Suryaa.co.in

Andhra Pradesh Telangana

తెలుగు రాష్ట్రాల్లో మృగశిర కార్తె

భారీగా చేపల విక్రయాలు

హైదరాబాద్: మృగశిర కార్తె రోజున చేపలు తింటే ఆరోగ్యం సిద్దిస్తుందని కొందరు నమ్ముతారు. డిమాండ్‌ నేపథ్యంలో వ్యాపారులు పెద్ద ఎత్తున చేపలను దిగుమతి చేస్తారు. నగరం లోనే అతి పెద్దదైన ముషీరాబాద్‌ చేపల మార్కెట్‌ కు మృగశిర కార్తెకు ఒక రోజు ముందే గురువారం చేపలు పెద్ద ఎత్తున దిగుమతి అయ్యాయి. సాధారణ రోజుల్లో మార్కెట్‌ లో 15 టన్నుల నుంచి 20 టన్నుల చేపల విక్రయాలు జరుగుతాయి.

మృగశిర కార్తె సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 50 టన్నుల నుంచి 70 టన్నుల చేపలు దిగుమతి అవుతాయని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్రంలో చేపల ఉత్పత్తి అధికం కావడంతో వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, నల్గొండ, చేవెళ్ల జిల్లాలతో పాటు ఏపీ లోని కైకలూరు, తెనాలి, ఆకువీడు ప్రాంతాల నుంచి చేపలను దిగుమతి చేసుకున్నట్లు ముషీరాబాద్‌ వ్యాపారి పూస గోరక్‌నాథ్‌ తెలిపారు.

LEAVE A RESPONSE