కోయిల్ సాగర్ పనులను చూస్తే కోట శ్రీనివాసరావు గుర్తుకొస్తున్నరు

-కాలువ తవ్వి పనులు చేయకుండా కేసీఆర్ ప్రజలను ఊరిస్తున్నారు
-సొంత ప్రయోజనాలే జనం బాధ పట్టని నేత కేసీఆర్
-గ్రామాల్లోకి వస్తే టీఆర్ఎస్ నేతలను నిలదీయండి
-19వ రోజు పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

‘‘కోయిల్ సాగర్ కెనాల్ ను చూస్తే ‘అహనా పెళ్లంట’ సినిమాలో కోడిని కట్టేసి చికెన్ తింటున్న కోట శ్రీనివాసరావు సీన్ గుర్తుకొస్తోంది. కోయిల్ సాగర్ కాలువ కన్పిస్తుంది. నీళ్లు మాత్రం రావు. కేసీఆర్ కు సొంత ప్రయోజనాలుంటే తప్ప ఏ పని చేయని అవినీతి పరుడు’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 19వ రోజు నారాయణపేట నియోజకవర్గంలోని మణిపూర్ తండా మీదుగా రామకిష్టయ్య పల్లెదాకా పాదయాత్ర చేశారు. రామకిష్టయ్యపల్లిలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, ఇంఛార్జీ నాగూరావు నామోజీ, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి తదితరులతో కలిసి బండి సంజయ్ బీజేపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అక్కడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అందులోని ముఖ్యాంశాలు…

• కోయిల్ సాగర్ కెనాల్ ను చూస్తే ‘అహనా పెళ్లంట’ సినిమాలో కోడిని కట్టేసి చికెన్ తిన్నట్లుగా కోట శ్రీనివాసరావు చూపించిన నట గుర్తుకొస్తోంది. కోయిల్ సాగర్ కాలువకు నీళ్లు పారితే రామకిష్టయ్యపల్లెసహా ఈ ప్రాంతానికి రెండు పంటలొస్తాయి.

• గత ఎన్నికల్లో కోయిల్ సాగర్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ మాట తప్పారు. రైతుల ప్రయోజనాలు కేసీఆర్ కు పట్టవు. కేసీఆర్ కు లాభం జరుగుతుందంటే తప్ప ఏ పనీ చేయని నాయకుడు. ఈ ప్రాంతంలో కేసీఆర్ 300 ఎకరాల భూమిస్తే తప్ప ఇక్కడ పనులు చేపట్టే అవకాశం లేదు. వేల కోట్ల రూపాయల కమీషన్లు వస్తాయంటేనే కేసీఆర్ పనులు చేస్తారు.

• ఉపాధి కూలీల సొమ్మును 3 నెలలుగా ఇవ్వడం లేదు. ప్రతి ఉపాధి కూలీకి రూ.270లను కేంద్రం చెల్లిస్తోంది. ఆ సొమ్మును కూలీల ఖాతాల్లో వేయకుండా కేసీఆర్ జాప్యం చేస్తూ కూలీల పొట్ట గొడుతున్నారు.

• సాగు, తాగు నీళ్లు లేక ఈ ప్రాంత ప్రజలు అల్లాడుతుంటే… మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధ నీరిస్తున్నామని కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారు. ఈసారి టీఆర్ఎస్ నేతలు వస్తే నీళ్లేవని లదీయండి.

• పేదోళ్లకు మరో 5 నెలలపాటు రేషన్ బియ్యాన్ని ఉచితంగా సరఫరా చేసేందుకు సిద్ధమైతే… ఆ బియ్యాన్ని ఆపి కేసీఆర్ పేదల పొట్టకొడుతున్నారు.

• పేదోళ్లంతా ఏకమై కేసీఆర్ పాలనకు చరమ గీతం పాడాలి. బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి.

Leave a Reply