మన రైతులపైకి ‘బండి’ వర్గం దాడి

ఈ వానకాలం దాదాపు 62 లక్షల ఎకరాల్లో వరిపంట సాగైంది.. కోటి టన్నుల ధాన్యం వస్తుందని అంచనా. వరి కోతలే ఇంకా పూర్తికాలేదు. ఇరవైశాతం ధాన్యం కూడా మార్కెట్లకు రాలేదు.
కోటి టన్నుల ధాన్యం వస్తుందని అంచనా. వరి కోతలే ఇంకా పూర్తికాలేదు. ఇరవైశాతం ధాన్యం కూడా మార్కెట్లకు రాలేదు. వచ్చినదాంట్లో 8 లక్షల టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొనుగోలు చేసింది. గత ఐదారు సీజన్లలో కొన్నట్టే ఈసారి కూడా కొనుగోలు ప్రక్రియ ప్రశాంతంగా, సాఫీగా, పద్ధతి ప్రకారం సాగుతూ ఉన్నది. వానకాలం ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో సంజయ్‌ యాత్ర మొదలుపెట్టారు.
వానకాలం పంట మొత్తాన్నీ కొంటామని ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు ఇప్పటికే పదేపదే ప్రకటించారు. ఇక సంజయ్‌ డిమాండ్‌లో అర్థమేముంది? యాసంగిలో వరి వేయవద్దని, వేస్తే ఆ ధాన్యాన్ని తాము తీసుకోబోమని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో భాగంగా తొండి


సంజయ్‌ ఈ కొత్త నాటకానికి తెరతీశారు. ఇప్పటికే కొనుగోళ్లు జరుగుతున్న ధాన్యం కేంద్రాల దగ్గరకు వెళ్లి ధాన్యం కొనాలంటూ డిమాండ్‌ చేయడంలోనే సంజయ్‌ తెలివి తెల్లారింది.
డ్రామాను రక్తికట్టించడంలో భాగంగా ఆయన అనుచర గణం వడ్ల కుప్పలపై బూటు కాళ్లతో విచ్చలవిడిగా వీరంగం వేసింది. రైతు మహిళలు ఏడుస్తూ వేడుకున్నా పట్టించుకోకుండా రాసుల్ని ఆగమాగం చేసింది. రాసులపైకి ఎక్కొద్దని బతిమాలితే దాదాగిరి .నిలదీస్తే రాళ్ల వర్షం. అదే మూర్ఖత్వం.. అదే బాధ్యతారాహిత్యం.. అదే దుందుడుకుతనం. దేశరాజధాని ఢిల్లీలో సంవత్సర కాలంగా రైతులపట్ల ఏం జరుగుతున్నదో, అదే అరాచకం ఇవాళ తెలంగాణ రైతుల పట్ల జరిగింది. అయితే బీజేపీ ఆటలు సాగడానికి ఇది ఉత్తరాది కాదు; పోరుగడ్డ తెలంగాణ.
ఉదయం నుంచి రాత్రి దాకా నల్లగొండ జిల్లా పొలిమేరల నుంచి నిన్ను తరిమికొట్టిన రైతన్నే అందుకు సాక్ష్యం. రైతుయాత్ర పేరుతో బయల్దేరిన సంజయ్‌ రైతులను పలకరించింది కేవలం తొమ్మిదంటే తొమ్మిది నిమిషాలు. యాసంగి ధాన్యం కొనుగోలుపై ప్రశ్నించగానే పొలోమని పరారు. హైదరబాద్‌ నుంచి అరువు తెచ్చుకున్న మీడియా గొట్టాలు ముందుపెట్టుకుని అరగంట ఊకదంపుడు ఉపన్యాసం!
కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాదిగా ఢిల్లీ రోడ్లపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వారి టెంట్లు పీకేయించింది. ఎర్రకోట సాక్షిగా రైతులపై లాఠీచార్జీలు చేసింది.బీజేపీ కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కొడుకు.. ఉత్తరప్రదేశ్‌లో ఆందోళన చేస్తున్న రైతులపైకి కారు తోలించి, తుపాకీతో కాల్చి నలుగురిని దారుణంగా చంపేశాడు.
హర్యానాలో బీజేపీ సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌..
రైతులను కర్రలతో కొట్టి భయపెట్టాలని తన కార్యకర్తలకు పిలుపునిచ్చాడు. ఇలా చేసి జైలుకెళ్లినా తప్పులేదని, మిమ్మల్ని వీరులుగా గుర్తిస్తామని రెచ్చగొట్టాడు.
ఇదంతా చూస్తున్న తెలంగాణ రైతన్న.. బీజేపీ మూకలు తమపైకి ఎక్కడ తెగబడతాయోనని అనుమానిస్తూనే ఉన్నాడు. యాసంగిలోనూ వరే వేయండని బీజేపీ నేత బండి సంజయ్‌ రెచ్చగొట్టినప్పటి నుంచే, ఇదేదో తమ కొంపముంచే ఎత్తుగడ అని ఆందోళన చెందుతూనే ఉన్నాడు.
అనుకున్నదే అయింది. అనుకున్నంతా జరిగింది. మండీలు (మార్కెట్‌యార్డులు)
ఎత్తివేయొద్దంటూ ఉత్తరాది రైతులు నిరసన తెలియజేస్తుంటే పట్టించుకోని బీజేపీ నేతలు, తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మార్కెట్‌యార్డు (ధాన్యం కొనుగోలు కేంద్రాలు)ల్లోకి ప్రవేశించి భయోత్పాతం సృష్టించారు.
ఓట్ల కోసం బీజేపీ నేతలు రాష్ర్టాన్ని రణరంగంగా మార్చివేశారు. ధాన్యం కొనలేని తమ కేంద్ర ప్రభుత్వ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు మన రైతుల రక్తం కండ్లజూశారు. వ్యవసాయాన్ని ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం నల్ల చట్టాలతో కుట్రపన్నినట్టుగానే, రైతు యాత్ర ముసుగులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలంగాణ రైతులపై ఏకంగా యుద్ధ ప్రకటనే చేశారు.
యాత్ర పేరుతో సోమవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన సంజయ్‌కి రైతులు నిరసన తెలిపారు.
తెలంగాణలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనేలా కేంద్రంతో ప్రకటన చేయించాలని, అప్పటిదాకా తమ వద్దకు రావద్దని నల్లజెండాలతో నిరసన వ్యక్తంచేశారు. బండి సంజయ్‌ గోబ్యాక్‌ అని నినదించారు. దీంతో రెచ్చిపోయిన సంజయ్‌ మూక, గుత్పలు తీసుకుని రైతులపై దాడికి తెగబడింది. కార్లల్లో బస్తాల్లో నింపుకొని వచ్చిన కంకరరాళ్లను విచ్చలవిడిగా రైతులపైకి విసురుతూ బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా బండి యాత్ర బందిపోటు యాత్రగా సాగింది.
జవాబు చెప్పు తొండి సంజయ్‌
పోయిన యాసంగిలో కేంద్రం తీసుకోకుండావదిలేసిన 5 లక్షల టన్నుల ధాన్యం ఎప్పుడు కొనిపిస్తవు?
ఈ వానకాలం రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి కొన్న మొత్తం వడ్లను కేంద్రం తీసుకునేలా చేస్తవా? లేదా?
వచ్చే యాసంగిలో రాష్ట్రంలో పండే ప్రతి గింజనూ కొంటామని కేంద్రంతో ప్రకటన చేయిస్తవా? లేదా?
కేంద్రం పంజాబ్‌లో ధాన్యం మొత్తం ఎందుకు కొంటుంది? తెలంగాణలో ఎందుకు కొనదు?
తెలంగాణ ఈ దేశంలో ఉందా? లేదా? ఉత్తరాదికి, ఒక నీతి? దక్షిణాదికి మరో నీతా?
కేంద్రం వద్దన్నా వరి మాత్రమే పండించాలని రైతులను తప్పుదోవ పట్టించినందుకు క్షమాపణ చెప్తవా? లేదా?
బీజేపీ కండువాలతో వచ్చి గుత్పలతో కొట్టినవారు గూండాలా? లేక ధాన్యంతో మార్కెట్‌కు వచ్చిన రైతులా?
రైతుల రూపంలో గూండాలు దాడిచేశారంటున్న సంజయ్‌.. రైతులు నీ దగ్గరకు వచ్చారా? నువ్వు అక్కడికి పోయావా?
గత ఐదారు సీజన్లలోనూ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ధాన్యం కొని, రెండు మూడు రోజుల్లోనే రైతుల
ఖాతాల్లో పైసలు వేయలేదా? ఇప్పుడు నీ సమస్యేమిటి?

– మహ్మద్ ఖలీల్ షా