– మాజీ మంత్రి, శాసనమండలి సభ్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్
గొప్ప చారిత్రక నేపథ్యం కలిగి మహామహులు నడయాడిన పల్నాడు జిల్లాకు తన సాహిత్యం ద్వారా విశ్వ నరుడు గా ప్రఖ్యాతిగాంచిన గుర్రం జాషువా పల్నాడు జిల్లాగా నామకరణం చేయడ చేయడం సముచితంగా ఉంటుందని మాజీ మంత్రి ప్రస్తుత శాసన మండలి సభ్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు.
ఇంటలెక్చువల్ ఫోరమ్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ గుర్రం జాషువా కళాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీల, దళిత, ప్రజాసంఘాల మేధోమధన రౌండ్ టేబుల్ సమావేశం స్థానిక అరండల్ పేట గీతా రీజెన్సీ సమావేశమందిరంలో నిర్వహించారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ.. గతంలో ఎన్టీఆర్ మండల వ్యవస్థకు స్వాగతం పలికితే ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ శ్రీకారం చుట్టి మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం దిశగా అడుగులు వేస్తూ అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నడుపుతున్నారని చెప్పారు.
పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అట్టడుగు వర్గాలకు అందాలంటే పాలనా వికేంద్రీకరణ అవసరమని భావించి భావించిన ముఖ్యమంత్రి 26 కొత్త జిల్లాలు ఏర్పరచటం శ్లాఘనీయం అన్నారు. పల్నాడు ప్రాంతం లో సామాజిక రాజకీయ అసమానతలు తొలగి అభివృద్ధికరమైన జిల్లా గా మారాలంటే జాషువా జిల్లాగా నామకరణం చేసేలా ప్రభుత్వాన్ని ఒప్పిస్తా మని తెలియజేశారు.
శాసనమండలి సభ్యులు కే ఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ..జిల్లాలో లో అత్యల్ప అక్షరాస్యత ఉన్న పల్నాడు ప్రాంతం అభివృద్ధి చెంది సామాజిక న్యాయం జరగాలంటే జాషువా పేరును పెట్టక తప్పదని అన్నారు.
రాష్ట్ర మధ్య నియంత్రణ అమలు కమిటీ చైర్మన్ వీ. లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ పాలన వికేంద్రీకరణ లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాను మూడు జిల్లాల విభజిస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పల్నాడు జిల్లాకు జాషువా పేరు పెట్టాలని అదేవిధంగా గురజాల, మాచర్ల డివిజన్ లకు కన్నెగంటి హనుమంతు, బ్రహ్మనాయుడు పేర్లను పెట్టాలని ప్రభుత్వానికి సూచిస్తున్నట్లు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ షాజిల, ప్రొఫెసర్ పొన్నెకంటి రత్నాకర్, డాక్టర్ ఆదూరి సామ్యూల్ జాన్, సౌపాటి రమేష్ బాబు, న్యాయవాదులు గడ్డం ఎలీషా, పి సునీల్ కుమార్, చందోలు శోభారాణి, బి ఎస్ పి నాయకులు పుష్ప రాజ్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నాయకులు బషీర్ అహ్మద్, కొరివి వినయ్ కుమార్, పిల్లి మాణిక్యాలరావు, జాషువా కళాపీఠం కార్యదర్శి డాక్టర్ నూతక్కి సతీష్, ఎం జె ఎస్ ఎస్ అధ్యక్ష కార్యదర్శులు పి సత్య రాజ్, పి మోహన్ రావు, సంజీవ రావు. మేడిద బాబురావు, మురికిపూడి దేవపాల్, గంగోలు శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.