8 ఏళ్ల మోదీ- కేసీఆర్ పాలనపై బహిరంగ చర్చకు సిద్దమా?

-ప్రపంచమే విస్తుపోయేలా మోదీ పాలన
-తెలంగాణను అప్పులపాల్జేసిన చరిత్ర కేసీఆర్ దే
-నీళ్లు-నిధులు-నియామకాలపై చర్చకు సిద్ధమా?
-ఏటా ఉద్యోగాలు భర్తీ చేస్తున్న ఘనత మోదీదే…
-8 ఏళ్లుగా ఒక్క ఉద్యోగమివ్వకుండా నిరుద్యోగులను గోసపుచ్చిన పాలన కేసీఆర్ దే
-కేసీఆర్ ఫాలనలో క్రిమినల్స్, రౌడీలు, గూండాలు రాజ్యమేలుతున్నారు
-బీజేపీకి అవకాశమిస్తే… గడీల పాలనలో బందీ అయిన తెలంగాణ తల్లిని బంధ విముక్తి చేస్తాం
– బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణలోనూ పేదల రాజ్యాన్ని తీసుకొస్తాం…
-8 ఏళ్ల మోదీ పాలనా విజయాలపై జరిగిన సదస్సులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ 8 ఏళ్ల పాలనపై…. రాష్ట్రంలో కేసీఆర్ 8 ఏళ్ల పాలనపై బహిరంగ చర్చకు బీజేపీ సిద్ధంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. ప్రపంచమంతా విస్తుపోయేలా పాలన కొనసాగిస్తున్న చరిత్ర నరేంద్రమోదీదైతే… ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాల్జేసిన ఘనత కేసీఆర్ దని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 8 ఏళ్ల ప్రజా సంక్షేమ పాలనపై బీజేపీ మేడ్చల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కూకుట్ పల్లిలో జరిగిన సదస్సుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు,ఎంపీ బండి సంజయ్ కుమార్ హాజరై ప్రసంగించారు. ఈ సదస్సులో జిల్లా అధ్యక్షులు హరీశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కూన శ్రీశైలం గౌడ్, రాష్ట్ర కోశాధికారి భండారు శాంతికుమార్, అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాశ్, రాష్ట్ర నాయకులు మల్లారెడ్డి, మీసాల చంద్రయ్య, సీనియర్ నాయకులు సూర్యారావు, సూర్యప్రకాశ్ రావు, రాజ్యలక్ష్మీ, మహేందర్, సునీత, దివాకర్, అరుణ్ కుమార్, నాగ పరిమళ, మహేశ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగ పూర్తి పాఠం వివరాలు….

• ప్రధానమంత్రి నరేంద్రమోదీ 8 ఏళ్ల పాలనలో జరిగిన అభివ్రుద్ది, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ సదస్సును ఏర్పాటు చేసుకున్నాం.

• బీజేపీ విలక్షణమైన పార్టీ. పార్టీ పుట్టినప్పటి నుండి అనేక అవమానాలను ఎదుర్కొంది. అవహేళనలకు గురైంది. మీ పార్టీకి ఉన్నది ఇద్దరు ఎంపీలు మాత్రమే. వాళ్లతో ఏమైతదని పార్లమెంట్ లోనే అవమానించారు. మతోన్మాద పార్టీ అన్నరు. దళిత, బీసీల వ్యతిరేక పార్టీ అన్నరు. ఇది గుజరాత్ మార్వాడీల పార్టీ అని నవ్వుకున్నరు. అగ్రవర్ణాల పార్టీ అన్నరు. విమర్శించిన కమ్యూనిస్టు పార్టీలు కనుమరుగైపోయినయ్. ఈ దేశమే మాది, మేం చెప్పిందే శాసనమని విర్రవీగిన కాంగ్రెస్ పార్టీ 440 ఎంపీ స్థానాలనుండి 44కు పడిపోయింది.

• బీజేపీకి ముస్లింలు, క్రిస్టియన్లు ఓటేయరని ప్రచారం చేశారు. బీజేపీ నాయకులను పిచ్చోళ్లను హేళన చేశారు. కానీ ఏమైంది? 2 ఎంపీ స్థానాలున్న బీజేపీ ఈ రోజు 303 ఎంపీలతో దేశాన్ని పాలిస్తోందనే విషయాన్ని కుహానా శక్తులు గుర్తుంచుకోవాలి. యూపీసహా 18 రాష్ట్రాల్లో అధికారంలోకి ఉంది. ఇదంతా శ్యామాప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలకు అనుగుణంగా వాజ్ పేయి, మోదీ గార్ల పాలనలో చేసిన అభివ్రుద్ధి, సంక్షేమ పథకాల ఫలాల పుణ్యమే. ఈరోజు మనం ఇట్లా ఉన్నామంటే… కేంద్రంలో అధికారంలో ఉన్నామంటే… ఎంతో మంది పార్టీ కోసం చేసిన త్యాగాల ఫలితమే.. కార్యకర్తల కష్టార్జితమే.

• మోదీగారు ప్రధాని కాకముందు దేశంలో పరిస్థితులెట్లా ఉండేవో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి… ఆనాడు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ అన్ని రంగాలను అవినీతి మయం చేసింది. ఏ శాఖలో చూసినా కుంభకోణాలే. ప్రపంచమంతా నివ్వేరపోయింది. భారత్ అంటేనే స్కాంల దేశమని హేళన చేశారు. పంచ భూతాలను కూడా అవినీతి మయం చేసిన చరిత్ర కాంగ్రెస్ ది. యూపీఏ పాలనలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను చూసి ఆనాడు భారత్ కు అప్పు ఇచ్చేందకు కూడా ప్రపంచంలో ఎవరూ ముందుకు రాని దుస్థితి. అంతెందుకు భారత సైనికుల తలలు నరికి చంపిన పాకిస్తాన్ తో శాంతి చర్చల పేరుతో కాలయాపన చేస్తూ ముస్లిం సంతూష్టికరణ విధానాలను అమలు చేస్తూ యావత్ హిందువుల మనోభావాలను అడుగడుగునా అవమానపర్చిన నీచ చరిత్ర కాంగ్రెస్ ది.

• కానీ నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక దేశ రూపురేఖలనే మార్చేశారు… మచ్చలేని నీతివంతమైన పాలన కొనసాగిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు 370 ఆర్టికల్ ను రద్దు చేసి జమ్మూకాశ్మీర్ పూర్తిగా భారత్ అంతర్భాగమేనని ప్రపంచానికి చాటి చెప్పారు. కాశ్మీర్ ఫైల్స్ చూశారు కదా… ఆ సినిమాలో చూపించింది ఒక్క శాతమే. అంతకుమించి దారుణ మారణ సంఘటనలు ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నయ్. బాంబులు పేల్చి, తల్వార్లతో పొడిచి చంపుతున్నారు. ఏక్ దేశ్ మే దో విధాన్… దో ప్రధాన్ నహీ చలేగా అంటూ 370 ఆర్టికల్ ను రద్దు చేసిన ఘనత బీజేపీదే….

• 80 శాతం హిందువులున్న దేశమైన భారత్ లో అయోధ్యలో రామ మందిరం కట్టుకోలేకపోయారంటూ ప్రపంచ దేశాల ప్రజలు అడుగుతుంటే తలదించుకునే పరిస్థితి ఆనాడు ఉంది. యూపీలో ములయాం సింగ్ పాలనలో కరసేవకుల శవాలు కుప్పలై తేలాయి. కరసేవకుల బలిదానాల స్పూర్తితో అయోధ్యలో భవ్యమైన దివ్యమైన అందాల అభినవ రామమందిరాన్ని నిర్మించి ప్రపంచంలో ఉన్న హిందువులంతా సగర్వంగా తలెత్తుకునేలా చేసిన ఘనత మోదీ గారిదే… ముస్లిం బాగోగులపై ప్రపంచమంతా సర్వే నిర్వహిస్తే ట్రిపుల్ తలాఖ్ వల్ల ముస్లిం మహిళల వ్యవస్థ నిర్వీర్యమైందని తేలడంతో ట్రిపుల్ తలాఖ్ ను రద్దు చేసి ముస్లిం మహిళల హక్కులను కాపాడిన గొప్ప నాయకుడు నరేంద్రమోదీ…

• ఇక అభివ్రుద్ధి విషయానికొస్తే… ఈ దేశంలో ఏ ఒక్కరూ ఇల్లు లేని వారు ఉండకూడదనే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పేరిట ఇల్లు నిర్మించే మహాయజ్ఝం నిర్వహిస్తున్న నాయకుడు మోదీజీ. దేశవ్యాప్తంగా 2.55 కోట్ల ఇళ్లు పూర్తి చేసి రికార్డు స్రుష్టించారు.

• మోదీజీ రాకముందు దేశంలో వేల గ్రామాలు ఇంకా కరెంట్ లేక చీకట్లో మగ్గుతుండే… ఆ బాధ చూడలేక ఒకే ఏడాది యుద్ద ప్రాతిపదికన 18 వేల గ్రామాలకు వెలుగులందించిన మహనీయుడు మన మోదీజీ. అందుకోసం హెలికాప్టర్లు, యుద్ద విమానాల్లో కరెంటు స్థంబాలను, విద్యుత్ ఫరికరాలను తరలించి యుద్ద ప్రాతిపదికన ఆయా గ్రామాలకు ప్రజలకు కరెంట్ అందించి వారి జీవితాల్లో వెలుగు నింపిన గొప్ప ప్రధాని మోదీజీ.

• మహిళల ఆత్మగౌరవాన్ని, వారి వంట బాధలను తీర్చేందుకు దేశంలో 9 కోట్ల కుటుంబాలకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లను ఉచితంగా అందించిన ఘనత మోదీజీకే చెల్లుతుంది. ఈరోజు తెలంగాణలో ప్రతి 5 కుటుంబాల్లో ఒక కుటుంబానికి ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ అందించి ఆడబిడ్డల వంటింటి బాధలను దూరం చేసిన మహనీయుడు…

• మోదీజీ రాకముందు దేశంలో కోట్లాది మంది ఇండ్లలో మరుగుదొడ్లు లేవు. చెంబు పట్టుకుని బయటకెళ్లాల్సిన దుస్థితి… మోదీ ప్రధాని అయ్యాక ఢిల్లీ ఎర్రకోటపై ప్రసంగిస్తూ టాయిలెట్ల నిర్మాణం గురించి మాట్లాడిన గొప్ప నాయకుడు… గత 8 ఏళ్లలో 11 కోట్లకు పైగా వ్యక్తిగత గృహ మరుగుదొడ్లు నిర్మించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన మహానాయకుడు మోదీజీ.. ఈరోజు తెలంగాణలోని ప్రతి పేద ఇంట మరుగుదొడ్డి ఉందంటే అది మోదీజీ చలువే.. మహిళా పక్షపాతి శ్రీ నరేంద్రమోదీజీ…

• మహిళలు ఆర్దికంగా నిలబడాలనే ఉద్దేశంతో 23 కోట్ల మంది మహిళల పేరిట జన్ ధన్ ఖాతాలను ప్రారంభించి ఆర్దికంగా చేయూతనందిస్తున్న నాయకుడు మోదీజీ. ఈరోజు ‘స్టాండ్ అప్ ఇండియా’ కింద సొంతంగా సంస్థలు స్థాపిస్తున్న వారిలో 81 శాతం మంది మహిళలే. కేంద్రం అందిస్తున్న ముద్రా యోజన లబ్ది దారుల్లో 68% పైగామహిళలే కావడం మోదీజీ మహిళా పక్షఫాతి అనేదానికి నిదర్శనం.

• కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంటే… భారత దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదని, ఏ రంగమూ దెబ్బతినకూడదనే గొప్ప ఆశయంతో 20 లక్షల కోట్లతో ఆత్మ నిర్బర భారత్ ప్యాకేజీని ప్రకటించి అమలు చేసిన మహానాయకుడు మోదీజీ…. అంత్యోదయ పేరుతో ఈ దేశంలో 80 కోట్ల మందికి ఆహార ధాన్యాలను అందిస్తున్న దేవుడు మోదీజీ.

• టీఆర్ఎస్ కు, కేసీఆర్ కు నేను సవాల్ చేస్తున్నా…. 8 ఏళ్ల మోదీ పాలనపై…. 8 ఏళ్ల నీ మూర్ఖపు పాలనపై చర్చకు సిద్ధమా? మేం సిద్ధంగా ఉన్నాం… దమ్ముంటే బహిరంగ చర్చకు రా…..

• ప్రధానమంత్రిని, కేంద్రాన్ని బదనాం చేయడమే పనిగా పెట్టుకుంటూ టైంపాస్ చేస్తున్నారే తప్ప పేదలకు ఏమాత్రం న్యాయం చేయని సీఎం కేసీఆర్… తెలంగాణ రాకముందు ఎట్లాంటి పరిస్థితులున్నయో 8 ఏళ్ల తరువాత కూడా రాష్ట్రంలో అవే పరిస్థితులున్నయ్. నమ్మి ఓటేస్తే కేసీఆర్ నిండా ముంచిండు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసి దివాళా తీయించిండు. పుట్టబోయే బిడ్డతోసహా ఒక్కొక్కరి తలపై లక్షా 20 వేల రూపాయల అప్పు చేసిండు. ఫీజు రీయంబర్స్ మెంట్ పథకం లేదు. కేంద్రం ఇండ్లు ఇస్తున్నా… వాటిని కట్టివ్వకుండా కేసీఆర్ పేదలను మోసం చేస్తున్నడు.

• కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, ఆస్తి పన్ను సహా అన్ని ఛార్జీలు పెంచి ఆదాయాన్ని దండుకుంటున్నా… ప్రభుత్వ ఉద్యోగులకు నేటికీ సక్రమంగా జీతాలు ఇవ్వలేని దుర్మార్గపు సీఎం కేసీఆర్ మాత్రమే. పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ పేరుతో ఏటా రూ.10 వేల కోట్ల ఆదాయం దండుకుంటున్నడు. మద్యం పేరుతో వేల కోట్లు సంపాదిస్తున్నడు. మద్యాన్ని తాగించి శాంతిభద్రతలు క్షీణింపజేస్తున్నరు. కేసీఆర్ పాలనలో రోజుకో అత్యాచారం వెలుగు చూస్తోంది.

• ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలపై అడ్డగోలుగా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నరు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని సదస్సు పెట్టిన పాపానికి జిట్టా బాలక్రిష్ణారెడ్డిని అర్ధరాత్రి అరెస్టు చేసి కేసీఆర్ పైశాచిక ఆనందం పొందుతున్నరు.

• కేసీఆర్ ప్రభుత్వం ఒక్కటి గుర్తుంచుకోవాలి… ఎన్ని కేసులు పెట్టినా… అరెస్టు చేసినా బీజేపీని ఏమీ చేయలేవు. నీ పాలనను అంతమొందించేదాకా ఉద్యమిస్తూనే ఉంటాం.. ఇక్కడ రైతులను నిలువునా ముంచిన ఘనత కేసీఆర్ దే.. రైతు బంధు తప్ప అన్నీ సబ్సిడీల బంద్ చేసిన దుర్మార్గుడు కేసీఆర్.. ఇంకా సిగ్గు లేకుండా దేశాన్ని ఉద్దరిస్తాడట…

• జీతాలకు పైసల్లేవు… రైతు బంధు ఇవ్వడానికి పైసల్లేవు.. పెన్షన్లు ఇవ్వడానికి పైసల్లేవ్.. కానీ ప్రజలు కడుతున్న పన్నులను సొంత పబ్లిసిటీ పేరుతో దేశమంతా పత్రికలకు ప్రకటనలిచ్చి వందల కోట్లు ఖర్చు చేస్తుండు..

• ప్రజలు పన్నుల పేరుతో కడుతున్న ఆదాయాన్ని ఏం చేస్తున్నారో కేసీఆర్ సమాధానం చెప్పాలి. గత మూడేళ్లలో 5 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపుతున్న ఘనత కేసీఆర్ దే. ఇంత చేసినా ఆర్టీసీ కార్మికులకు జీతాలివ్వడం లేదు. 2 పీఆర్సీలు, 5 డీఏలు ఇవ్వకుండా కార్మికులను ఇబ్బంది పెడుతున్నడు. ఆర్టీసీ ఆస్తులను అమ్మేసి ప్రైవేటుపరం చేసే కుట్ర చేస్తున్నడు…

• బీజేపీ అన్ని వర్గాల ప్రజలు, అన్ని ప్రాంతాలు అభివ్రుద్ది కావాలని కోరుకుంటున్న ఏకైక పార్టీ బీజేపీ. పాతబస్తీ కూడా అభివ్రుద్ధి కావాలని కోరుతున్న పార్టీ బీజేపీ… పాతబస్తీ ప్రజలారా… అభివ్రుద్ధి కావాలా? మజ్లిస్ రాజకీయాలు కావాలా?.. ఒక్కసారి ఆలోచించాలి. బీజేపీ ఏనాడూ అల్లాను కించపర్చలే… నా రాముడిని అవమానించిన వాడిని, 15 నిమిషాలు టైమిస్తే హిందువులను నరికి చంపుతామన్న మూర్ఖుడికి శిక్ష వేయించడంలో ఆధారాలు చూపకుండా కాపాడిన మూర్ఖుడు కేసీఆర్…

• ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కొమ్ముకాసే పార్టీ ఎంఐఎం. అధికార పార్టీ మోచేతి నీళ్లు తాగే ఎంఐఎం నేతలారా… ఇన్నేళ్లయినా పాతబస్తీలో డ్రైనేజీ ఇంకా ఎందుకు పొంగి పొర్లుతోంది? ఎందుకు పాతబస్తీ అభివ్రుద్ది కావడం లేదు? ప్రజలు ఆలోచించాలి. లుంబిని పార్కు, సాయిబాబా గుడిలో, గోకుల్ ఛాట్ లో బాంబులు పెట్టిందెవరో ప్రజలకు తెలుసు. ముస్లిం ప్రజలు కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు. తెలంగాణలో బీజేపీకి మద్దతు పలికి అధికారంలోకి తీసుకురావాలని ముస్లిం సమాజం ఆలోచిస్తున్న తరుణంలో కాంగ్రెస్, టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు కలిసి బీజేపీని బదనాం చేసే కుట్రకు తెరలేపాయి.

• జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే బీజేపీ ఉద్యమించే వరకు కేసు నమోదు చేయలేదు. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలెవరూ స్పందించలేదు. పోలీసులు పట్టించుకోలేదు. బీజేపీ ఉద్యమించకపోతే రేప్ చేసిన వాళ్లు హిందువులేనని కుట్ర చేసేందుకు టీఆర్ఎస్ ఫ్రభుత్వం యత్నించేది. పాతబస్తీలో అత్యాచారం, హత్యలు జరిగితే పట్టించుకోరు. సరూర్ నగర్ లో నాగరాజును నడిరోడ్డుపై నరికి చంపితే పట్టించుకోరు.. మంథనిలో వామన్ రావు, ఖమ్మంలో వనమా రాఘవేందర్ వేధింపులు భరించలేక రామక్రిష్ణ కుటుంబం, ఖమ్మంలో పోలీసులు, టీఆర్ఎస్ వేధింపులు తాళలేక బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహథ్య చేసుకున్నరు. నిన్నగాక మొన్న కార్ఖానాలో అత్యాచారం జరిపింది టీఆర్ఎస్ నేతలే.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినా… సీఎం కేసీఆర్ మాత్రం క్రిమినల్స్ ను పెంచి పోషిస్తున్నరు. ఫాంహౌజ్ నుండి బయటకు రావడం లేదు. కేసీఆర్ ఫాంహౌజ్ లో పడుకోవడానికేనా… కేసీఆర్ కుటుంబానికి అధికారం అప్పగించడానికేనా తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది. రైతులు అల్లాడుతున్నరు. మహిళలు కనీసం రోడ్లపై తిరగలేని పరిస్థితి. నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వడం లేదు… కార్మికులు, ఉద్యోగులకు జీతాలివ్వడం లేదు… వ్రుద్దులకు పెన్షన్లు ఇవ్వడం లేదు… కేసీఆర్ పాలనలో అగ్రవర్ణాలూ బాధపడుతున్నయ్. చివరకు వెలమ సామాజికవర్గం కేసీఆర్ ఫాలనలో ఇబ్బంది పడుతున్నారు.

• ఇంకా సిగ్గు లేకుండా కేంద్రం 16 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం లేదంటూ తప్పుదోవ పట్టించే కుట్ర చేస్తున్నారు.. కేంద్రం ఏటా యూపీఎస్సీ ద్వారా, ఎస్సెస్సీ (స్టాఫ్ సెలక్షన్ కమిషన్) ద్వారా, ఎన్డీఏ (నేషనల్ డిఫెన్స్ అకాడమీ), బీఎస్ఆర్బీ (బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్ మెంట్ బోర్డు), ఆర్ఆర్ బి (రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు) ద్వారా ప్రతి ఏటా ఖాళీ అయ్యే ఉద్యోగాలను భర్తీ చేస్తూనే ఉన్నరు.

• రాష్ట్రంలో ఏ సంస్థ నిర్వహించినా టీఆర్ఎస్ పనైపోయిందని నివేదికలొస్తున్నాయి. కేసీఆర్ పనైపోయిందని చెబుతున్నాయి. తెలంగాణలో పేదోళ్లు బాగుపడాలంటే… కేంద్ర పథకాలు రాష్ట్రానికి అందాలంటే… రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వం రావాల్సిందేనంటూ తెలంగాణ సమాజం ఆలోచిస్తున్నారు. ఈ తరుణంలో బీజేపీ కార్యకర్తలంతా కష్టపడి ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది.

• కేంద్రం నిధులిస్తే కేసీఆర్ దారి మళ్లిస్తుండు.. అనేక అభివ్రుద్ధి, సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేయాలని ప్రధాని భావిస్తుంటే కేసీఆర్ అడ్డుకుంటున్నడు. పేరు ప్రఖ్యాతుల కోసం తపిస్తున్నాడే తప్ప పేదలను పట్టించుకోవడం లేదు. కేంద్రం సహకరించేందుకు సిద్ధంగా ఉన్నా… కేసీఆర్ మాత్రం సహకరించడం లేదు.

• యూపీలో కఠిన నిర్ణయాలు తీసుకోవడంవల్లే యోగి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చింది. శాంతి భద్రతలు ఫరిఢవిల్లుతున్నాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కబ్జాకోరులు, గూండాలు, క్రిమినల్స్ రాజ్యమేలుతున్నరు. వీళ్లను కూకటి వేళ్లతో పెకిలించి వేయాలంటే బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నా… అందరికీ అవకాశం ఇచ్చారు… బీజేపీకి అవకాశమిస్తే కేసీఆర్ కుటుంబ పాలనను తరిమి తరిమి కొడతాం… కల్వకుంట్ల రాజ్యాంగాన్ని పాతరేస్తాం… బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసి గడీల్లో బందీ అయిన తెలంగాణ తల్లిని బంధ విముక్తి చేస్తాం… తెలంగాణ ప్రజలను దోచుకుంటున్న కేసీఆర్ పాలనను తెలంగాణ ఉద్యమకారులంతా బరిశెలందుకుని తరిమితరిమి కొట్టే రోజులు ముందుకు రాబోతున్నాయ్…

Leave a Reply