Suryaa.co.in

Telangana

మందుల ధరలు తగ్గించిన కేంద్రం

హైదరాబాద్‌: మధుమేహం, గుండె, కాలేయ జబ్బులు వంటి వ్యాధుల చికిత్సకు ఉపయో గించే 42 రకాల ఔషధాల ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. యాంటిసిడ్స్‌, మల్టీ విటమిన్‌, యాంటీ బయాటిక్స్‌ ధరలను తగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తగ్గిన ధరలను డీలర్లు, స్టాకిస్టులకు వెంటనే అందించాలని ఫార్మా కంపెనీలను ఆదేశించింది. ధరల తగ్గింపుతో 10 కోట్ల మందికి పైగా షుగర్‌ వ్యాధిగ్రస్తులు లబ్ధిపొందనున్నారు. ప్రపంచం లోనే అత్యధిక మంది షుగర్‌ వ్యాధిగ్రస్తులు ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటి. గుండె, కాలేయ జబ్బుల వారిపైన భారం తగ్గనుంది.

LEAVE A RESPONSE