పుడురాతలు రాయడం కాదు చేయాల్సింది.
విశాఖపట్నంలో మూడు అంతర్జాతీయ సమ్మిట్లుపెట్టి, 5లక్షలకోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినవ్యక్తి చంద్రబాబు నాయుడు. విశాఖ స్మార్ట్ సిటీ, మెడ్ పార్క్, ఏషియన్ పెయింట్స్, కోకాకోలా కంపెనీతోపాటు లులూగ్రూపు వంటి బడా పరిశ్రమలువచ్చేలా చేసిన ఘనత చంద్రబాబుది. వాటితోపాటు జాతీయ సంస్థలైన ఐఐఎమ్ తో పాటు నాలుగు యూనివర్శిటీలు తీసుకొచ్చాడు.
జగన్మోహన్ రెడ్డి వచ్చాక కనీసం సూదులు తయా రుచేసే కంపెనీ కూడా విశాఖకు రాలేదు. రూ..700కోట్లతో విశాఖ నగరంలో అండర్ గ్రౌండ్ కేబుల్ నెట్ వర్క్ ఏర్పాటు చేసిన మొన గాడు చంద్రబాబునాయుడు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థకు రూప కల్పనచేశాడు. రాజశేఖర్ రెడ్డి తనహాయాంలో గోదావరి సుజల స్రవంతి ఆరంభించి వదిలేస్తే, దాన్ని చంద్రబాబునాయుడు అధికా రంలోకి రాగానే రూ.430కోట్లతో పనులుప్రారంభించాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక గోదావరి సుజలస్రవంతికి రూపాయి కూడా ఇవ్వలేదు.
శ్రీకాకుళంలో తోటపల్లి, పెద్దగడ్డ, మద్దువలస వంటి అనేక ప్రాజెక్టులను చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. విజయనగరంలో వంశధార ఫేజ్2 పనులు పూర్తిచేయించింది చంద్రబాబు నాయుడు కాదా? భోగాపురం ఎయిర్ పోర్ట్ ని చంద్రబాబు ఏర్పాటు చేస్తే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకివచ్చాక 500ఎకరాలకు కక్కుర్తిపడి జీఎంఆర్ తో తెగదెంపులు చేసుకొని విమానాశ్రయ పనులు ఆపేయించాడు.
దిక్కుమాలిన సాక్షిలో తలాతోకలేని రాత లు రాయించడంకాదు, వెనుకబడిన జిల్లాలైన ఉత్తరాంధ్ర జిల్లాల కు జగన్మోహన్ రెడ్డి ఎన్నినిధులు తీసుకొచ్చి, ఎంత అభివృద్ధిచేశా రో చెప్పాలి. చంద్రబాబునాయుడి హాయాంలో ఏర్పాటైన అచ్యుతా పురం, నక్కపల్లి క్లస్టర్ల సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలుసా? ఏడీబీద్వారా చంద్రబాబునిధులుతెచ్చి, వాటినిప్రారంభిస్తే జగన్ వచ్చాక ఆపనులన్నీ ఆగిపోయాయి. అనకాపల్లి నుంచి అనంత పురం 6లైన్ల జాతీయరహదారి నిర్మాణం ఏమైంది? దానిపై విజ య సాయిరెడ్డి పార్లమెంట్లో ప్రశ్నిస్తే నితిన్ గడ్కరీ ఏంచెప్పారు ? రూ.2,570కోట్లతో టీడీపీహాయాంలో దానినిర్మాణం 90శాతం పూర్తయిందని చెప్పలేదా?
ఉత్తరాంధ్రగురించి, రాయలసీమ బిడ్డనని చెప్పుకునే జగన్ రెడ్డి, తన ప్రాంతానికి ఈ రెండున్నరేళ్లలో ఏంసాధించాడు? చంద్రబాబు నాయుడి హయాంలో కియా, చిత్తూరులో మొబైల్ పరిశ్రమలు, హీరోకంపెనీ, మహేంద్ర అండ్ మహేంద్ర, అశోక్ లేలాండ్ కంపెనీలు వచ్చాయి. చంద్రబాబునాయుడు గారు ఓర్వకల్లు విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభిస్తే, ఈముఖ్యమంత్రి వచ్చాకతిరిగి మరలా సిగ్గులేకుండా ప్రారంభోత్సవం చేసుకున్నాడు.
కర్నూలు జిల్లాలో 1000 మెగావాట్ల సోలార్ పార్క్ తెచ్చింది చంద్రబాబునాయుడు కాదా? జగన్ రెడ్డి నువ్వువచ్చాక గనులన్నీ పెద్దిరెడ్డికి అప్పగించా వు. వాటిపై వచ్చేఆదాయాన్ని పోగేసుకుంటూ కాలక్షేపం చేస్తు న్నావు. తెలుగుగంగద్వారా నీళ్లుపారించినా, కృష్ణాజలాలు పులి వెందులకు తరలించినా ఆ ఖ్యాతి అంతా చంద్రబాబుకే దక్కుతుం ది. రాయలసీమలో కులవిద్వేషాలు రెచ్చగొడుతూ, ఓట్లుపొందేపనిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. టీడీపీప్రభుత్వంలో ఐదేళ్లలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతా లకు ఏంసాధించామో చెప్పడానికి ఆధారాలతోసహా వస్తాను.. మీరు రాగలరా? అలావచ్చి బహిరంగచర్చలో పాల్గొని ప్రజలకు సమాధానంచెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డికిగానీ, సజ్జలకు గానీ ఉందా?
విశాఖపట్నానికి చంద్రబాబు హెచ్ ఎస్ బీసీ ఐటీ కంపెనీ తెస్తే, జగన్ వచ్చాక దాన్ని మూసేయించాడు. అదీ ఈయన సాధించిన అభివృద్ధి. ఇంట్లోతాలింపుకు నూనెలేని ఆమె, ఊరంతా వండిపెడతాను అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి వైఖరిఉంది. విశాఖ లో ఉన్నస్టూడియోలు మూయించిన జగన్ రెడ్డి, కొత్త స్టూడియో లు నిర్మిస్తాను అంటే నమ్మడానికి సినిమావాళ్లకు బుద్ధుందా అని ప్రశ్నిస్తున్నా?
చిరంజీవి కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు కదా… ఆయనకు వాస్తవాలు తెలియవా? విశాఖపట్నం సమీపంలోని గంగవరం పోర్టుని అదానీగ్రూపుకు అడ్డగోలుగా కట్టబెట్టిన జగన్ రెడ్డి, కొత్త పోర్టులు నిర్మిస్తాడా? అదానీకి గంగవరంపోర్టు కట్టబెట్టిన ప్పుడు, అదానీడేటా సెంటర్ ఏమైందని జగన్ రెడ్డి, సదరు కంపెనీ వారిని ఎందుకు అడగలేదు? భావనపాడు పోర్టుని కూడా అదానీ కంపె నీకి బేరంపెట్టాడు జగన్మోహన్ రెడ్డి.
చంద్రబాబునాయుడి హయాంలో ఒప్పందం చేసుకున్న లులూ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీలు ఏమయ్యాయి జగన్ రెడ్డీ? సాక్షిపేపర్ చేతిలో ఉందికదా అని.. ఉత్తరాంధ్ర గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోము. విశాఖనగరంలో టీడీపీప్రభుత్వం పేదలకోసం నిర్మించిన 22వేల టిడ్కోఇళ్లను వారికిపంచకుండా ఈ ముఖ్యమంత్రి వారిని వేధిస్తున్నది నిజంకాదా? చంద్రబాబునాయుడు లక్షలకోట్ల అవినీతిచేశాడని కరపత్రాలు పంచిన జగన్ రెడ్డి, ఇప్పుడు దానిగురించి ఎందుకు మాట్లాడడు? అమృత్ విశ్వవిద్యాలయం ఏమైందో, ఎవరు తెచ్చారో ఈ జగన్ రెడ్డికి తెలుసా? జగన్ రెడ్డికి తెలిసిందల్లా అప్పనంగా లాక్కోవడం.. అయినకాడికి పోగేసుకోవడమే.
అతనికి అభివృద్ధి అనేమాటకు అర్థమే తెలియదు. అదానీకి, హెటిరోకు ఉత్తరాంధ్ర భూములు దోచిపెట్టిన జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్రఅభివృద్ధి గురించి మాట్లాడే అర్హతలేదు. ఉత్తరాంధ్రకు జీవనాడి అయిన పోలవరాన్ని 69.70 శాతం వరకు చంద్రబాబునాయుడు పూర్తిచేస్తే, ఈ జగన్ రెడ్డి వచ్చాక ఒక్కశాతం పనిఅయినాచేశాడా? నిర్వాసితులకు అది చేస్తాను..ఇదిచేస్తాను అనిచెప్పి వారిని మోసగించాడు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి నీరువచ్చేలా ఏర్పాటుచేసిన పోలవరంప్రాజెక్ట్ లోని 6 గేట్లను జగన్ రెడ్డి ఎందుకుమూయించాడు?
ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ అనే నక్కగురించి ఎంతచెప్పినా తక్కువే అవుతుంది. గుంటనక్కలా అధికారంకోసం కాచుకొని కూర్చున్న జగన్ రెడ్డి, నేడు రాష్ట్రాన్ని పీక్కుతింటున్నాడు. ఏనుగులాంటి చంద్రబాబుతో గుంటనక్కలాంటి జగన్ ను పోలుస్తూ, అవినీతిపత్రిక సాక్షిలో తప్పుడురాతలురాయించడం మానుకోండి.
ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని సాక్షియాజమాన్యంవారు, జగన్మోహన్ రెడ్డికి బహిరంగ క్షమాపణచెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. మరలా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక, ఉత్తరాంధ్రలో ఈప్రభుత్వం ఆపేసిన పనులన్నింటినీ తిరిగిప్రారంభిస్తామని స్పష్టంచేస్తున్నాం.