-నారాయణపేట జిల్లా, ధన్వాడ మండలం, రామకిష్టయ్యపల్లి గ్రామంలో దివ్యాంగులతో ‘బండి సంజయ్’ సమావేశం
-తెలంగాణ బీజేపీ రథసారథికి తమ సమస్యలు చెప్పుకున్న దివ్యాంగులు
-ఆసరా పెన్షన్ ల పేరుతో వికలాంగులకు( దివ్యాంగులకు ) కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని బండి సంజయ్ కి చెప్పిన దివ్యాంగులు
రాష్ట్రంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పేరుతో 14 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారు.ప్రతి నెల 29వ తారీకు వస్తే గాని పెన్షన్ అందని దుస్థితి రాష్ట్రంలో నెలకొంది.ఒకటవ తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్లను… 29వ తారీఖున ఇస్తున్న పరిస్థితి ఉంది.కొత్తగా పెన్షన్ల కోసం అప్లై చేసుకున్న 6 లక్షల మందిని అలానే పెండింగ్లో పెట్టి ఉంచారు.2018 తర్వాత ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు.పాదయాత్ర ద్వారా ప్రభుత్వం కళ్లు తెరిపించాలని సంజయ్ ని కోరిన దివ్యాంగులు.వికలాంగులకు ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తే…స్వయం ఉపాధితో పైకి వస్తామని కోరుకుంటున్నాం.దివ్యాంగుల సమస్యలను విన్న అనంతరం ప్రసంగించిన బండి సంజయ్…
మీరు గతంలో మా పాదయాత్రలో పాల్గొన్నారు. సంఘీభావం ప్రకటించారు.మీ సమస్యలపై పోరాడే అవకాశం మాకు వచ్చినందుకు సంతోషంగా ఉంది.తప్పకుండా మీకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నా.దేవుడు కరుణించినా… పూజారి ప్రసాదం పెట్టనట్టుగా ఉంది కేసీఆర్ వ్యవహార శైలి.కేసీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.పాదయాత్రలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు సమస్యలే చెప్పుకుంటున్నారు.కేసీఆర్ కనిపిస్తే ప్రజలు కొరికి చంపేలా ఉన్నారు.దివ్యాంగుల సమస్యలపై నాకు సంపూర్ణ అవగాహన ఉంది.
దివ్యాంగుల కోసం ఏబీవీపీ లో ఉన్నప్పటి నుంచే పోరాటం చేశాను.వికలాంగుల సంక్షేమ సంఘం అన్నది స్టార్ట్ చేసింది నేనే.నేను లీడర్ కావడానికి కారణం దివ్యాంగులే.వికలాంగులు అంటే ఒక రకంగా చూస్తారని.. నరేంద్ర మోదీ దివ్యాంగులు అని పేరు పెట్టారు.దివ్యాంగుల కోసం మోదీ 3 శాతం ఉన్న రిజర్వేషన్లను… 4 శాతానికి పెంచాడు.పేదోడు పేదోడే… అది అగ్ర కులమైనా… ఏ కులమైనా .పేదరికం ఉండొద్దు అన్నదే మోదీ ఆలోచన.అంబేద్కర్ స్ఫూర్తితో, ఆయన రచించిన రాజ్యాంగాన్ని అనుసరించే మోదీ పాలన కొనసాగిస్తున్నారు.మోదీ తీసుకొచ్చిన ఈ డబ్ల్యూ ఎస్ కోతాను కూడా కేసీఆర్ అమలు చేయడం లేదు.దివ్యాంగులకు న్యాయం చేయాలని కేసీఆర్ కు ఉండదు.కేసీఆర్ కు పేరు కావాలి, ప్రతిష్ట, పైసలు కావాలి… ఓట్లు దండుకోవాలి, సీట్లు అమ్ముకోవాలి, కొనుక్కోవాలి.నాకు ఫోటోలు, పేరు అవసరం లేదు… సమస్యలను పరిష్కరించడమే నా ముఖ్య ఉద్దేశం.తెలంగాణకు మోదీ మంజూరు చేసిన 1.40వేల ఇండ్లను కూడా ఈ ప్రభుత్వం నిర్మించలేదు.దివ్యాంగులను గుర్తించి, కనీసం దివ్యాంగులకైనా ఇండ్లు మంజూరు చేయొచ్చు కదా?
రాష్ట్రంలో దివ్యాంగులు ఎంతమంది ఉన్నారో కేసీఆర్ గుర్తించాలని మీరు డిమాండ్ చేయండి.రాష్ట్రంలో ఎంత మంది దివ్యాంగులు ఉంటే… అంత మందికి కేంద్రం నుంచి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇప్పించే బాధ్యత నాది.కేంద్రం మంజూరు చేసిన ఇండ్లు ఎన్ని కట్టించావో లెక్క చెప్పమని కేసీఆర్ కు నరేంద్ర సింగ్ తోమర్ లేఖ రాశారు.మూడుసార్లు లేఖలు రాసినా…. కట్టించిన ఇండ్ల లిస్టు మాత్రం ఇవ్వలేదు.యూపీలో యోగి 30 లక్షల ఇండ్లు కట్టించాడు…అందుకే మళ్లీ విజయడంకా మోగించాడు.మహబూబ్ నగర్ లో ఈనెల 5న జరిగే సభకు 15 వేల మంది దివ్యాంగులు రావాలి.కేసీఆర్ కు బీజేపీ అంటేనే ఒణుకు వస్తుంది.
కేసీఆర్ ఏమీ ఇవ్వడు… కేసీఆర్ ఏదో ఇస్తాడు… ఏదో ఇవ్వాలని పోరాటం చేయకండి.గడీలను బద్దలు కొట్టాలి…పేదల ప్రభుత్వం ఏర్పాటు చేయాలి.కష్టించే తత్వం దివ్యాంగుల సొంతం.రాజకీయ పార్టీలే దివ్యాంగుల వద్దకు వచ్చేలా.. దివ్యాంగులు కొట్లాడాలి… హక్కులు సాధించుకోవాలి.మార్పు వస్తే తప్ప మీకు న్యాయం జరగదు.కేసీఆర్ మీకు ఒక వీల్చైర్ ఇచ్చి, లక్ష ఓట్లు వేయించుకుంటాడు.తెలంగాణలో పుట్టబోయే పిల్లగాడి పైనా లక్ష రూపాయల అప్పు ఉంది.దివ్యాంగులు తలుచుకుంటే కేసీఆర్ గద్దె దిగడం ఖాయం.దివ్యాంగుల వెనుక తెలంగాణ సమాజం ఉంది. బీజేపీ ఉంది. మోదీ ఉన్నారు.”ప్రజా సంగ్రామ యాత్ర”కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన దివ్యాంగులు