Suryaa.co.in

Telangana

విమోచన గళాన్ని విన్పించిన బీజేపీ కార్పొరేటర్లకు బండి సంజయ్ అభినందన

– గిరిజనులకు ఇచ్చిన హామీలను విస్మరించిన దుర్మార్గుడు కేసీఆర్
– గిరిజన మహిళ రాష్ట్రపతి కాకుండా అడ్డుకున్న కేసీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలి

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో ‘జాతీయ సమైక్యత దినోత్సవం’ పేరుతో తెలంగాణ స్వాతంత్ర్య సమర యోధులకు నివాళులర్పించాలని పాలక మండలి చేసిన కుట్రను సమర్ధవంతంగా అడ్డుకుంటూ తెలంగాణ విమోచన దినోత్సవ గళాన్ని విన్పించిన బీజేపీ కార్పోరేటర్లను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అభినందించారు.

‘‘జీహెచ్ఎంసీ వేదికగా విమోచన గళాన్ని, గిరిజన గళాన్ని విన్పించిన కార్పొరేటర్లకు అభినందనలు. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో సర్కార్ తీరును ఎండగట్టిన తీరు భేష్’’అని పేర్కొన్నారు. ‘‘8 ఏళ్లుగా పోడు భూములకు పట్టాలివ్వకుండా, 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా గిరిజనులను ఇన్నాళ్లు మోసం చేసిన దుర్మార్గుడు కేసీఆర్. గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ గారిని రాష్ట్రపతి కాకుండా కాంగ్రెస్ తో కలిసి కుట్ర చేసిన కేసీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు.

 

LEAVE A RESPONSE