మానవ హక్కులను కాలరాస్తోందే మీ అయ్య..

-అత్యాచారాలు, హత్యలు, దోపిడీ జరుగుతుంటే మీ కళ్లలో నుండి నిప్పులెందుకు రాలే…
-కనీసం బాధితులను పరామర్శించాలనే సోయి ఎందుకు రాలే
-నిన్ను అరెస్ట్ చేస్తారనే సరికి… మహిళలంతా కన్నీళ్లు… నిప్పులు కురిపించాలా?
-నా వ్యాఖ్యలు బాధిస్తే అయ్యను పట్టుకుని ఏడవమనండి
-మానవత్వం లేని మానవ మ్రుగం కేసీఆర్
-ఇంటికో ఉద్యోగం, పెన్షన్, ఆర్దిక సాయం చేస్తానన్న హామీలేమైనయ్? క్షతగాత్రులకు నేటికీ అందని వైద్య, ఆర్దిక సాయం
-ఈ పేదలంతా చేసిన పాపమేంది? బస్సులో ప్రయాణించడమే వీళ్లు చేసిన పాపమా?
-నేటి వరకు కనీసం మ్రుతుల కుటుంబాలను పరామర్శించని సీఎం
-సాయం కోసం వెళితే అరెస్ట్ చేసి జైలుకు పంపుతారా?
-గోడ కట్టడం తప్ప కొండగట్టు వద్ద ప్రమాదాలు జరగకుండా తీసుకున్న చర్యలు శూన్యం
-కొండగట్టు బాధితులను పూర్తిస్థాయిలో ఆదుకుంటే కేసీఆర్ కు పాలాభిషేకం చేస్తాం
-బీజేపీ అధికారంలోకి రాగానే కొండగట్టు బాధిత కుటుంబాలను ఆదుకుంటాం
-5న జరిగే ప్రజా సంగ్రామ యాత్ర-5 ముగింపు సభను సక్సెస్ చేయాలని పిలుపు
-కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగిన బండి సంజయ్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో మానవ హక్కులను హరించి వేస్తోందంటూ కేసీఆర్ బిడ్డ, ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘‘మానవ హక్కుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. మానవ హక్కులను హరించి వేస్తోందే మీ అయ్య. ప్రశ్నించే వాళ్లే ఉండకూడదని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ ను ఎత్తేసిండు. ప్రశ్నించే వాళ్లపై కేసులు పెట్టి జైల్లో వేస్తున్నరు. నిజాలు రాసే మీడియాను తొక్కివేస్తున్నడు. పేదల జాగలను, ప్రభుత్వ కబ్జాలను మీ కుటుంబం, టీఆర్ఎస్ నేతలు కబ్జా చేస్తున్నరు. ప్రశ్నించే కవులు, కళాకారులు, మేధావులను బెదిరిస్తున్నరు. బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ రాజ్యాంగాన్నే తిరగరాస్తానన్నడు… మానవ హక్కులంటే ఇవేనా?’’అని ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబం చేస్తున్న అరాచకాలకు, అవినీతికి జేజేలు కొడితేనే మానవ హక్కులున్నట్లా? అంటూ ఎద్దేవా చేశారు. మీడియాను బీజేపీ అణిచివేస్తోందంటూ కేసీఆర్ బిడ్డ చేసిన వ్యాఖ్యలపైనా మండిపడ్డారు. ‘‘కేసీఆర్ సీఎం కాగానే కొన్ని టీవీ ఛానళ్లను బ్యాన్ చేసిందెవరు? మీడియాను పాతాళానికి తొక్కేస్తానని బెదిరిస్తున్నదెవరు? సీఎం హోదాలో ప్రెస్ మీట్ పెడితే ఒక్క విలేకరిని కూడా ప్రశ్నించకుండా దబాయిస్తున్నదెవరు? యాడ్స్ తో, డబ్బులతో పబ్లిసిటీ చేసుకుంటూ మీడియాను మేనేజ్ చేస్తోందెవరు?’’అంటూ మండిపడ్డారు.

బండి సంజయ్ వ్యాఖ్యలు బాధిస్తున్నాయంటూ కేసీఆర్ బిడ్డ చెప్పడంపైనా తనదైన రీతిలో స్పందించారు. ‘‘నా వ్యాఖ్యలు బాధిస్తే అయ్య కాడికి పోయి ఏడవమను’’ అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ మహిళల కళ్లల్లో నుండి నిప్పులు కురవాలంటూ చేసిన వ్యాఖ్యలపైనా స్పందించారు. ‘‘హైదరాబాద్ సహా రాష్ట్రమంతటా హత్యలు, అత్యాచారాలు, భూకబ్జాలు జరుగుతుంటే మీ కళ్ల నుండి నిప్పులెందుకు రాలే. పోడుభూములకు పట్టాలివ్వాలని అడిగిన పాపానికి బాలింతలపై రాక్షసంగా వ్యవహరించి జైలుకు పంపినప్పుడెందుకు నిప్పులు కురవలే. లక్ష కోట్ల దొంగ సారా కేసులో నిన్ను అరెస్ట్ చేస్తారనే సరికి తెలంగాణ మహిళలంతా నిప్పులు కురిపించాలా?’’అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానవత్వం లేని మానవ మ్రుగమని ధ్వజమెత్తారు. కొండగట్టు బస్సు ప్రమాద మ్రుతుల కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం, పెన్షన్ ఇవ్వడంతోపాటు పూర్తి స్థాయిలో ఆదుకుంటామని ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదన్నారు. క్షతగాత్రులకు నేటికీ అందని వైద్య, ఆర్దిక సాయం కూడా అందలేదన్నారు.

‘‘ఈ పేదలంతా చేసిన పాపమేంది? బస్సులో ప్రయాణించడమే వీళ్లు చేసిన పాపమా? నేటివరకు కనీసం మ్రుతుల కుటుంబాలను పరామర్శించని సీఎం సాయం కోసం వెళళ్లిన అరెస్ట్ చేసి జైలుకు పంపుతారా?’’అంటూ ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి రాగానే కొండగట్టు బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈనెల 15న కరీంనగర్ లో జరిగే ప్రజా సంగ్రామ యాత్ర-5 ముగింపు సభకు ప్రజలంతా స్వచ్ఛందంగా తరలివచ్చి దిగ్విజయవంతం చేయాలని కోరారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ 4 ఏళ్ల క్రితం కొండగట్టు ఘాట్ రోడ్డు వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మ్రుతుల కుటుంబాలను కలిశారు. తమకే సాయం అందలేదంటూ ఆయా కుటుంబాలు పడుతున్న కష్టాలు విన్నారు. మ్రుతుల కుటుంబాలకు నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు… అందులోని ముఖ్యాంశాలు…

4 సంవత్సరాల క్రితం కొండగట్టులో ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగింది.బస్సులో ప్రయాణిస్తున్న పేద ప్రయాణికులు మరణించారు.ఈ ఘటనలో 68 మంది నిరుపేద ప్రయాణికులు మృత్యువాత పడ్డారు.బస్సు ప్రమాద కుటుంబాలను కేసీఆర్ ప్రభుత్వం కనీసం పరామర్శించలేదు, పట్టించుకోలేదు.పోస్ట్ మార్ట్ కోసం తీసుకెళ్లాల్సిన మృతదేహాలకు… కనీసం కేసీఆర్ సర్కార్ చాపలు కూడా కొని ఇవ్వని పరిస్థితి.హాస్పిటల్ లో క్షతగాత్రులకు డబ్బులు కూడా కట్టని దుర్మార్గపు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం.ఈ ప్రమాదంలో ఇప్పటికీ 20 మంది క్షతగాత్రులు వైద్యం తీసుకుంటున్నారు.

ప్రమాద బాధిత కుటుంబాలను నేటికీ కేసీఆర్ ఆదుకోలేదు.దేశవ్యాప్తంగా చర్చ జరిగినా… ఈ ఘనలో కేసీఆర్ స్పందించలేదు.కేసీఆర్ కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించలేదు.ప్రమాదం జరిగినచోట ఒక గోడ మాత్రమే కట్టించారు.క్షతగాత్రుల్లో కొందరికి స్పర్శ కూడా లేదు.గతంలో ఒక మంత్రి వచ్చిండు… మంత్రికి బాధలు చెప్పుకుందామని బాధిత కుటుంబాలు వెళ్తే… అరెస్ట్ చేసి, వారిపై కేసులు పెట్టారు.జగిత్యాల సభలో కనీసం కేసీఆర్ కొండగట్టు బాధితుల గురించి కూడా తలుచుకోలేదు.ఇంత పెద్ద ప్రమాదం జరిగినా.. కేసీఆర్ కు సోయలేదు.కొండగట్టు బాధితులు ధర్నా చేస్తే వారిపై కేసులు పెట్టాల్నా?కొండగట్టు బాధితులు ఏమైనా ఉగ్రవాదులా…? తీవ్ర వాదులాఇప్పటికీ కనీసం వాళ్లకు exgratia కూడా ఇవ్వలేదు.బాధితులను ఆదుకోని కేసీఆర్… కొండగట్టు కు రూ.100 కోట్లు ఇస్తాడా?

పంజాబ్ లో రైతులు చనిపోతే… చెక్కులు ఇచ్చిన కేసీఆర్, కొండగట్టు బాధితులను ఎందుకు ఆదుకోవడం లేదు?మానవత్వం లేని మానవ మృగం కేసీఆర్.పేదోళ్ల పాపం, ఉసురు ఉత్తినే పోదు… కేసీఆర్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది.చిన్న పిల్లలు, ముసలోళ్లు, గర్భిణీ కూడా ఈ ప్రమాదంలో చనిపోయింది.కేసీఆర్ వి అన్నీ ఝూటా మాటలే.ఇక్కడి ప్రాజెక్టులను పట్టించుకోడు… ఆందోళనను అస్సలే చూడడు.పేదోళ్ళు ఏమైనా కూడా… కేసీఆర్ పట్టించుకోడు.కేసీఆర్ కొండగట్టు బాధితులను అదుకుంటే… ఇక్కడే కేసీఆర్ కు పెద్ద విగ్రహం కట్టించి, పాలాభిషేకం చేస్తాం.జగిత్యాల వచ్చిన కేసీఆర్, కొండగట్టు బాధితులను పట్టించుకోలేదని ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి.

కేసీఆర్ ప్రభుత్వం వెంటిలేటర్ పై ఉంది.ఉఫ్ అంటే ఊడిపోతుంది.68 మంది కుటుంబాలను ఆదుకుంటాం.క్షతగాత్రులకు వైద్యం ఖర్చులను భరిస్తాం.తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే… కొండగట్టు బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఉద్యోగంతో పాటు… క్షతగాత్రులను ఆదుకుంటాం..’జీవన్ జ్యోతి బీమా’ పేరు మీద 13 మంది బాధిత కుటుంబాలకు ఇన్సూరెన్స్ వచ్చేలా ప్రయత్నం చేశాం.కొండగట్టు ప్రమాదంలో ఇంతమంది చనిపోతే… కవిత కండ్ల లో నుంచి నిప్పులు ఎందుకు రాలేదు?

మానవ హక్కుల గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కుటుంబానికి లేదు.రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం మానవ హక్కులా?అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చుతా అన్నోడు మానవ హక్కుల గురించి మాట్లాడడమా?ఇవాళ మీడియా ని బెదిరిస్తున్నది ఎవరు?మీడియా ని పాతాళం లోకి తొక్కేస్తా అన్నోడు ఎవరు?ఇక్కడ పీకిండు…ఇక అక్కడ పీకుతాడు.యూపీ లో వారణాసి వెళ్లి, బీజేపీ ని ఓడగొట్టాలని చూసాడు.. అక్కడ ఫ్లెక్సీలు పెట్టించుకున్నాడు. అక్కడ ఏమైందో మీరే చూశారు.ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ గాళ్లను తీసుకొచ్చి కేసీఆర్ పీకేది ఏముంటుంది?

ఈనెల 15న కరీంనగర్ SRR కాలేజ్ గ్రౌండ్స్ లో 5వ విడత పాదయాత్ర ముగింపు సభ.ముఖ్య అతిధిగా జేపీ నడ్డా వస్తున్నారు.బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా ప్రజలను కోరుతున్నా.మేము చట్టాలను గౌరవించే వ్యక్తులం… అన్ని అనుమతులకు లోబడే బహిరంగ సభ నిర్వహిస్తాం.

Leave a Reply